అమెరికాలో మోడీ ప్రభుత్వ విజయాలు హైలైట్ చేసే కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు బిజెపి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆహ్వానం

హైదరాబాద్: భారతీయ ప్రవాసులను ఉద్దేశించి, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో సాధించిన విజయాలను వెలుగులోకి తీసుకురావడానికి మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ బిజెపి నాయకుడు ఎన్. రాంచందర్ రావుకు బిజెపి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆహ్వానం పంపారు. 9 సంవత్సరాల తెలంగాణ రాజకీయ అంశాలపై గురించి కూడా మాట్లాడతారని తెలిపారు.

రాంచందర్ రావు తన పర్యటనలో ఆరు రాష్ట్రాల్లో పర్యటించి ఏడు సమావేశాల్లో ప్రసంగించనున్నారు. అతని సందర్శనకు సంబంధించి.. మే 30న వాషింగ్టన్ DC, మే 31న వర్జీనియా & మేరీల్యాండ్, జూన్ 1న అట్లాంటా, జూన్ 2న డల్లాస్, జూన్ 3న షార్లెట్, జూన్ 4న రాలీ, జూన్ 6న న్యూజెర్సీ.

ఈ సమావేశాల ఉద్దేశ్యం ప్రవాస భారతీయులతో నిమగ్నమై, నరేంద్ర మోదీ ప్రభుత్వం తన హయాంలో సాధించిన విశిష్ట విజయాల గురించి తెలియజేస్తారు అని ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ప్రెసిడెంటు అడపా ప్రసాదు , పూర్వ ప్రెసిడెంటు కృష్ణా రెడ్డి , తెలంగాణ శాఖ కన్వీనర్ విలాస్ జంబుల , అరవింద్ మోదీని మరియు కొంపల్లి శ్రీనివాస్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X