हैदराबाद: एक युवक ने अपनी प्रेमिका के पिता की बेरहमी से चाकू मारकर हत्या कर दी। यह मामला आंध्र प्रदेश के विजयवाड़ा के बृंदावन कॉलोनी में प्रकाश में आया है। पुलिस ने संदेह जताया है कि युवती के पिता ने युवक को डांटने के कारण उसकी हत्या कर दी है।
मिली जानकारी के अनुसार, युवक व्यापारी की बेटी से चार साल प्रेम करता था। व्यापारी की बेटी इंजीनियरिंग की दूसरे वर्ष की पढ़ाई कर रही है। जबकि युवक शिवमणिकंठ एक स्कूल में शारीरिक शिक्षा शिक्षक (पीईटी) के रूप में काम कर रहा है। पता चला है कि दोनों की मुलाकात इंस्टाग्राम पर हुई। पिता रामचन्द्र प्रसाद को हाल ही में पता चला कि दोनों के बीच प्रेम संबंध चल रहा है। इसी क्रम में शिवमणिकंठ को प्रेमिका के पिता ने डांटा और उसकी बेटी से दूर रहने की धमकी दी। साथ ही उनके प्रेम प्रसंग के बारे में पिता को पता चल जाने के कारण प्रेमिका ने भी प्रेमी से दूर रहना शुरू कर दिया।
पता चला है कि प्रेमी मणिकंठ के शादी के प्रस्ताव को भी प्रेमिका ने ठुकरा दिया। इसी बात को लेकर शिवमणिकंठ के घर में झगड़ा शुरू हो गया। परिणामस्वरूप युवक की मां हाल ही में घर छोड़कर चली गयी है। इसके चलते युवक ने प्रेमिका से पिता से नाराज हो गया। गुरुवार को रामचन्द्र प्रसाद अपनी पुत्री के साथ किराणा दुकान आया और रात 9 बजे दुकान बंद करके घर जाने के लिए दोनों बाइक पर रवाना हो गये।
यह भी पढ़ें-
उसी समय दुकान से थोड़ी दूरी पर घात लगाये बैठे मणिकंठ ने पिता और बेटी की बाइक को अपनी बाइक से टक्कर मार दी। जब दोनों नीचे गिर गए तो उसने लड़की के पिता पर चाकू से अंधाधुंध हमला कर दिया। गंभीर रूप से घायल रामचंद्र प्रसाद को स्थानीय लोगों ने अस्पताल पहुंचाया, जहां डॉक्टरों ने पुष्टि की कि उसकी पहले ही मौत हो चुकी है। कृष्णलंका पुलिस ने घटना स्थल का निरीक्षण किया और मणिकंठ को गिरफ्तार किया है। आगे की कार्रवाई की जा रही है।
ప్రియురాలి తండ్రిని కిరాతకంగా చంపిన యువకుడు
హైదరాబాద్ : ప్రియురాలి తండ్రిని యువకుడు కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఏపీ విజయవాడలోని బృందవాన్ కాలనీలో చోటు చేసుకుంది. వ్యాపారి కుమార్తెను యువకుడు ప్రేమిస్తున్నట్లు తెలిసింది. కాగా యువతి తండ్రి యువకుడిని మందలించడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వ్యాపారి కుమార్తె ఇంజినీరింగ్ సెంకండ్ ఇయర్ చదువుతుండగా, ఓ పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడు(పీఈటీ)గా శివమణికంఠ పనిచేస్తున్నాడు. వీరిద్దరికి ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. నాలుగేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉండగా తండ్రి రామచంద్ర ప్రసాద్‌కు విషయం తెలిసింది. శివమణికంఠను యువతి తండ్రి మందలించినట్లు సమాచారం. తండ్రికి విషయం తెలియడంతో యువతి యువకుడిని దూరం పెడుతూ వస్తోంది.
పెళ్లి ప్రతిపాదనను సైతం తిరస్కరించినట్లు తెలిసింది. ఇదే విషయమై శివ మణికంఠ ఇంట్లో గొడలు స్టార్ట్ కాగా యువకుడి తల్లి ఇటీవల ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో యువకుడు యువతి తండ్రిపై పగ పెంచుకున్నాడు. శ్రీరామచంద్రప్రసాద్ కుమార్తెతో కలిసి కిరాణషాపునకు రాగా రాత్రి 9 గంటలకు షాపు మూసి ఇంటికి బయల్దేరారు.
ఆ సమయంలో షాపునకు కొద్ది దూరంలోనే కాపుకాసిన మణికంఠ తండ్రీ కూతుళ్లు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తన బైక్‌తో ఢీకొట్టాడు. వారు కిందపడిపోగా యువతి తండ్రిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు రామచంద్రప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మణికంఠను అరెస్ట్ చేశారు. (ఏజెన్సీలు)