డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం, చిత్తశుద్ధితో పని చేస్తామని పూనారు ప్రతిన

హైదరాబాద్: జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పుష్పాంజలి ఘంటించారు. రాజ్యాంగ పరిరక్షణ కొరకు చిత్తశుద్ధితో పని చేస్తామని ప్రతిన పూనారు.

కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. ఏ.వి.ఎన్. రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి, గ్రేడ్ డైరెక్టర్ ప్రొ. సుధా రాణి, విద్యార్ది సేవల విభాగం డీన్ డా. బానోత్ లాల్, విద్యార్ది సేవల విభాగం డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి, ఈఏంఆర్ఆర్ సి డైరెక్టర్ డా. వడ్డాణం శ్రీనివాస్, పరీక్షల నియంత్రం అధికారి డా. పరాంకుశం వెంకట రమణ, డా. బానోత్ ధర్మ, ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డా. భోజు శ్రీనివాస్, నాయకులు రాజబాబు, గోపాల కృష్ణ, దివాకర్ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

గాంధీ భవన్…

మరోవైపు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ గాంధీభవన్ లోని ఇందిర భవన్ లో టిపిసిసి ఆద్వర్యంలో వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన *Constitution Day సెమినార్ లో ముఖ్య అతిథిగా హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు, ఎఐసిసి కార్యదర్శి బోసురాజు, మాజీ పిసిసి అధ్యక్షులు విహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, గౌడ్, టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు.

రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామని కాంగ్రెస్ శ్రేణులతో ప్రమాణం చేయించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ గాంధీభవన్ లోని ఇందిర భవన్ లో టిపిసిసి ఆద్వర్యంలో వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన *Constitution Day* సెమినార్ లో ముఖ్య అతిథిగా హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు, ఎఐసిసి కార్యదర్శి బోసురాజు, మాజీ పిసిసి అధ్యక్షులు విహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి,ఆర్. దామోదర్ రెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, గడ్డం వినోద్, , టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి, నిరంజన్ లతో పాటు మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, మైనారిటీ సెల్, సేవదల్, ఫిషేర్మెన్ కాంగ్రెస్, ఆర్.జి.పి.ఆర్.ఎస్, ఎస్టి, తదితరులు పాల్గొన్నారు.

మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు కామెంట్స్…

రాజకీయాలు ప్రాంతం కోసం దేశం కోసం ప్రజల కోసం అనే విషయాన్ని గుర్తు చేయడానికి రాజకీయ నాయకులు పార్టీలకు హెచ్చరికగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం… ఈ దేశం ఈ స్థాయికి రావడానికి వేసిన పునాదులు మీద ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలి… రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ఎందుకు చేస్తున్నారు అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి… భారతదేశం అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం… అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశానికి వరం… 8 రాష్ట్రాల్లో ప్రభుత్వం కూల్చిన బీజేపీ కి చిత్త శుద్ది ఉంటే పార్టీల ఫిరాయింపుల చట్టంలో సవరణ చేయాలి… పార్టీ ఫిరాయింపు దారుల మీద రాజ్యాంగ బద్దంగా చర్యలు తీసుకోవాలి… ఈ నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలె కాంగ్రెస్ పార్టీ కూడా మొదటినుంచి చేసి ఉంటె ఈ నాయకుల కు ప్రభుత్వాలకు అవకాశం వచ్చేదా? మోడీ గారు ఈ దినాన్ని జరుపుకోవడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఈ తరం గౌరవ ప్రదంగా జీవించడానికి & ముందు తరాలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా సంక్షేమం అభివృద్ధి పథకాలకు బడ్జెట్ లో సమ తూకం ( అప్పులు, పెట్టుబడులు ) భాద్యయత రాష్ట్ర కేంద్ర ప్రబుత్వాలది . అందుకే Fiscal Responsibility & Budget Management Act ( FRBM ) . దోపిడీ కోణం లో ఇది ఉల్లంఘించ బడుతున్నది. ఎన్నికల ముసాయిదాలు , ఎన్నికల ముందు హామీలు వాగ్దానాలు కూడా చట్ట పరిదులోనికి తీసుకు రావాల్సిన అవసరం ఈ రోజు ఆలోచింవాల్సిన విషయం. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేక 46 రోజుల్లో రాజినామ చేసిన British Prime Minister మన ముందు కనపడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్ట ఉల్లంఘనలకు చరమ గీతం ఈ రోజు ఆలోచించాల్సిన అంశం కాదా? తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేస్తున్నారా ?

ట్యాంక్ బండ్ …

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ అంబేత్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన వి.హెచ్, సంభాని చంద్రశేఖర్ తదితరులు

BJP…

TRS…

73 భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగరంలోని అంబేద్కర్ విగ్రహానికి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. అనంతరం మానే రివర్ ఫ్రంట్, తీగల వంతెన అప్రోచ్ పనులను పరిశీలించారు, అధికారులకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్,డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కలెక్టర్ ఆర్వి కర్ణన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X