हैदराबाद : मुख्यमंत्री केसीआर ने नए सचिवालय के उद्घाटन के अवसर पर तेलंगाना के लोगों को बधाई दी। उन्होंने कहा कि सचिवालय इसलिए बनाया गया है ताकि तेलंगाना की प्रतिष्ठा चमके। उन्होंने कहा कि सचिवालय का निर्माण अभिनव तरीके से किया गया है।
తెలంగాణ ప్రతిష్ఠ వెలుగులీనేలా సచివాలయం నిర్మాణం
హైదరాబాద్ : నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రతిష్ఠ వెలుగులీనేలా సచివాలయం నిర్మించామని పేర్కొన్నారు. వినూత్న రీతిలో అత్యద్భుతంగా సచివాలయం నిర్మించామన్నారు.
దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడం అని పేర్కొన్నారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సచివాలయం నిర్మించామని తెలిపారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. తాత్వికత సైద్ధాంతిక అవగాహనతోనే అంబేద్కర్ పేరు పెట్టామని కేసీఆర్ తెలిపారు.
సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన బౌద్ధ ఉపాసక్ మహాసభ
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడంతో పాటు 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు గానూ ది ప్రాక్టీసింగ్ బుద్దిస్ట్ సొసైటీ (బౌద్ధ ఉపాసక్ మహాసభ) వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు లక్నో నుంచి సొసైటీ ప్రధాన కార్యదర్శి కేఆర్ రావత్ సీఎం కేసీఆర్‌కు ఒక లేఖను పంపించారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా. బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడం, హుస్సేన్ సాగర్ తీరాన ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గొప్ప విషయం. ఈ దిశగా మీరు వేసిన అడుగు అంబేద్కర్ భావజాలాన్ని విశ్వసించే వారికి శభువార్తగా సంతోషాన్ని కలిగిస్తున్నది.
ఇంత గొప్ప కార్యాన్ని చేపట్టిన మీకు, బౌద్ధ ఉపాసక్ మహాసభ కోటి కోటి అభినందనలు తెలియజేస్తున్నది. అనునిత్యం ఇటువంటి విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టేలా, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరింతగా కృషి కొనసాగించేలా, మీకు సదా ఆయురారోగ్యాలను సుఖసంతోషాలను శక్తిని ప్రసాదించాలని, ఆ బుధ్ధ భగవానున్ని ప్రార్థిస్తున్నాము అంటూ, ది ప్రాక్టీసింగ్ బుద్ధిస్ట్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కేఆర్ రావత్ తమ లేఖలో పేర్కొన్నారు. (ఏజెన్సీలు)