BRS बन गई राष्ट्रीय मीडिया के लिए बड़ी खबर, नेताओं में खुशी की लहर (T)

हैदराबाद: देश की राजनीति में गुणात्मक परिवर्तन के उद्देश्य से बुधवार को राष्ट्रीय राजधानी दिल्ली में भारत राष्ट्र समिति (BRS) द्वारा उठाये गये पहले कदम की सर्वत्र सराहना की गई। बीआरएस की शुभ शुरुआत के साथ ही दिल्ली के लाल किले तक गुलाब की महक बिखरता पाया गया है।

देश की राजनीति में 42 साल बाद नई राष्ट्रीय पार्टी के रूप में बीआरएस का उभरना एक ऐतिहासिक क्षण साबित होगा। आम आदमी से लेकर बुद्धिजीवियों, राजनीतिक दलों, किसान संघों और जनसंगठनों में बीआरएस के प्रति सकारात्मक प्रतिक्रिया रही है। बीआरएस पार्टी के राष्ट्रीय कार्यालय के उद्घाटन समारोह में मौजूद विभिन्न दलों के नेताओं ने कहा कि बीआरएस के संस्थापक अध्यक्ष और तेलंगाना के मुख्यमंत्री के चंद्रशेखर राव के विचार-मंथन से जीवंत हुई बीआरएस राष्ट्रीय राजनीति में एक नये युग की शुरूआत करेगी। उद्घाटन समारोह को राष्ट्रीय मीडिया ने प्रमुखता से प्रकाशित किया है।

प्रतिक्रिया

पोन्नुस्वामी ने टिप्पणी की- “मैं इस समारोह को अपनी आंखों से देखने की जिज्ञासा से दिल्ली आया। 8 वर्षों तक तेलंगाना के विकास के लिए केसीआर ने अथक प्रयास किया है। देश को बदलना है तो केसीई को प्रधानमंत्री बनना चाहिए। फारूकी नाम के एक कार्यकर्ता ने कहा, “केसीआर द्वारा आम लोगों और किसानों की समस्याओं को लेकर उठाए गए मुद्दों को देखते हुए इस देश को उनके नेतृत्व की जरूरत है।”

बीआरएस राष्ट्रीय कार्यालय के उद्घाटन कार्यक्रम का व्यापक प्रचार

राष्ट्रीय मीडिया ने बीआरएस राष्ट्रीय कार्यालय के उद्घाटन कार्यक्रम का व्यापक प्रचार किया। कई राष्ट्रीय अंग्रेजी और हिंदी समाचार साइटों के साथ-साथ विभिन्न भाषाओं की समाचार वेबसाइटों ने बीआरएस कार्यालय के उद्घाटन समारोह को प्रमुखता से प्रकाशित किया। सोशल मीडिया पर कई लोगों ने बीआरएस की बधाई दी।

ट्विटर पर #BRS ट्रेंड किया

इसी क्रम में कई राष्ट्रीय समाचार चैनलों ने इसे सुर्खियों में चलाया। टाइम्स ऑफ इंडिया (डिजिटल, टीवी), जी न्यूज (डिजिटल, टीवी), इंडिया टुडे (डिजिटल, टीवी), एनडीटीवी (डिजिटल, टीवी), न्यूज 18 (डिजिटल, टीवी), द हिंदू, डेक्कन हेराल्ड, मनीकंट्रोल, न्यूजमिनट, आउटलुक, द प्रिंट, स्टेट्समैन, न्यूज़रूम ओडिशा, पीटीआई, रिपब्लिक वर्ल्ड (डिजिटल, टीवी), सियासत, द वीक, यूनाइटेड न्यूज़ ऑफ़ इंडिया, एबीपी न्यूज़, अमर उजाला ने बीआरएस न्यूज़ को प्रमुकता से प्रकाशित किया है। सोशल मीडिया पर हैशटैग ‘बीआरएस’ ट्रेंड करता रहा।

బీఆర్ఎస్ జాతీయ మీడియాకు పెద్ద వార్తగా మారింది, నేతల్లో ఆనందం

హైదరాబాద్‌: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా బుధవారం దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వేసిన తొలి అడుగుకు సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. బీఆర్‌ఎస్‌ శుభారంభంతో ఢిల్లీ ఎర్రకోట వరకు గులాబీ పరిమళాలు వ్యాపించాయి.

జాతీయ మీడియా ప్రాధాన్యమిచ్చింది

దేశ రాజకీయాలలో 42 ఏండ్ల తర్వాత ఒక కొత్త జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ పురుడు పోసుకొన్న సందర్భం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోనున్నది. సామాన్యుడు మొదలుకొని బుద్ధి జీవులు, రాజకీయ పక్షాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల వరకు సర్వత్రా బీఆర్‌ఎస్‌ పట్ల సానుకూల స్పందన వ్యక్తమైంది. బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు మేధోమథనం నుంచి జీవం పోసుకొన్న బీఆర్‌ఎస్‌, మున్ముందు జాతీయ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలకనున్నదని బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు అన్నారు. ప్రారంభోత్సవ వేడుకకు జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యమిచ్చింది.

అభిప్రాయం

‘ఈ వేడుకను కండ్లారా చూడాలన్న కుతూహలంతో ఢిల్లీకి వచ్చాను. 8 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అమితంగా కృషి చేసిన కేసీఆర్‌, అదే స్ఫూర్తితో దేశ గతిని మార్చడానికి ఆయన ప్రధానమంత్రి కావాలని కోరుకొంటున్నాను’ అని పొన్నుస్వామి అనే వ్యక్తి వ్యాఖ్యానించారు. ‘సామాన్య ప్రజల గురించి, రైతుల సమస్యల గురించి కేసీఆర్‌ లేవనెత్తిన అంశాలను చూస్తే, ఈ దేశానికి ఆయన నాయకత్వం అవసరం’ అని ఫారూఖీ అనే కార్యకర్త అభిలషించారు.

ట్విట్టర్‌లో #బీఆర్‌ఎస్‌ ట్రెండింగ్‌

బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి జాతీయ మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. పలు జాతీయ ఇంగ్లిష్‌, హిందీ న్యూస్‌సైట్లతో పాటు వివిధ భాషలకు చెందిన న్యూస్‌ వెబ్‌సైట్లు బీఆర్‌ఎస్‌ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ప్రముఖంగా ప్రచురించగా, పలు జాతీయ న్యూస్‌ చానల్స్‌ హెడ్‌లైన్స్‌లో ప్రసారం చేశాయి.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా (డిజిటల్‌, టీవీ), జీన్యూస్‌ (డిజిటల్‌, టీవీ), ఇండియా టుడే (డిజిటల్‌, టీవీ), ఎన్డీటీవీ (డిజిటల్‌, టీవీ), న్యూస్‌18 (డిజిటల్‌, టీవీ), ది హిందూ, దక్కన్‌ హెరాల్డ్‌, మనీకంట్రోల్‌, న్యూస్‌మినిట్‌, అవుట్‌లుక్‌, ది ప్రింట్‌, స్టేట్స్‌మన్‌, న్యూస్‌రూమ్‌ ఒడిశా, పీటీఐ, రిపబ్లిక్‌ వరల్డ్‌ (డిజిటల్‌, టీవీ), సియాసత్‌, ది వీక్‌, యునైటెడ్‌ న్యూస్‌ ఆఫ్‌ ఇండియా, ఏబీపీ న్యూస్‌, అమర్‌ ఉజాలా వంటి సంస్థలు బీఆర్‌ఎస్‌ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చాయి. సోషల్‌మీడియాలో ‘బీఆర్‌ఎస్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో కొనసాగింది. బీఆర్‌ఎస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X