సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఈ ఉద్యోగ సంఘాలు BRAOU SERVICE ASSOCIATIONS EXPRESSES GRATITUDE

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 100 కోట్లు నిధులు మంజూరు చేసింది, తద్వారా శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో, తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంటును మంజూరు చేసింది. విశ్వవిద్యాలయ ప్రతిపాదిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి ₹50 కోట్లు కేటాయించి, అదేవిధంగా అదనంగా ఉద్యోగుల వేతనాల కోసం ₹24.30 కోట్లు కేటాయించారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల సంఘం; టెక్నికల్ ఉద్యోగుల సంఘంతో పాటు ఇతర సంఘాల ప్రతినిథులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి; ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా, ఐఏఎస్ కి; విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి కి ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా, బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాంతం ప్రేమ్ కుమార్, టెక్నికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భరత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డా. యాకేష్ దైద తదితరులు మాట్లాడుతూ ప్రత్యేక గ్రాంట్లను మినహాయిస్తే, అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు మంజూరైన అత్యధిక అభివృద్ధి గ్రాంటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇది మన విశ్వవిద్యాలయం పై ప్రభుత్వానికి ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ నిధులు విశ్వవిద్యాలయ మౌళిక వసతుల కల్పనలో కీలకం కానున్నాయన్నారు.

Also Read-

BRAOU SERVICE ASSOCIATIONS EXPRESSES GRATITUDE TO CM Revanth Reddy & DCM Batti Vikramarka

Hyderabad : The Telangana Government had previously sanctioned funds amounting to ₹100 crores for the establishment of the Dr. B.R. Ambedkar International Research Centre Building upon this initiative, in the State Budget presented in the Legislative Assembly on Friday, the Government has sanctioned a significant development grant to the university. Specifically, ₹50 crores have been allocated for the university’s proposed infrastructure development, while an additional ₹24.30 crores have been earmarked for employee salaries.

The Non-Teaching Employees Association, Technical officers Services Association along with other services Association were expressed heartfelt gratitude to the Honorable Chief Minister A. Revanth Reddy; Deputy Chief Minister and Finance Minister, Bhatti Vikramarka and Principal Secretary of the Higher Education Department, Dr. Yogita Rana, IAS; Prof. Ghanta Chakrapani, Vice-Chancellor for their unwavering support, encouragement, and special attention consistently extended to the university.

Also Read-

on this occasion, Kantham Prem Kumar, President, Non-Teaching Employees Association said the university barring special grants, this constitutes the highest development grant sanctioned to any state university a fact that reflects the government’s immense confidence in our institution. He remarked that this is a matter of great pride for all of us, and emphasized the critical need to utilize these resources efficiently and to work together with renewed commitment and a sense of responsibility to steer the university toward even greater heights of excellence.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X