బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ధి వేడుకలు

హైదరాబాద్‌ : బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్1, జూన్2, జూన్3 తేదీల్లో మూడు రోజులపాటు బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగనున్నాయి.

జూన్ ఒకటవ తేదీ నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు.

తెలంగాణ ఆవిర్భావ రోజు అంటే జూన్ రెండవ తేదీన తెలంగాణ ఆవిర్భావమై దశాబ్ధి కాలం గడుస్తున్న నేపధ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్లోని పార్టీ కేంద్రకార్యాలయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ఇదే రోజు హైదరాబాద్లో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇది కూడా చదవండి

జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బిఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను మరియు జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానల్లో అనాథాశరణాలయాల్లో స్వీట్లు పండ్లు పంపిణీ చేస్తారు.

తెలంగాణ ను సాధించి, స్వరాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధినేత పిలుపునిచ్చారు. గ్రామస్థాయినుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు నేతలను కోరినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X