హైదరాబాద్ : టాలీవుడ్ సినిమా ఇండస్ర్టీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. ఆదివారం హైదరాబాద్ లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చలపతిరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు ఒక్కొక్కరుగా చలపతిరావు కుమారుడు రవిబాబు ఇంటికి చేరుకున్నారు మరియు చేరుకుంటున్నారు.
శ్రీ బండి సంజయ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు & బిజెపి రాష్ట్ర అధ్యక్షులు విడుదల చేసిన ప్రకటన
ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ చలపతిరావు నేడు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. తెలుగు చలనచిత్ర రంగంలో వరుసగా ప్రముఖ నటులు మరణించడం తెలుగు చలనచిత్ర రంగంలో సినిమా రంగానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తులు కోల్పోవడం తీరని లోటు. నాటక రంగంలో ప్రవేశించిన అనంతరం తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ ప్రతి నాయకుడిగా, హాస్యనటుడిగా, కుటుంబ కథా చిత్రాలలో, పౌరాణిక చిత్రాలలో నటించి తెలుగు ప్రజలను మెప్పించిన వ్యక్తి. విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. వారి మరణం తెలుగు ప్రజలకు, తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. శ్రీ చలపతిరావు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.
కుటుంబ సభ్యుడిని కోల్పోయాం : ఎన్టీఆర్
‘‘చలపతిరావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన ఆయన మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన’’
నందమూరి కల్యాణ్ రామ్ సంతాపం
చలపతిరావు మృతిపట్ల నందమూరి కల్యాణ్ రామ్ సంతాపం వ్యక్తం చేశారు. ‘చలపతిరావు బాబాయి అంటే నాకు ఒక వ్యక్తిగా, నా కుటుంబానికి కూడా చాలా ఇష్టం. ఆయన ఆకస్మిక మరణం మా కుటుంబం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది’ అని ట్వీట్ చేశారు.
ఇండస్ట్రీకి తీరని లోటు : వివేక్ వెంకటస్వామి
ప్రముఖ సీనియర్ నటులు చలపతిరావు మృతిపట్ల బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సంతాపం తెలిపారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చలపతిరావు మృతి ఇండస్ట్రీకి తీరని లోటని వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ సంతాపం
చలపతిరావు కన్నుమూయడం చాలా బాధాకరమని పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలి నటనను చూపించారని గుర్తు చేసుకున్నారు. చలపతిరావు కుమారుడు రవిబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రబాబు సంతాపం
చలపతిరావు మృతిపట్ల తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు.
ప్రముఖ తెలుగు సినిమా నటులు చలపతి రావ్ ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి
“తన విలక్షణ నటనతో చలపతిరావు తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటులు అయ్యారు. ఆయన మరణం తెలుగు చిత్రరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది వరసగా సీనియర్ నటులు మృతి చెందడం బాధగా ఉంది. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల. సత్యనారాయణ, చలపతి రావ్ లు వరసగా మరణించడం చిత్రరంగానికి లోటు.”
తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది: చిరంజీవి
సీనియర్ యాక్టర్ చలపతిరావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
‘‘విక్షణమైన నటుడు, తనదైన శైలితో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావుగారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది. ఎన్నో చిత్రాల్లో ఆయనతో నేను కలిసి నటించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబుకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.’’
విలక్షణమైన నటనతో అలరించారు : బాలకృష్ణ
‘‘చలపతిరావు హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో ఆయనకు ఆత్మీయ బంధం ఉంది. నాన్నగారితో కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషించారు. ఆయన మా కుటుంబ సభ్యుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’
Related News:
అందరితో స్నేహంగా ఉండేవారు : దగ్గుబాటి సురేశ్
‘‘చలపతిరావు ఎంతో మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ప్రమాదం తర్వాత నుంచి ఆయన ఎక్కువగా బయటకు రాలేదు. ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉండేవారు. జోకులు వేస్తూ అందర్నీ నవ్వించేవారు. ఆయన మాకెంతో ఆప్తుడు. మూడు రోజుల క్రితం కూడా షూట్‌లో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వరుసగా మృతి చెందడం దురదృష్టకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’
మరణవార్త కలిచివేసింది : చిరంజీవి
చలపతిరావు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘‘విలక్షణమైన నటుడు, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావు అకాల మరణ వార్త కలచివేసింది. ఎన్నో చిత్రాల్లో చలపతిరావుతో కలిసి నటించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. రవిబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి’’
కుటుంబ సభ్యుడిని కోల్పోయాం : ఎన్టీఆర్
‘‘చలపతిరావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన ఆయన మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన’’
ముత్యాల సుబ్బయ్య
‘‘చలపతి రావు నాకు ఆప్త మిత్రుడు. నేను తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు’’.
ఢిల్లీ రాజేశ్వరీ
‘‘ఇండస్ట్రీలో నా ఆప్తమిత్రుడు. మంచి మనసున్న మనిషి. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. ఇటీవల ఆయనతో మాట్లాడాను. త్వరలో కలుద్దాం అనుకున్నాం. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరం’’