పర్వతగిరి: తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనుబంధ ఐకేపీ, వి.ఓ.ఏ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ 2023ను నేడు పర్వతగిరి మంత్రి గారి నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆవిష్కరించారు.

ఐకేపీ, వి.ఓ.ఏ లు మరింత చురుకుగా పని చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్, సంఘం అధ్యక్షురాలు మాధవి, ప్రధాన కార్యదర్శి మచ్చెందర్, కోశాధికారి తిరుపతి, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
