Article: సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి

◉ హైదరాబాద్ లో గల్ఫ్ దేశాల కాన్సులేట్ లు ఏర్పాటు చేయాలి

◉ ఖతర్ లో ప్రాణాలు అర్పించిన కూలీలకు పరిహారం చెల్లించాలి

బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో ప్రవాస భారతీయులు, ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల పాత్ర మరువలేనిది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బహుజన ప్రవాసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉద్యమ ఆకాంక్షను పెంపొందించడంలో ఎంతో కృషి చేశారు.

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ ను కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. గల్ఫ్ వలస కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన ‘ప్రవాసీ యోగక్షేమ’ అనే పథకం ప్రవేశపెట్టాలి. ఆహార భద్రత, పెన్షన్ మరియు ఆరోగ్యశ్రీ పథకాన్ని గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబాలకు వర్తింపజేయాలి. .

● హైదరాబాద్ లో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి.

● ప్రవాసి భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణంను కూడా చేర్చాలి. పాస్ పోర్ట్ స్టేటస్ తో సంబంధం లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయాలి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

● కరోనా సందర్భంగా గల్ఫ్ తదితర దేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి ‘ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్’ (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం కోసం బాధితుల పక్షాన భారత ప్రభుత్వం నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి.

ప్రాణాలు అర్పించిన కూలీలను విస్మరించిన ఖతార్ ప్రభుత్వం

ఖతర్ లో గత పదేళ్లలో 2,711 మంది భారతీయ వలస కార్మికులు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ఫుట్ బాల్ స్టేడియాలు, సంబంధిత నిర్మాణాలలో, ఇతర పనులలో పాల్గొన్నవారు. ఇందులో తెలంగాణ కు చెందిన వారు 100 మంది వరకు ఉన్నట్లు అంచనా.

వలస కార్మికుల చెమట చుక్కలతో నిర్మించిన నిర్మాణాలలో ఫిఫా ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీలు నిర్వహిస్తున్న ఫిఫా కమిటీ, ఖతర్ ప్రభుత్వం 17 బిలియన్ యూఎస్ డాలర్లు (రూ. లక్షా 40 వేల కోట్లు) లాభం ఆర్జిస్తున్నాయి. అయినా మృతులకు పరిహారం ఇవ్వడం లేదు. ఖతర్ మృతులకు పరిహారం ఇప్పించడానికి భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేయాలి.

ఇట్లు

అంబాసిడర్ డా. బి. ఎం. వినోద్ కుమార్, చైర్మన్
టిపిసిసి ఎన్నారై సెల్.

సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ కన్వీనర్
టిపిసిసి ఎన్నారై సెల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X