కాంగ్రెస్, బిజెపి లు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రెట్టింపు చేస్తారా
గల్లీలో ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదు
గుజరాత్ తో సహా బిజెపి పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తున్నారా
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇచ్చే ఆసరా ఫించన్ 600
విద్యుత్ సరఫరా జరిగిది ఆరు గంటలే
గుజరాత్ లో నీటి కోసం మహిళల సిగపట్లు
– మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి లో బి ఆర్ యస్ ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిధిలుగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి,పార్టీ ఇంచార్జ్ కడియం శ్రీహరిలు పాల్గొన్న జడ్ పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షుడు, దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ రవీంద్ర నాయక్ తదితరులు.
కాంగ్రెస్ బిజెపి లు అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో బహిరంగ పరచాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆసరా ఫించన్లు రెట్టింపు చేస్తారా,కల్యాణ లక్ష్మీ /షాది ముబారక్ లకు ఇచ్చే మొత్తాలను డబుల్ చేస్తారా…రైతుబందు పథకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని మూడింతలు చేస్తారా అంటూ కాంగ్రేస్,బిజెపి లను ఆయన సూటిగా ప్రశ్నించారు.
బి ఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేలానాలలో బాగంగా మంగళవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిదిగా హాజరయ్యారు. స్ధానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అధ్యక్షత వహించిన ఈ సమ్మేళనానికి పార్టీ ఇంచార్జ్, శాసనమండలి సభ్యులు కడియం శ్రీహరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ రవీంద్ర నాయక్,జడ్ పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు రెట్టింపు చేసే ఉద్దేశమే కాంగ్రెస్ కుంటే గల్లీలో,ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేక పోయారని కాంగ్రెస్ పార్టీని ఆయన నిలదీశారు. మీ పార్టీ అధికారంలో ఉండగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఆలోచన కాదు కదా కనీసం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా కుడా ఇవ్వలేక పోవడంతో మీ పార్టీ జెండాను కాదనుకునే యావత్ తెలంగాణా ప్రజలు వరుస ఎన్నికల్లో గులాబీ జెండాకు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వానికి పబ్బతి పెట్టారన్నారు.
అటువంటి పార్టీ దాదాపు దేశ రాజకీయాల నుండి అంతరార్థం అయినట్లే నని ఆయన ఎద్దేవాచేశారు. సొంత రాష్ట్రం గుజరాత్ లో కేవలం 600 మాత్రామే ఆసరా ఫించన్లు అందిస్తున్న ప్రధాని మోడీ తెలంగాణా లో కుడా ఆ పద్దతినే అమలు పరుస్తారా అంటూ ఆయన దుయ్యబట్టారు.అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్న కమల నాధులు అధికారంలోకి వస్తే తెలంగాణా ను చీకట్లోకి నెట్టి వ్యవసాయాన్ని సంక్షోభంలోకీ నెట్టుతార అంటూ ఆయన మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్ సరఫరా కేవలం ఆరు గంటలే నని అది కుడా మోటర్లకు మీటర్లు పెట్టి మెడ మీద కట్టి బిల్లులు వసూలు చేస్తూ సరఫరా చేస్తున్నారన్నారు.
అదే పరిస్థితి తెలంగాణా లో తీసుకొచ్చి రైతంగాన్ని అత్నక్షోభ లోకి తీసుకెడతార అంటూ ఆయన బిజెపి పై నిప్పులు చెరిగారు. యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఇంటింటికి మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా రికార్డ్ సృష్టిస్తే బిందెడు నీటి కోసం ప్రధాని మోడీ సొంత రాష్ట్రం రెండున్నర దశాబ్దాలుగా బిజెపి ఎలుబడిలో ఉన్న గుజరాత్ లో వీది కుళాయిల దగ్గర మహిళలు కొట్లాడుకుని పోలీస్ స్టేషన్ పాలు అవుతున్నారని ఆయన విమర్శించారు.
అటువంటి పార్టీలు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకో చూస్తూన్నాయాన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో జలకళ తో కళకళ లాడుతున్న చెరువు నీటితో సస్యశ్యామలం గా మారిన తెలంగాణా లో మరో పార్టీకి చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ అమలౌతున్న సంక్షేమ పథకాలతో కడుపు నిండా తిండి,కంటి నిండా నిద్రపోతున్న తెలంగాణా ప్రజలు విజ్ఞులని అటువంటి విజ్ఞులు ఇక్కడ మరోకరిని అడుగు పెట్టనివ్వరని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు