GOOD NEWS: BRAOU UG/PG ADMISSIONS LAST DATE EXTENDED UPTO SEPTEMBER 12

Hyderabad : The Direct Admission through “Online” for Under Graduate- B.A/B.Com/B.Sc and Post Graduate- M.A, M.Com, M.Sc, M.B.A, BLISc, MLISc, Diplomas Courses and Certificate programmes of Dr. B. R. Ambedkar Open University (BRAOU) for the Academic year 2025-26 is extended up to September 12.

Similarly old batches students (Year wise) and CBCS Second and Third year students, also P.G old batches students those who are missed the opportunity for payment of tuition fee can also utilize the same, batches from 2016 to 2024 also proceed for payment of tuition fee through Net Banking / Credit / Debit Card or TS Online before last date on September 12, 2025.

For further details visit nearest study centre or university Portal : www.braouonline.in; OR website : www.braou.ac.in and for more information contact BRAOU Call centre :18005990101 or information Centre : 040-23680 222 / 333 / 555.

Also Read-

అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ ప్రవేశ గడువు పెంపు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను చివరి తేది సెప్టెంబర్ 12 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ విద్యార్థి సేవల విభాగ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

విశ్వవిద్యాలయంలో 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ లో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా అంతకు ముందు చేరిన డిగ్రీ / పీ.జీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా సెప్టెంబర్ 12వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని సూచించారు. 2016 నుండి 2024 విద్యా సంవత్సరాలలో ఆయా కోర్సుల్లో చేరి సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సెప్టెంబర్ 12, 2025 తేదీలోపు నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ / డెబిట్ కార్డ్ లేదా ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 040-23680 333 / 444 / 555, టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X