‘उनसे’ शादी करने वालों को दो लाख रुपये, मुख्यमंत्री रेवंत रेड्डी का अहम ऐलान ‘వారిని’ పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు

हैदराबाद : मुख्यमंत्री रेवंत रेड्डी ने कहा कि तेलंगाना सरकार दिव्यांगों को मानवीय मदद दे रही है। सरकार दिव्यांगों को अपने परिवार का सदस्य मानती है। इसलिए हमारी सरकार दिव्यांग समाज में आत्म-सम्मान के साथ खड़े हों। उन्होंने कहा कि हम उन्हें 50 करोड़ रुपये से सहायक उपकरण बांट रहे हैं।

मुख्यमंत्री रेवंत रेड्डी ने प्रजा भवन में प्रणाम बुज़ुर्ग डे केयर सेंटर और बाल भरोसा स्कीम में दिव्यांगों को सहायक उपकरण वितरण कार्य का उद्घाटन किया। इस मौके पर रेवंत रेड्डी ने कहा कि दिव्यांगों के दिव्यांगों से शादी करने पर दो लाख रुपये की आर्थिक मदद देने का फैसला किया गया है। उन्होंने बताया कि अगर दूसरे व्यक्ति दिव्यांगों से शादी करते हैं तो भी आर्थिक मदद दी जाएगी। उन्होंने कहा कि दिव्यांगों को सरकारी नौकरियों में सही जगह दी जाएगी।

मुख्यमंत्री ने आगे कहा कि हमारी सरकार पढ़ाई, नौकरी और खेल में अच्छा करने वाले दिव्यांगों को बढ़ावा देने के लिए काम कर रही है और दिव्यांगों को अपना आत्मविश्वास नहीं खोना चाहिए। उन्होंने कहा कि दिव्यांगों को स्पोर्ट्स में बढ़ावा देने के लिए पैरालिंपिक जीतने वाली एक लड़की को नौकरी दी गई। उन्होंने कहा कि दिव्यांगों को सरकार से मिले मौकों का इस्तेमाल करना चाहिए और आगे बढ़ना चाहिए। उन्होंने कहा कि सुदिनी जयपाल रेड्डी इस इलाके के दिव्यांगों के लिए प्रेरणा हैं। उन्होंने कहा कि जयपाल रेड्डी दिव्यांग होने का ख्याल मन में लाए बिना ही एक महान सांसद बन गए हैं।

Also Read-

‘వారిని’ పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దివ్యాంగులను ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తోందని అందుకే దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామన్నారు.

ప్రజాభవన్‍లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ, ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు, బాల భరోసా పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకుంటే రూ.2 లక్ష ఆర్థిక సాయం అందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థిక సయం అందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తామన్నారు.

విద్యా, ఉద్యోగాలు, క్రీడల్లో రాణించిన దివ్యాంగులు ఏమాత్రం రాణించిన వారిని ప్రోత్సహించేలా మా ప్రభుత్వం పని చేస్తోందని దివ్యాంగులు ఏ మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుని దివ్యాంగులు ఎదగాలన్నారు. ఈ ప్రాంతంలో దివ్యాంగులకు సూదిని జైపాల్ రెడ్డి స్ఫూర్తి అన్నారు. వైకల్యం ఉందనే ఆలోచనలను కూడా జైపాల్ రెడ్డి రానివ్వకుండా ఉత్తమ పార్లమెంటెరియన్ గా ఎదిగారన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X