BRS Working President KTR Writes An Open Letter To The NDA Government NEET Exam Fiasco

BRS Working President KTR Slams Center Over NEET UG Exam Issues

Center’s apathy puts future of millions of students at risk

Parents distressed by confusion over grace marks and paper leaks

PM Modi and central ministers, who engage in Pariksha Pe Charcha, must address the NEET issue

Comprehensive investigation required; immediate punishment for those responsible

Ensure hard-working students do not suffer

Hyderabad: BRS Working President K.T. Rama Rao (KTR) has criticized the handling of the NEET exam, stating that the confusion surrounding the examination has dashed the hopes of students and parents who dream of seeing their children become doctors. KTR condemned the central government for its inaction despite reports that NEET question papers were being sold in Bihar for up to 30 lakhs each, with several arrests already made. He accused the central government of neglecting its responsibility and adopting a lackadaisical attitude towards the NEET entrance exam from the outset.

KTR pointed out that despite numerous allegations and suspicions surrounding the prestigious NEET exam, the Modi government has not yet responded, which he found unacceptable. He questioned why the Prime Minister, who frequently holds discussions with students about exams, has remained silent on the critical issue of NEET. In his open letter to the NDA government, KTR demanded a thorough investigation into the entire matter and strict action against those found responsible. He also called for reassurance to be given to students and their parents.

KTR highlighted the unprecedented scenario of 67 students achieving the first rank in NEET, which raised numerous suspicions. He noted that eight students from the same center scored 720 marks each, suggesting a significant level of paper leakage. He reminded that even a single mark difference can change students’ rankings and result in many losing opportunities. KTR questioned how so many students from one center could score such high marks and criticized the announcement of results ten days early, coinciding with the election results day, which added to the suspicions.

also read-

KTR demanded an explanation from the central government for not taking action despite the gravity of the situation coming to light. He also criticized Union Minister Dharmendra Pradhan for attempting to cover up the issue by claiming everything was in order.

KTR emphasized that despite numerous complaints from students, the central government has not responded. Even prominent individuals filing cases in the Supreme Court did not prompt a clarification from the center. He expressed surprise that the central government ignored the issue until the Supreme Court intervened and noted that the National Testing Agency (NTA) provided unusual responses when questioned.

The issue of awarding grace marks in NEET this year to 1563 students was also criticized by KTR, who pointed out that the practice of grace marks is not typically applied in exams like NEET. He demanded clarity on the criteria used for awarding these marks and questioned the NTA’s handling of the matter. KTR called for a comprehensive investigation into the allegations of paper leakage and demanded strict action against those involved.

He urged the MPs from Telangana to take steps to ensure that the state’s students do not suffer due to the irregularities in NEET. KTR asked for a full-scale inquiry to identify and punish the guilty parties and insisted that central ministers and MPs from the state put pressure on the NDA government. He demanded immediate action from the central government to address the issue and provide clarity to the public on who is responsible for the malpractices in NEET. KTR also called for measures to ensure that students affected by the irregularities are given justice without further inconvenience.

He emphasized that the issue is not limited to NEET but affects several competitive exams conducted under the NTA’s supervision, which could lead to a loss of trust among students. KTR called for stringent measures to prevent such incidents in the future and reassured that the BRS would fight for the rights of students affected by these irregularities.

నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై మండిపడ్డ కేటీఆర్

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోని కేంద్రం

ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన

పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు.. నీట్ వ్యవహారంపై స్పందించాలి

మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలి..వెంటనే బాధ్యులను శిక్షించాలి

కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ డిమాండ్

హైదరాబాద్ : కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మండిపడ్డారు. ఓవైపు బీహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు.

అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోడీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు… ప్రతీసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని.. కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.

అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

లక్షల మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసిన కేంద్రం స్పందించలేదని, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా ఒక్క వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చాలా చిత్రమైన సమాధానాలు చెప్పిందన్నారు. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని, అసలు నీట్ లాంటి ఎగ్జామ్ లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదని, అయినప్పటికీ ఎందుకిలా చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

1563 మంది విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారో దానికి ఏ ప్రాతిపదికను తీసుకున్నారో స్పష్టం చేయటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. +4, -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్ లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ మొత్తం అంశం వివాదం కావటంతో ఇప్పుడు ఎన్టీఏ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందన్నారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాకింగ్ నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతున్నారని మండిపడ్డారు.

ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీకైందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. దీనికి బలం చేకూరే విధంగా గుజరాత్, బీహార్ లో పోలీసులు నీట్ లో అవకతవకలు పాల్పడిన కొంతమందిని అరెస్ట్ చేశారని, వరుసగా బయటపడుతున్న వివాదస్పద వ్యవహారాల కారణంగా నీట్ ఎగ్జామ్ తీరుపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా అనుమానాలు బలపడుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X