हैदराबाद: मुख्यमंत्री के चंद्रशेखर राव (KCR) ने बुधवार को तेलंगाना के लोगों को भगवान गणेश चतुर्थी के उत्सव के अवसर पर बधाई दी। उन्होंने लोगों से शांति और सद्भाव का संदेश फैलाकर गणेश और नवरात्रि उत्सव को खुशी और उत्साह के साथ मनाने की कामना की।
मुख्यमंत्री ने याद किया कि हिंदू समुदाय भगवान गणेश को सभी शास्त्रों के प्रमुख, ज्ञान के स्वामी और विघ्नेश्वर के रूप में भी पूजा करते हैं। गणेश चतुर्थी सभी बाधाओं को दूर करने वाला। विनायक चतुर्थी का पर्व हमें ज्ञान की धार्मिकता, लक्ष्यों की प्राप्ति, नैतिक मूल्यों और प्रकृति के संरक्षण की शिक्षा देता है।
मुख्यमंत्री चंद्रशेखर राव ने कहा कि अन्य ताकतों द्वारा बनाई गई बाधाओं के बावजूद, राज्य सरकार भगवान गणेश के आशीर्वाद से समाज के सभी वर्गों की भलाई के लिए कल्याण और विकास कार्यक्रमों को लागू कर रही है। उन्होंने प्रार्थना की कि लोग एक सुखी और शांतिपूर्ण जीवन व्यतीत करें। अपने काम को लगातार आगे बढ़ाएं और भगवान गणेश देश के सभी लोगों पर आशीर्वाद दें।
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. (एजेंसियां)