హైదరాబాద్ : గాంధీ భవన్ ఆవరణలో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్టమస్ వేడుకలుకు హాజరైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, హైదరాబాద్ అధ్యక్షులు సమీరుల్లా, నాయకులు వినోద్ రెడ్డి, చెరుకు సుధాకర్, శివసేనారెడ్డి, సునీత రావ్, జగన్ లాల్, శ్రవణ్ కుమార్ రెడ్డి, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు.
దేశంలో దళితులకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ కు ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ, అభిమానానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే ఉదాహరణ అని చెప్పారు. దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేసే దమ్ము మిగతా పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో భట్టి విక్రమార్కకు సీఎల్పీ నేతగా ఎన్నుకున్నామని, కానీ ఆ హోదాను చూసి ఓర్వలేని సీఎం కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. ఇందిరమ్మ హయాంలో 24 లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ సొంతమన్న రేవంత్ రెడ్డి వాటిని ఇప్పుడు బీఆర్ఎస్ గుంజుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మండలంలో క్రిస్టియన్ స్మశానవాటిక ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల కోసమే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్… బీఆర్ఎస్ గా మారినా వీఆర్ఎస్ గా మారినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే ఉన్నారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, మోడీ ఒక్కటేనని, బీఆర్ఎస్ కు ఓటేస్తే పరోక్షంగా మోడీకి వేసినట్లేనని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్ని శక్తులు కలిసి రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యాయంశాలు..
కాంగ్రెస్ పార్టీ జనరంజక పాలన అందించే గొప్ప నాయకులను అందించింది.
దేశంలో దళితులకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది.
ఏఐసీసీ అధ్యక్షుడుగా ఖర్గే ను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది.
దళితుడిని అధ్యక్షుడిని చేసే దమ్ము మిగతా పార్టీలకు ఉందా?
దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ, అభిమానానికి మల్లికార్జున ఖర్గే గారే ఉదాహరణ
తెలంగాణలో మల్లు భట్టి విక్రమార్కకు సీఎల్పీ నేతగా ఎన్నుకున్నాం
కానీ ఆ హోదాను చూసి ఓర్వలేని కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేశారు.
కాంగ్రెస్ వేదిక ఉంటేనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
ఇందిరమ్మ హయాంలో 24లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ ది.
కాంగ్రెస్ ఇస్తే బీఆరెస్ వాటిని గుంజుకుంటుంది. బీజేపీ చోద్యం చూస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటాం
మా ప్రభుత్వంలో ప్రతీ మండలంలో ఒక క్రిస్టియన్ స్మశానవాటిక ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం.
బడుగు,బలహీన, మైనారిటీ వర్గాల కోసమే రాహుల్ పాదయాత్ర
ఆయనకు ప్రభువు ఆశీర్వాదం మెండుగా ఉంది.
ఇక్కడ బీఆరెస్, అక్కడ వైసీపీ ఇద్దరూ పరోక్షంగా మోదీకి సహకరిస్తున్నవారే.
బీఆరెస్ కు వేసే ఓటు పరోక్షంగా మోదీకి చేరుతోంది
ప్రాంతీయ పార్టీలు ప్రమాదకరంగా తయారయ్యాయి.
టీఆరెస్ బీఆరెస్ గా మారినా.. వీఆరెస్ గా మారినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని శక్తులు కలిసి రావాలి
బీఆరెస్, బీజేపీ లకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుదాం