కేసీఆర్… మీ కుటుంబ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయండి

  • రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై శ్వేత పత్రం చేయాల్సిందే
  • 317 జీవోను సవరణపై ఈనెల 30న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
  • సర్కార్ మెడలొంచేదాకా కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
  • 2047 నాటికి అభివ్రుద్ది చెందిన దేశంగా ‘‘భారత్’’ ను చూడబోతున్నాం
  • 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్
  • మద్యం ద్వారా ఒక్క కుటుంబం సగటున ఏటా రూ.50 వేలు కేసీఆర్ కు చెల్లిస్తున్న తెలంగాణ ప్రజలు
  • ఒక్కో కుటుంబంపై రూ.6లక్షల అప్పు గిఫ్ట్ గా ఇస్తున్న కేసీఆర్
  • ఇదే ఆఖరు పోరాటం…కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేదాకా విశ్రమించొద్దు
  • బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసే సమయం ఆసన్నమైంది
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

హైదరాబాద్ : మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాళా ‌తీయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ’’సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? అనే వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలి’’అని డిమాండ్ చేశారు.

అట్లాగే 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారనే అంశాలపైనా శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. మద్యం ద్వారా తెలంగాణలో ఒక్కో కుటుంబం ఏటా రూ.50 వేల ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వానికి ఇస్తే… ఆ ప్రజలకు మాత్రం ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపి గిఫ్ట్ గా ఇచ్చారని ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామిగా దూసుకెళ్తోందని చెప్పిన బండి సంజయ్ 2047 నాటికి పూర్తిస్థాయిలో ఆర్దికంగా అభివ్రుద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’ను చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

మహబూబ్ నగర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి. ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.

సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగలోని ముఖ్యాంశాలు…

• పాలమూరు గడ్డపై నిర్వహించుకుంటున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు విచ్చేసిన పెద్దలు సునీల్ బన్సల్ సహా వేదికపై ఉన్న పెద్దలకు స్వాగతం..

• జాతీయ కార్యవర్గ సమావేశాల కొనసాగింపుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కార్యాచరణను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లడం ఆనవాయితీ…

• జేపీ నడ్డా తిరిగి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనందున తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున హ్రుదయపూర్వక అభినందనలు..

• కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయ, రాజకీయ తీర్మానాలతోపాటు అనేక అంశాలపై చర్చించబోతున్నాం.

• కేసీఆర్ కుటుంబంపైన, టీఆర్ఎస్ నేతల అవినీతిపై ప్రజల్లో ఎంతటి తీవ్ర వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా వెల్లడైంది. మీ అందరి ఆశీర్వాదం, సహకారంతో 5 విడతల పాదయాత్రను పూర్తి చేసుకున్నాం.

• ప్రజా సంగ్రామ యాత్ర దేశానికి స్పూర్తిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారంటే అది గొప్ప విషయం… మనకు స్పూర్తి…సమాజంలో మంచి సందేశం వెళ్లింది. కష్టపడి పనిచేసే వాళ్లకు గుర్తింపు ఉంటుందనే సంకేతాలు పంపారు.

• తెలంగాణలో ప్రజలు పూర్తి నిరాశ, నిస్ర్పహల్లో, కష్టాల్లో ఉన్నరు. ఈరోజు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపట్ల ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నరు.

• కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా, ఆత్మవిశ్వాసం బీజేపీ కల్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ఎదురు చూస్తున్నారు. బీజేపీకి ఈసారి అవకాశం ఇవ్వాల్సిందేనని ప్రజలు నిర్ణయించుకున్నారు.

• బీజేపీ కార్యకర్తలు కూడా ఈ అద్బుత సన్నివేశం కోసమే ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుపాటు కార్యకర్తలు కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు.. ఎంతోమంది చనిపోయారు. ఇంకెందరో అనారోగ్యంపాలయ్యారు.

• ఏ ఆశయం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నామో… అవి నెరవేరాలంటే ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి… బీజేపీతోనే అది సాధ్యమైతుంది.

• కేసీఆర్ అన్ని వర్గాలను అణిచివేస్తున్నారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కుతున్నారు. ధర్నా చౌక్ లేకుండా చేశారు. మీడియా గొంతు నొక్కారు. ప్రతిపక్షమే లేకుండా చేశారు.

• ఏ సమస్య వచ్చినా కేసీఆర్ పరిష్కరించాలని ఆలోచించలేదు. ప్రభుత్వ భూములను, దళితుల భూములను ఆక్రమించుకుంటున్నరు.

• దళిత హామీలు నెరవేర్చలేదు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. కనీసం పరిశీలించలేదు. సెక్రటేరియెట్ నిర్మాణ పనులను మాత్రం 10సార్లు సందర్శించారు. కేసీఆర్ ఫుట్టిన రోజునాడు సచివాలయం ప్రారంభిస్తారట.

• నేనడుగుతున్నా…. నీ పుట్టిన రోజునాడు సచివాలయాన్ని ఎట్లా ప్రారంభిస్తారు? సచివాలయం సొమ్ము ప్రజలది. అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నా.

• పోడు భూముల హామీలను గాలికొదిలేసిండు. కుల వ్రుత్తుల మధ్య కొట్లాట పెడుతున్నారు. ఆత్మగౌరవ భవనాల పేరుతో ఆత్మవంచన చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్.

• రైతులను మోసం చేస్తున్నడు. రుణమాఫీ అమలు చేయలే. సబ్సిడీలను ఎత్తివేశారు.

• నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేశారు. 22 నోటిఫికేషన్లు ఇచ్చి 25 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసే కుట్ర.. అవి కూడా జాప్యం చేస్తున్నారు.

• కేంద్ర ప్రభుత్వం గత 3 నెలల్లోనే 2.46 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి అపాయిట్ మెంట్ లెటర్లను ఇచ్చింది.

• 317 జీవో పేరుతో ఉద్యోగులను చెట్టుకొకరు, పుట్టకొకరిగా మార్చారు. స్థానిక జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ఇబ్బంది లేదు. కానీ ఇతర జిల్లాలకు పంపుతూ స్థానికతనే ప్రశ్నార్థకంగా మార్చారు.

• జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. డీఏలు ఇస్తలేరు. బీజేపీ ప్రశ్నిస్తే ఒక్క డీఏ ఇచ్చారు.

• తెలంగాణ ఏర్పాటు సమయంలో ధనిక రాష్ట్రమని చెప్పుకున్నాం.. కానీ ఇయాళ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారు. 5 లక్షల కోట్లకుపైగా అప్పు చేశారు. పెన్షన్లు కూడా ఇచ్చే స్థితి లేదు.

• కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు మినహా మరే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు.

• తెలంగాణ రాక ముందు మద్యం ద్వారా ఏటా వచ్చే ఆదాయం రూ.10 వేలు కోట్లు…. నేడు రూ.40 వేల కోట్లు దాటింది. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు దాటలేదు. ఇంకా 10 వేల కోట్లు మద్యం ఆదాయమే మిగులుతుంది. అయినా 5 లక్షల కోట్ల అప్పు చేశారు.

• కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 4 లక్షల కోట్లు ఏం చేసినవ్?

• తెలంగాణలో 80 లక్షలకుపైగా కుటుంబాలున్నయ్. మద్యం ద్వారా ఒక్కో కుటుంబం నుండి సగటున ఏటా 50 వేల రూపాయలు మద్యం ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. కానీ కేసీఆర్ తిరిగి ఆయా కుటుంబాలకు ఇస్తోందేమిటి? ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల అప్పు భారం మోపారు.

• చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేదు.. మళ్లీ అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. మనకు నెలనెలా వచ్చే ఆదాయమెంత? ఎంత ఖర్చు పెట్టాలి? ఎంత అప్పు తేవాలో కుటుంబ పెద్ద ఆలోచించి ప్రణాళిక రూపొందిస్తారు.

• కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆ ఆలోచన లేకుండా అప్పులమీద అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారు. మీకు మళ్లీ అధికారమిస్తే… మరో 5 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలను బికారీలను చేస్తారు.

• కేసీఆర్ నోటి నుండి ఏ దేశం పేరొచ్చినా ఆ దేశం అవుట్… మొదట శ్రీలంక జీడీపీ బాగుందన్నారు. అక్కడ అడుక్కుతింటున్నరు. తరువాత పాకిస్తాన్ సూపర్ అన్నడు. గోధుమ పిండి కోసం తన్నుకుంటున్నరు. చైనా గ్రేట్ అన్నడు.. కరోనాతో అల్లాడుతూ దిగజారిపోయింది. దయచేసి భారత్ పేరును కేసీఆర్ ప్రస్తావించొద్దు… కేసీఆర్ నోరు మంచిది కాదు.. ఏది బాగుందని చెప్పినా… అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది.

• అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈసారి ఆదాయానికి మించి భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేయబోతున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి వెళ్లి వివరించాలి.

• రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్ నీరుగారుస్తున్నరు. గవర్నర్ ను అవమానిస్తున్నడు. అసెంబ్లీకి ఆహ్వానించడం లేదు. బ్యూరోక్రసీ, అధికార వ్యవస్థను పూర్తిగా చెప్పు చేతుల్లో పెట్టుకున్నడు. ప్రజలు ఎక్కడికి వెళ్లాలే తెలియకుండా చేశారు. చివరకు కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్నడు.

• కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో కొత్త డ్రామా. జాతీయత, జాతీయ భావం లేని పార్టీ బీఆర్ఎస్… దేశభక్తితో జాతీయ భావంతో పనిచేసే పార్టీ బీజేపీ. పోలింగ్ బూత్ సమావేశం మొదలు జాతీయ సమావేశాల దాకా వందేమాతరం, జనగణమన ఆలపిస్తాం..తల్లి భారతిని స్మరించుకుందాం. అటక్ నుండి కటక్ దాకా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే పార్టీ బీజేపీ.

• కమ్యూనిస్టులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏనాడూ దేశం కోసం ఆలోచించని పార్టీలు…. ఏ విధంగా దోచుకుందామా? ప్రజలను మోసం చేస్తామని కుట్రలు చేసే పార్టీలు..

• బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల దారి మళ్లించేందుకు కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నరు. కేసీఆర్… తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు? రాష్ట్రాన్ని ఎందుకు దివాళా తీయించావో ప్రజలకు సమాధానం చెప్పిన తరువాత మిగిలిన అంశాలపై మాట్లాడాలి. జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ దేశానికి ఏం చేయబోతున్నారో చెప్పాలి.

• మోదీగారి నాయకత్వంలో భారత్ ను ఆర్దికంగా అభివ్రుద్ధి చేస్తున్నారు. ప్రపంచంలోనే 5వ స్థానంలోకి చేరారు. మరో రెండు మూడేళ్లలో 3వ స్థానానికి చేరుకుంటాం. కానీ మా లక్ష్యం ఒక్కటే… భారత్ 100 ఏళ్ల స్వాతంత్ర్యం నాటికి భారత్ ను పూర్తిస్థాయిలో ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందిన దేశంగా చూడబోతున్నాం. 2047 నాటికి మన కల నెరవేరబోతోంది.

• కోవిడ్ తో ప్రపంచమంతా అల్లాడితే.. భారత్ సుస్థిరంగా ఉంది. లోకమంతా మనవైపే చూస్తోంది. మ్యానుఫాక్చరింగ్ హబ్ గా మారింది. మొబైల్ ఉత్పత్తి జరుగుతోంది. ఆయుధాల ఎగుమతి చేస్తున్నాం. స్టార్టప్ ల హబ్ గా మారింది.

• ఇదంతా గమనించే జీ-20 దేశాలకు మోదీ నాయకత్వం వహించాలని ఆయా దేశాలు కోరాయి. కాబట్టి ప్రజలంతా అన్ని విషయాలను ఆలోచించాలని కోరుతున్నా..కేంద్రం తెలంగాణకు అన్ని విధాలా సహకరిస్తున్నా, నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదు.

• గ్రామ పంచాయతీలకు నేరుగా నిదులు కేటాయిస్తే వాటిని ఏ విధంగా దారి మళ్లించారో కళ్లారా చూశాం. రాష్ట్రం దివాళా తీయించిన కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ఆదాయం సంపాదించింది.

