- మార్చ్ లో పీర్ టీం పర్యటించే అవకాశం
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం న్యాక్ గుర్తింపు కోసం స్వీయ అధ్యయన నివేదిక (SSR) సంబంధిత డేటాను శనివారం న్యాక్ వెబ్ సైట్ లో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. కే. సీతారామ రావు బటన్ నొక్కి అప్‌లోడ్ చేశారు. విశ్వవిద్యాలయంలో న్యాక్ పీర్ టీం మార్చి / ఏప్రిల్ నెలలో పర్యటించే అవకాశం ఉందని, ఆ లోపు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించనున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ ప్రో. కె. సీతారామ రావు వెల్లడించారు.
జూమ్ ద్వార కార్యక్రమంలో పాల్గొన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ… విద్యార్థుల ఫీడ్ బ్యాక్ పై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి, సికా డైరెక్టర్ ప్రొ. పి. మధుసూదన్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. ఎ.వి.ఎన్. రెడ్డి, అన్ని విభాగాల డైరెక్టర్స్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
BRAOU UPLOADED SELF STUDY REPORT TO NAAC

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) Self Study Report (SSR) related data for NAAC recognition was uploaded on the NAAC website on Saturday by Prof. K. Seetharama Rao, Vice-Chancellor, by pressing a button. Prof. Rao revealed that the NAAC peer team is likely to visit the university in the month of March and will focus on strenthening infrastructure. He addressed the coordinators of study centers in two Telugu states who participated in the program through zoom and asked them to focus on feedback of the students.
Prof. Ghanta Chakrapani, Director (Academic); Prof. P.Madhusudan Reddy, Director CIQA Dr. A.V.N. Reddy, Registrar, All the Directors, Heads of the Branches, Deans and representatives of various service associations are participated in the program.