BJP State Level Training Camp- ఏకాత్మ మానవతావాదమే బీజేపీ మూల సిద్ధాంతం: బండి సంజయ్

ఏకాత్మ మానవతావాదమే బీజేపీ మూల సిద్ధాంతం

అధికారం కోసం అడ్డదారులు తొక్కాలనుకోవడంలేదు

ఒక్క సీటు అవసరమైనా అడ్డదారులు తొక్కకుండా మళ్లీ ప్రజాతీర్పు కోరిన ఘనత బీజేపీదే

ఆలస్యమైనా మూల సిద్ధాంతం ఆధారంగానే తెలంగాణలోనూ అధికారంలోకి రావాలన్నదే పార్టీ లక్ష్యం

కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ప్రశిక్షణ ముఖ్యోద్ధేశం

రాష్ట్ర ప్రశిక్షణా శిబిరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

हैदराबाद: तीन दिवसीय भारतीय जनता पार्टी तेलंगाना प्रशिक्षण शिविर (लियोनिया रिज़ॉर्ट, बाहरी रिंग रोड के पास, शमीरपेट) में आरंभ किया गया। इस शविर में भाजपा के प्रदेश अध्यक्ष, सांसद बंदी संजय कुमार, केंद्रीय मंत्री जी किशन रेड्डी, राज्य मामलों के प्रभारी तरुण चुघ, सुनील बंसल, सांसद धर्मपुरी अरविंद, सोयम बापुराव, तमिलनाडु के सह-प्रभारी पोंगुलेटी सुधाकर रेड्डी, राष्ट्रीय कार्य समिति के सदस्य जितेंद्र रेड्डी, जी विवेक वेंकटस्वामी, गरिकापाटीा मोहन राव, दुब्बाका विधायक जी रघुनंदन राव, राज्य के मुख्य सचिव जी प्रेमेंदर रेड्डी, दुग्याल प्रदीप कुमार और बंगारू श्रुति उपस्थित रहे हैं।

Hyderabad: ఏకాత్మ మానవతావాదమే బీజేపీ మూల సిద్ధాంతమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అధికారం కోసం బీజేపీ ఏనాడూ అడ్డదారులు తొక్కబోదని, మూల సిద్ధాంతం ఆధారంగానే తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ప్రశిక్షణా శిబిరాల ముఖ్య ఉద్దేశమన్నారు.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రశిక్షణ శిబిరం మేడ్చల్ జిల్లా శామీర్పేటలో మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని నేడు మధ్యాహ్నం ప్రారంభించడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రశిక్షణా శిబిరం (Leonia Resort, Near Outer Ring Road, Shameerpet) ప్రారంభ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్ రావు, దుబ్బాక శాసనసభ్యులు జి.రఘునందన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ప్రశిక్షణా శిబిరాన్ని ప్రారంభిస్తూ జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం బండి సంజయ్ చేసిన ప్రారంభోపన్యాసంలోని ముఖ్యాంశాలు…

•బీజేపీ రాష్ట్ర శాఖ మూడు రోజులపాటు నిర్వహించే ప్రశిక్షణా శిబిరానికి విచ్చేసిన పెద్దలకు నమస్కారం. 3 రోజులపాటు జరిగే ఈ ప్రశిక్షణ పొందడానికి ప్రిపేరై ఇక్కడికి వచ్చాం.

•అధికారంలోకి రావడానికి శిక్షణా శిబిరాలు అక్కర్లేదనే భావన కొందరిలో ఉంటుంది. ఏ పార్టీలో రాష్ట్ర కమిటీలు, పోలింగ్ బూత్ కమిటీల్లేవు. అయినా ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయి కదా… ఈ శిక్షణ అవసరమా? అనే భావన కలుగుతోంది.

•నాటి జనసంఘ్ నుండి నేటి వరకు ప్రతి రెండేళ్ల కోసారి శిక్షణా శిబిరాలు కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. నాటి శ్యామాప్రసాద్ ముఖర్జీ నుండి నేటి నరేంద్రమోదీ వరకు ముఖ్య నేతలంతా ఈ ప్రశిక్షణలో పాల్గొన్నవారే.

•మూల సిద్ధంతాం జాతీయత ఏకాత్మక మానవతావాదం. దేశ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యం మనం. పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే ఎప్పుడో వచ్చే వాళ్లం. ఎన్నో పార్టీలు అడ్డదారులు తొక్కి అధికారం సాధించాయి. కానీ బీజేపీ మాత్రం సిద్ధాంతానికి అనుగుణంగా అదికారంలోకి రావాలనుకున్నం. అందుకే ఇన్నాళ్లు పట్టింది.

•పార్లమెంట్ లో విశ్వాస పరీక్ష సమయంలో వాజ్ పేయి ప్రభుత్వం మనుగడ సాధించాలంటే ఒక్క ఎంపీ తక్కువయ్యారు. అడ్డదారులు తొక్కకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లిన ఘనత బీజేపీదే.

•దేశంలో 7 వేల పార్టీలున్నయ్. ఆనాడు 30కి పైగా పార్టీలున్నా… వై బీజేపీ అనే దానిని వివిరస్తూ బీజేపీ మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రశిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో మూల సిద్ధాంత ప్రాతిపదికగా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నదే ఈ ప్రశిక్షణా శిబిరం ముఖ్య ఉద్దేశం.

•వివిధ అంశాలకు సంబంధించి 14 అంశాలపై శిక్షణా తరగుతులుంటాయి. అనుభవమైన వక్తలు మార్గదర్శనం చేస్తారు. మనం అడిగే ఎన్నో సందేహాలను నివ్రుత్తి చేస్తారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం.

•ఆనాడు 2 ఎంపీ సీట్ల నుండి నేడు 303 సీట్లకు విస్తరించాం. రెండోసారి అధికారంలోకి వచ్చాం. మూడోసారి కూడా రాబోతున్నం. ఏనాడూ సిద్ధంతాన్ని పక్కనపెట్టలేదు. కమిట్ మెంట్ తో పనిచేశాం.

•అధికారం కోసం అర్రులు చాచలేదు. అడ్డదారులు తొక్కలేదు. మూల సిద్ధాంతం ఆధారంగా అధికారంలోకి రావాలనుకుంటున్నం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X