పెండింగ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి కోసం 437 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం

ఇక శరవేగంగా గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు

గత 10 ఏళ్లుగా నిధుల కేటాయింపు లో బిఆరెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం

హుస్నాబాద్ ఎమ్మెల్యే గా రాష్ట్ర మంత్రి అయిన తరువాత మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తో ప్రాధానత్య గల ప్రాజెక్ట్ ల లిస్ట్ లో గౌరవెల్లి

త్వరితగతిన పూర్తి చేయాలని క్యాబినెట్ లో చర్చ

ఫలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రాంగం

ప్రాజెక్ట్ త్వరగా పూర్తయితే త్వరలోనే గోదావరి నీళ్ల తో సస్యశ్యామలం కానున్న హుస్నాబాద్ బీడు భూములు

క్యాబినెట్ నిర్ణయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

క్యాబినెట్ నిర్ణయం పట్ల హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆనందోత్సాహాలు

హైదరాబాద్ : గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టుకు స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవ తో ఇక చక చకా పనులు కొనసాగనున్నాయి. ప్రాజెక్ట్ ప్రధాన కాలువల భూసేకరణ తదితర అంశాలు పెండింగ్ లో ఉన్నందున ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే పనులు పూర్తి చేసుకొని హుస్నాబాద్ తో పాటు పాటు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లో బీడు భూములకు గోదావరి జలాలు తరలివచ్చి అక్కడ పంటలతో సస్యశ్యామలం చేయనున్నాయి.

గౌరవెల్లి ప్రాజెక్ట్ తో పాటు ఎస్ఆర్ఎస్పీ – ఐఎఫ్ఎఫ్సి లోని ప్యాకేజీ నంబర్ -7 లోని పెండింగ్ పనుల పూర్తి చేయడానికి రూ437 కోట్ల రూపాయలు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సవరించిన అంచనా ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తయితే లక్షా ఆరు వేల (1,06,000 )ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు ,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో ఉన్న రెండు ప్రధాన కాలువల్లో కుడి కాలువ ద్వారా 90,000 ఎకరాలు ,ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దీంతో పనులు నత్తనడకన సాగాయి. దీని తరువాత శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ లో పూర్తి చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇక్కడ రైతులకు నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది.

ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి. 13.07.2007 న ఈ ప్రాజెక్ట్ ను ఎస్ఆర్ఎస్పి రెండవ దశ లో వరద ప్రవాహ కాలువ ప్రాజెక్ట్ కింద పనులు చేపట్టడానికి రూ.913.15 కోట్ల రూపాయల తో పనులు చేపట్టడానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. సంబంధిత రిజర్వాయర్ కాలువ పనులు చేపట్టడానికి ప్యాకేజీ -7 లో రూ. 278.58 కోట్ల రూపాయలను సమకూర్చింది. ఈ ప్రాజెక్ట్ కు అవసరమైన భూమి – 3919 ఎకరాలు కాగా ,సేకరించిన భూమి 1676 ఎకరాలు , సేకరించవలిసిన మిగులు భూమి 2243 ఎకరాలు గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో సిడి అండ్ సిఎం పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కేటాయించిన నిధులతో పనుల్లో వేగం పుంజుకోనుంది.

పొన్నం ప్రభాకర్ గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గా అయినా తరువాత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్ట్ ల లిస్ట్ లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ను చేర్చి తన కమిట్మెంట్ ను నిరూపించుకున్నారు. గతంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై 2023 మార్చ్ 2 వ తేదిన పొన్నం ప్రభాకర్ లతో కలిసి పిసిసి చీఫ్ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ను సందర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రాజెక్ట్ ను సందర్శించినప్పుడు కుర్చివేసుకొని ప్రాజెక్ట్ పూర్తి చేస్తన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ప్రారంభించింది కాంగ్రెస్ అని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ అని ఆరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించారు.గౌరవేల్లి ప్రాజెక్ట్ పురోగతి పై మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్యం వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగా హుస్నాబాద్ లో సిద్దిపేట జిల్లా అధికారులతో క్యాంప్ ఆఫిస్ లొ రివ్యూ నిర్వహించారు.

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు భూసేకరణ పై రెవెన్యూ అధికారులు ,ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.హుస్నాబాద్ IOC లో మూడు జిల్లాల కలెక్టర్ లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.గౌరవెళ్లి ప్రాజెక్ట్ కాలువల నిర్మాణానికి వేగవంతంగా భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.క్యాబినెట్ లో పలు సందర్భాల్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ అవసరాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారు.నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ,ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్ట్ అవసరాలను వివరించారు. ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించేలా డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వద్ద గౌరవెల్లి ప్రాజెక్ట్ పై వివరణ ఇచ్చి నిధులు కేటాయించేలా చేశారు.

ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని క్యాబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హుస్నాబాద్ లో హర్షతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇంతపెద్ద నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,సహచర క్యాబినెట్ మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని నెర్రెలు బారిన పొరుగడ్డ హుస్నాబాద్ నియోజకవర్గంలో గోదావరి నీళ్ళు చేరి పాడి పంటలతో సస్యశ్యామలం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన జీవిత ఆశయం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు గౌరవెల్లి ద్వారా నీళ్ళు అందించడమే లక్ష్యమని ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశయాధన కోసం నిరాటంకంగా పని చేస్తున్నారు.

Also Read-

తెలంగాణ కేబినెట్‌ భేటీ వివరాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్

■ కేరళలో వయనాడ్ లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది.

■ నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు  జాబ్ క్యాలెండర్ ను కేబినేట్ ఆమోదించింది. అసెంబ్లీలో చర్చకు పెడుతుంది. 

■ రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినేట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవిన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

■ క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్ కు, సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది.

■ ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినేట్ తీర్మానించింది.

■ ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

■ గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది.

■ ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించింది. తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది.

■ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు అధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది.

■  మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్ పేట చెర్వు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెర్వులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X