సికింద్రాబాద్: బంగారు తెలంగాణ లో ప్రజల బతుకులు మారలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదం సంతోష్ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చేపట్టిన బస్తీ పోరు కార్యక్రమంను నిర్వహించారు. కాంగ్రెస్ అధ్వర్యంలో బౌద్దనగర్ డివిజన్ అశోక్ నగర్ లో చేపట్టిన బస్తీ పోరు కార్యక్రమం కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు అదం సంతోష్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఆదాం సంతోష్ మాట్లాడుతూ… నియోజకవర్గములో 10 వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారని, ఇప్పటివరకు 500 కూడా నిర్మాణం పూర్తి చేయలేదు అని తెలిపారు. మాటల గారడితో నియోజకవర్గములోని బౌద్ధ నగర్ డివిజన్ ను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారు అని, అడ్డగుట్ట ఏర్పడి 40 ఏళ్ళు గడిచినా డ్రైనేజ్ వ్యవస్థలో మార్పు రాలేదన్నారు. నాళాల ఆధునీకరణ జరగలేదనీ, నియోజకవర్గములో ఇంటర్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు అయినా సొంత భవనాలు, కనీస వసతులు లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారనీ ఆవేదన వ్యక్తంచేశారు. ట్రాఫిక్ సమస్య పరిస్కారం కోసం రోడ్ల విస్తరణ జరిగలేదని, మెట్టుగూడ స్మశాన వాటికలో ఆక్రమణలను తొలిగించలేదని, కనీసం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని సంతోష్ మండిపడ్డారు.
NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదం సృజన్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా సమస్యల సాధనకు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేం లేదని ఆదo సృజన్ ఆరోపించారు. ప్రజల కన్నీళ్లు తుడిచే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బిఅరెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సృజన్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అనిల్, జయరాజ్, కరీం, సందీప్ రాజ్ కార్తిక్, బబ్లూ, చక్రం, సతీష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.