हैदराबाद: बीआरएस के पूर्व विधायक शकील के बेटे राहिल को गिरफ्तार कर लिया गया है। हैदराबाद आये राहील को पुलिस ने सोमवार को एयरपोर्ट पर हिरासत में लिया। मालूम हो कि प्रजा भवन में बैरिकेड को टक्कर मारने के मामले में पूर्व विधायक शकील का बेटा राहिल मुख्य आरोपी है। इस दुर्घटना के बाद राहील की जगह एक अन्य व्यक्ति को ड्राइवर बनाया गया और राहील दुबई भाग गया।
नतीजा यह हुआ कि पुलिस ने विभिन्न धाराओं के तहत मामला दर्ज कर दुबई भाग गये राहिल के खिलाफ लुकआउट नोटिस जारी कर दिया। इसी क्रम में आज हैदराबाद आते ही उसे पुलिस ने गिरफ्तार कर लिया। इस मामले में बोधन के पूर्व विधायक शकील को भी पुलिस ने आरोपियों की सूची में शामिल किया है। शकील के खिलाफ सबूतों के साथ छेड़छाड़ करने का आरोप लगाया गया।

CRIME : బీఆర్ఎస్ మాజీ MLA షకీల్ కొడుకు అరెస్ట్
హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌కు వచ్చిన రహీల్‌ను సోమవారం ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత రహీల్‌కు బదులుగా మరికొరిని డ్రైవర్‌గా చేర్చి రహీల్ దుబాయ్‌కి పారిపోయాడు.
దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దుబాయ్‌కి పరారు కావడంతో అతడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్‌కు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపైన అభియోగాలు మోపారు. (ఏజెన్సీలు)
