हैदराबाद : दोनों तेलुगु राज्यों में शुक्रवार को अलसुबह सड़कें लहूलुहान हो गई। तेलंगाना और आंध्र प्रदेश में सड़क दुर्घटनाओं छह लोगों की मौत हो गई।
मिली जानकारी के अनुसार, तेलंगाना के रंगारेड्डी जिले के तुम्मनूरु गांव के पास अलसुबह भीषण सड़क हादसा हुआ। तेज रफ्तार कार संतुल खोने के बाद डीसीएम को टक्कर मार दी। हादसे में चार लोगों की मौके पर ही मौत हो गई। मृतकों की पहचान नागरकर्नूल जिला निवासी केशवुलू (35), श्रीनिवास (30), यादय्या (34) और रामस्वामी (32) के रूप में की गई।
दूसरी ओर आंध्र प्रदेश के नेल्लोर जिले के मनुबोलु कागितालपुर में भीषण सड़क हादसा हुआ। तेज रफ्तार वोल्वो बस ने ऑटो को टक्कर मार दी। हादसे में ऑटो में यात्रा कर रहे दो लोगों की मौत हो गई। मृतकों की पहचान रेट्टपल्ली निवासी शीनय्या और ईश्वरय्या के रूप में की गई है। पुलिस मौके पर पहुंच कर मामले की छानबीन कर रही है।
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రక్తపుమడుగులో రోడ్డులు ఆరుగురు దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం వాహనాన్ని షిఫ్ట్ కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
చనిపోయిన వ్యక్తులను రామస్వామి, యాదయ్య, కేశవులు, శ్రీనుగా గుర్తించారు. మృతులంతా నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వెల్దండ నుండి హైదరాబాద్ వెళుతున్న షిఫ్ట్ కారు మాక్ ప్రాజెక్ట్ సమీపంలోకి రాగానే.. హైదరాబాద్ నుంచి కలకొండపల్లి వెళ్తున్న డీసీఎం వ్యాను ఎదురుగా వచ్చి ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇందులో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
ఈ రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో వంట చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఎలా జరిగిందనే దానిపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా మనుబోలు కాగితాలపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న వోల్వో బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతులు రెట్టపల్లికి చెందిన శీనయ్య, ఈశ్వరయ్యగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.