हैदराबाद : फार्म हाउस मामले में अपने ऊपर लगे आरोपों पर बीजेपी राष्ट्रीय संगठन के महामंत्री बीएल संतोष ने बीआरएस को कड़ी प्रतिक्रिया दी है। उन्होंने जोर देकर कहा कि वह अपने ऊपर लगे आरोपों का सही समय आने पर सही जवाब देंगे।
महामंत्री ने कहा कि वह कौन है अब तक कोई नहीं जानता था। मगर अब उनका नाम घर-घर पहुंच गया है। उन्होंने कहा कि उनका नाम तेलंगाना में लोकप्रिय हो गया है। संतोष ने बीआरएस नेताओं की ओर इशारा करते हुए कहा कि तेलंगाना मां के नाम पर जीतने वाले अपनी मां के साथ गलत व्यवहार किया है।
संतोष ने कार्यकर्ताओं से आह्वान किया तेलंगाना में बुरी आत्माओं से निजात पाने के लिए तैयार हो जाये। उन्होंने शामीरपेट में भाजपा की बैठकों में भाग लिया और दिशानिर्देश दिया। संतोष ने कहा कि बिना पुख्ता सबूत के बीआरएस नेताओं पर बीजेपी कैसे आरोप लगा सकती हैं। समय आने पर कौन क्या पता चल जाएगा। बीजेपी नेताओं ने कहा कि जल्द ही लोगों को सच्चाई पता चल जाएगा।
సరైన సమయంలో సరైన సమాధానం : BL సంతోష్
హైదరాబాద్ : ఫామ్ హౌస్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై BJP జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి BL సంతోష్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన సమాధానం చెబుతానని అన్నారు. తాను ఎవరో తెలియకపోయినా.. తన పేరు మాత్రం ఇంటింటికి వెళ్లిందన్నారు.
తెలంగాణలో తన పేరు పాపులర్ అయిపోయిందన్నారు. తెలంగాణ తల్లి పేరుతో గెలిచి.. ఆ తల్లి రొమ్మును గుద్దారంటూ BRS నేతలను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలో దుర్మార్గపు పానలను పారద్రొలాలంటూ కార్యకర్తలకు సంతోష్ పిలుపునిచ్చారు. శామీర్‌పేటలో జరుగుతున్న బీజేపీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. బీజేపీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
మరోవైపు బలమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎలా చేస్తామని బీఆర్ఎస్ నేతలపై బీజేపీ మండిపడుతోంది. సమయం వచ్చినప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుందన్నారు. త్వరలోనే ప్రజలకు కూడా నిజనిజాలు తెలుస్తాయని బీజేపీ నేతలు అన్నారు.
వాస్తవానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసిన. అధికారులు సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.
విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు స్పష్టం చేశారు. అయినా బీఎల్ సంతోష్ విచారణకు హాజరుకాలేదు. దీంతో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు బీఎల్ సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేశారు. సిట్ నోటీసులపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అరెస్ట్ చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు హైకోర్టు నిర్దేశించింది.
సంతోష్‌కు సిట్ జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. సంతోష్‌కు నోటీసు అందజేయడానికి ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని, ఆయనకు నోటీసు అందజేయడానికి తమకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ సిట్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేసింది. అదే సమయంలో, సిట్ నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. (Agencies)