Delhi Liquor Scam: एमएलसी के कविता बोली, “ईडी की जांच में शत प्रतिशत सहयोग करूंगी”

हैदराबाद: बीआरएस एमएलसी कल्वकुंट्ला कविता ने ईडी के नोटिस का जवाब दिया। ईडी की जांच में शत प्रतिशत सहयोग करूंगी। बीआरएस एमएलसी कविता ने साफ किया कि वह खुद ईडी के सामने आएगी और जांच का सामना करेगी। एमएलसी कविता ने दिल्ली में गुरुवार को मीडिया से बात की।

कविता ने खुलासा किया कि उसे 9 तारीख को जांच के लिए आने को कहा गया, लेकिन उन्होंने कहा कि वह 11 तारीख को आएगी। कविता ने साफ किया कि वह ईडी की जांच का सामना करेंगी और ईडी द्वारा पूछे गए सवालों का जवाब देंगी। डर क्यों? कविता ने कमेंट किया कि मैंने कुछ गलत नहीं किया है। विपक्ष की भी बात सुननी चाहिए। एमएलसी कविता ने स्पष्ट किया कि उनके साथ किसी के भी पूछने में कोई हर्ज नहीं है।

बीआरएस बीजेपी का विकल्प है

कविता ने कहा कि मोदी एक राष्ट्र और एक मित्र योजना लागू कर रहे हैं। बीजेपी के लिए बीआरएस वैकल्पिक है। महिला बिल की बात उठाई तो ईडी ने नोटिस दिया है। रसोई गैस की कीमतों को लेकर हंगामा करने वालों को भी ईडी का नोटिस जारी कर सकता है। कविता ने कहा कि केंद्र सरकार की जनविरोधी नीतियों पर सवाल उठाएंगे तो वे जांच एजेंसियों को भेज रहे हैं।

तेलंगाना में नवंबर और दिसंबर में चुनाव

कविता ने कहा कि तेलंगाना में नवंबर और दिसंबर में चुनाव आ सकते हैं। चुनाव से पहले जांच एजेंसियों के साथ छापेमारी करना भाजपा की नीति है। भाजपा का मकसद अन्य पार्टी के नेताओं को आतंकित करना है। केंद्र ने अपने मंत्रियों, सांसदों, विधायकों और एमएलसी को निशाने पर लिया है। जांच एजेंसियों के साथ उन पर हमला कर रहे हैं। कविता ने कहा कि ईडी, सीबीआई और आईटी के जरिए धमकी दे रहे हैं।

సులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు

హైదరాబాద్ : ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. 9న తనను విచారణకు రమ్మన్నారని కానీ 11న తాను వస్తానని చెప్పినట్టు వెల్లడించారు. ఈడీ విచారణను ఎదుర్కొంటానని ఈడీ అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తానని కవిత స్పష్టం చేశారు. భయమెందుకు? నేనేం తప్పు చేయలేదని.. విపక్షాల మాట కూడా వినాలని కవిత వ్యాఖ్యానించారు. తనతోపాటు ఎవర్ని విచారించినా ఇబ్బంది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

“దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెబుతోంది. దర్యాప్తు సంస్థలు మహిళల్ని విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఈడీ ఎందుకింత హడావిడిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరు? కావాలంటే నిందితుల్ని ఇంటికి తీసుకొచ్చి విచారించమని కోరా. కానీ ఈడీ మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఈడీ దర్యాప్తునకు వంద శాతం సహకరిస్తా. తెలంగాణ నేతల్ని వేధించడం కేంద్రానికి అలవాటైపోయింది. నిందితులతో కలిపి ప్రశ్నించాలనుకుంటే నన్ను వీడియో కాన్ఫరెన్స్‌లో విచారించండి” అని కవిత వ్యాఖ్యానించారు.

“27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోంది. రాజ్యసభలో మహిళా బిల్లు తెచ్చిన సోనియాకు సెల్యూట్. మహిళా బిల్లు కోల్డ్ స్టోరేజ్‌లో ఉంది. 10న జంతర్‌మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం ధర్నా చేస్తున్నాం. అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోదీ మాటిచ్చారు’ అని కవిత వ్యాఖ్యానించారు. అయితే.. జంతర్‌ మంతర్ వద్ద కవిత తలపెట్టిన దీక్షకు పోలీసులు షరతులు విధించారు. కవిత మీడియాతో మాట్లాడుతుండగానే ఢిల్లీ పోలీసులు వచ్చి ఈ విషయాన్ని చెప్పారు. వేరేవారు కూడా అనుమతి కోరారని అందుకే సగం స్థలం మాత్రమే వాడుకోవాలని సూచించారు. ముందే అనుమతి తీసుకున్నా ఇప్పుడు ఇలా చేయడం ఏంటని కవిత ప్రశ్నించారు. కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్( BL Santosh ) సిట్( SIT ) ముందుకు ఎందుకు రావ‌డం లేదు. సిట్ ముందుకు వ‌చ్చేందుకు బీఎల్ సంతోష్‌కు భ‌య‌మెందుకు..? అని క‌విత‌ ప్ర‌శ్నించారు. బీజేపీ నేత‌లు, బీజేపీలో చేరిన నేత‌లపై ఈడీ, సీబీఐ కేసులు ఉండ‌వు. బీజేపీని ప్ర‌శ్నించిన విప‌క్షాలపై ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు, కేసులు పెడుతారు. త‌మ వైపు స‌త్యం, ధ‌ర్మం, న్యాయం ఉంది. ఏ విచార‌ణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం అని క‌విత తేల్చిచెప్పారు.

మోదీ వ‌న్ నేష‌న్.. వ‌న్ ఫ్రెండ్ స్కీమ్ అమ‌లు చేస్తున్నారు అని క‌విత మండిప‌డ్డారు. బీజేపీకి ప్ర‌త్యామ్నాయం బీఆర్ఎస్ అవుతుంది. మ‌హిళా బిల్లు ఆందోళ‌న అన‌గానే త‌న‌కు ఈడీ నోటీసులు ఇచ్చారు. వంట గ్యాస్ ధ‌ర‌ల‌పై మ‌రొక‌రు గ‌ళ‌మెత్తితే వాళ్లకు కూడా ఈడీ నోటీసులు ఇస్తారు. కేంద్ర ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నిస్తే ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను పంపుతున్నారు అని క‌విత ధ్వ‌జ‌మెత్తారు.

న‌వంబ‌ర్, డిసెంబ‌ర్‌లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు రావొచ్చు అని క‌విత పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయించ‌డం బీజేపీ విధానం. త‌మ పార్టీ నేత‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డ‌మే బీజేపీ ల‌క్ష్యం. త‌మ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను కేంద్రం ల‌క్ష్యంగా చేసుకుంది. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో త‌మ‌పై దాడులు చేయిస్తోంది. ఈడీ, సీబీఐ, ఐటీ బెదిరింపుల‌కు పాల్ప‌డుతోంది అని క‌విత తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X