हैदराबाद: जुबली हिल्स के बीआरएस विधायक मागंटी गोपीनाथ का निधन हो गया है। उन्हें हाल ही में बीमारी के चलते गचीबोवली एआईजी अस्पताल में भर्ती कराया गया था और रविवार सुबह 5:45 बजे इलाज के दौरान उन्होंने अंतिम सांस ली। जैसे ही पता चला कि उनकी हालत गंभीर हो गई है, तो बीआरएस के प्रमुख नेता केटीआर और हरीश राव शनिवार रात अस्पताल पहुंचे।
मागंटी गोपीनाथ के निधन की खबर ने तेलंगाना के राजनीतिक नेताओं को झकझोर कर रख दिया है। कई नेता और उनके प्रशंसक अपनी संवेदना व्यक्त कर रहे हैं। वे उनकी सेवाओं और परिचय को याद कर रहे हैं। मुख्यमंत्री रेवंत रेड्डी और टीपीसीसी के अध्यक्ष महेश कुमार गौड़ और अनेक नेताओं ने शोक व्यक्त किया है और उनकी सेवाओं को याद किया।
गौरतलब है कि मागंटी गोपीनाथ तीन बार विधायक के रूप में जीते। उन्होंने पहली बार 2014 के चुनाव में टीडीपी से जीत हासिल की और 2018 में बीआरएस में शामिल हुए। उन्होंने 2018 और 2023 में बीआरएस से जीत हासिल की।
Also Read-
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవల గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5:45 కు తుదిశ్వాస విడిచారు. పరిస్థితి విషమంగా మారిందని తెలియడంతో శనివారం రాత్రే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు ఆసుపత్రికి చేరుకున్నారు.
మాగంటి గోపీనాథ్ మృతి వార్త తెలంగాణ రాజకీయ నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు నాయకులు, ఆయన అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కాగా, మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ నుంచి గెలుపొందిన ఆయన 2018లో బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.
MLA మాగంటి గోపీనాథ్ మృతిపట్ల CM రేవంత్ సంతాపం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. గోపీనాథ్ మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారు. గోపీనాథ్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. గోపీనాథ్‌కు భార్య సునీత, కుమారుడు వాత్సల్యనాథ్, కుమార్తె అక్షరనాగ ఉన్నారు. జూబ్లీహిల్స్ నుంచి వరుగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గోపీనాథ్ మృతి పట్ల టీపీసీసీ సంతాపం
సీనియర్ శాసన సభ్యులు,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర ద్రిగ్బాంతి కి గురి చేసిందని అన్నారు. గోపీనాథ్ కింది స్థాయి నుండి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గా ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు తెచుకున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు . ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం పై తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. సౌమ్యుడిగా, ప్రజా నేతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. మంచి రాజకీయ నేతగా తనదైన స్థానాన్ని ప్రజల్లో సంపాదించుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో మాగంటి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలిపులుపుతున్నానని మాజీ సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.(ఏజెన్సీలు)
