बस दुर्घटना में 12 यात्रियों के ज़िंदा जलने पर मुख्यमंत्री चंद्रबाबू ने जताया गहरा दुख, दिये ये आदेश

हैदराबाद: मुख्यमंत्री चंद्रबाबू नायुडू ने आंध्र प्रदेश की मरकापुरम ज़िले में रायवरम के पास हुए भयानक सड़क एक्सीडेंट पर गहरा दुख जताया। उन्होंने प्राइवेट ट्रैवल बस के एक टिपर से टकराने और यात्रियों के आग में ज़िंदा जलने पर गहरा दुख जताया।

दुर्घटना के बारे में पता चलते ही मुख्यमंत्री ने मरकापुरम ज़िला प्रशासन से फ़ोन पर बात की। उन्होंने अधिकारियों से घायलों की हालत के बारे में जानकारी ली। अधिकारियों ने मुख्यमंत्री को बताया कि लगभग 20 घायल लोगों को अलग-अलग अस्पतालों में भर्ती कराया गया है और उनका इलाज चल रहा है। चंद्रबाबू ने इस जानकारी पर चिंता जताई कि मरने वालों की संख्या बढ़ सकती है।

मुख्यमंत्री ने ज़िला पुलिस प्रशासन को तुरंत दुर्घटना के कारणों की जांच करने और पूरी रिपोर्ट देने का आदेश दिया। उन्होंने अधिकारियों को सलाह दी कि वे यह पक्का करें कि पीड़ितों को बेहतर इलाज मिले और मृतकों के परिवारों के साथ खड़े हैं।

संबंधित खबर-

బస్సు ప్రమాదంలో 12 మంది సజీవదహనంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్ : మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్‌ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడం, మంటలు చెలరేగి అందులోని ప్రయాణికులు సజీవదహనం కావడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా యంత్రాంగంతో ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సుమారు 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే దర్యాప్తు జరిపి, పూర్తి నివేదిక అందజేయాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X