• ఈ వేదిక నుండి సవాల్ చేస్తున్నా… అసెంబ్లీ సాక్షిగా 2014లో మీరు, మీ కుటుంబ ఆస్తుల వివరాలేంది? ఇప్పుడు మీవి, మీ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలపై శ్వేత ప్రత్రం విడుదల చేయాలి.

• అట్లాగే రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు, నిధులు కేటాయింపుపైనా శ్వేత పత్రం విడుదల చేయాలి.

• ఇకపై మనమంతా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలవారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలి. వాటి అమలు కోసం పోరాడాలి. ప్రజలకు భరోసా కల్పించాలి.

• 317 జీవోపై టీచర్లు చేసిన పోరాటాలను మనం చూస్తున్నాం.. పోలీసుల అమానుష చర్యలను చూశాం. చిన్నపిల్లలు, మహిళలని కూడా చూడకుండా రాత్రంతా స్టేషన్ లో ఉంచారు. వారిపై దీక్ష చేస్తే నన్ను కూడా జైల్లో పెట్టారే తప్ప ఆ జీవోను సవరించడం లేదు. ఈ విషయంలో ప్రగతి భవన్ ను ముట్టడించి సమస్య తీవ్రతను ప్రజల్లోకి తీసెకెళ్లిన బీజేపీ మోర్చాల పనితీరు భేష్.

• 317 జీవో పేరుతో ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం. ఈనెల 30లోపు ఆ సమస్యను పరిష్కరించాలి. భేషరతుగా క్షమాపణ చెప్పాలే. లేనిపక్షంలో 30న ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున దర్నా చేపట్టి నీ మెడలు వంచుతాం.. ఆ సమస్య పరిష్కరించేదాకా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉద్యోగులు 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేస్తేనే తెలంగాణ వచ్చి నువ్వు సీఎం అయ్యావనే విషయాన్ని గుర్తుంచుకోవాలే.

• బీజేపీ నాయకులు సొంత మైలేజీ కోసం పనిచేయొద్దు. సొంత ఎజెండా కోసం పనిచేసేవాళ్లు బీజేపీ నాయకులే కాదు… మోదీ నాయకత్వంలో పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేవారే అసలైన నాయకులు. సిద్దాంతాల కోసం ప్రాణ త్యాగం చేసిన నేతల ఆశయాలను నెరవేర్చాలి. తెలంగాణ కోసం బలిదానమైన 1400 మంది ఆశయాలను సాధించాలంటే… ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలే.

• ప్రజా సమస్యలపై నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుగుణాకర్ రావు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడాన్ని అభినందిస్తున్నా.. మనందరం ప్రజల బాధలను పంచుకోవాలి. ఆందోళనలను తీవ్ర స్థాయిలో చేయాలి.

• సీఎం కేసీఆర్ నీచుడు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎంతటి నీచానికైనా పాల్పడతాడు. కుటుంబాలను, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు వెనుకాడరు. వీడియోలు, ఫొటోల పేరుతో దుష్ర్పచారం చేస్తూ బీజేపీ మైలేజీని తగ్గించి ప్రజల ద్రుష్టించే కుట్ర చేస్తున్నడు. సమాజాన్ని అయోమయంలోకి నెట్టేందుకు యత్నిస్తడు.. వాటికి భయపడొద్దు. పేదల రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే అనేక అడ్డంకులు వస్తుంటాయి. వాటిని అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళదాం. తెలంగాణకు జాతీయ పార్టీ అండగా ఉంది.

• తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తాం. పేదలకు ఇండ్లు కట్టిస్తాం. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా కింద పరిహారం చెల్లిస్తాం. ఈ హామీలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ప్రజలకు నమ్మకం కలిగించాలి. అంతిమంగా రాష్ట్రంలో కొనసాగుతున్న రజాకార్, రాక్షస రాజ్యానికి చరమగీతం పాడి బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్య స్థాపనకు క్రుషి చేయాలని మీ అందరినీ కోరుతూ ముగిస్తున్నా…

• ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తూ ఇటీవల మరణించిన బీజేపీ కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X