” जान से मार देंगे !… ” विधायक राजा सिंह को एक बार फिर धमकी भरा पत्र ‘ అంతు చూస్తాం…’

हैदराबाद : राजनीति में फायर ब्रांड माने जाने वाले गोशामहल से बीजेपी विधायक टी. राजा सिंह को एक बार फिर जान से मारने की धमकी वाला पत्र मिला है। राजा सिंह को पहले भी कई बार विदेशी नंबरों से इंटरनेट कॉल के ज़रिए चेतावनी मिल चुकी थी। अब उनके घर पर एक ऐसा पत्र आया है। इससे सिक्योरिटी फोर्स हैरान हैं। रविवार शाम को मिले इस पत्र में कथित तौर पर ‘अब्दुल हफीज’ व्यक्ति का नाम उल्लेखित है।

पत्र का कंटेंट बहुत विवादित और गंभीर चेतावनियों से भरा हुआ है। इस पत्र में उस व्यक्ति ने पुलिस को खुली चुनौती दी है। पुलिस उसे पहचान नहीं पाएगी और राजा सिंह की सुरक्षा में लगे सिक्योरिटी फोर्स भी उसका कुछ नहीं कर पाएंगे।

पहले जब फोन कॉल आते थे, तो पुलिस उन्हें ट्रेस करके जांच करती थी। हालांकि अब सीधे घर पर पत्र भेजने से सदेह व्यक्त किया जा रहा है कि आरोपी विधायक के उनकी मूवमेंट और उनके रहने की जगह पर कड़ी नज़र रखी है। क्या यह सिक्योरिटी फेलियर है या किसी ने जानबूझकर पैनिक पैदा करने के लिए ऐसा किया? इस बात पर बहस हो रही है।

राजा सिंह के समर्थक इस पत्र पर गहरा गुस्सा दिखा रहे हैं। उनका आरोप है कि सरकार पहले ही कई बार राजा सिंह की सिक्योरिटी बढ़ाने की अपील की जा चुकी है, लेकिन सरकार की ओर से इस ध्यान नहीं दिया हैं। विधायक कार्यालय इस पत्र को लेकर पुलिस में ऑफिशियल कंप्लेंट करने के लिए तैयार है। पुलिस पत्र को जब्त करने और उस पर लिखी हैंडराइटिंग और पोस्टल स्टैम्प के आधार पर आरोपियों की पहचान करने की तैयारी कर रही है।

राजनीतिक विश्लेषकों का मानना ​​है कि हैदराबाद जैसे शहर में किसी पब्लिक रिप्रेजेंटेटिव को इस तरह का पत्र मिलना साधारण बात नहीं है। इंटेलिजेंस एजेंसियों ने इस पत्र के पीछे के सोर्स का पता लगाने में जुट गई है। पुलिस ने पुराने शहर में लॉ एंड ऑर्डर बिगड़ न जाये हो इसीलिए राजा सिंह के घर पर सिक्योरिटी कड़ी कर दी है।

Also Read-

‘అంతు చూస్తాం…’ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ

హైదరాబాద్ : రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌కు మరోసారి ప్రాణహాని తలపెడుతూ బెదిరింపుల లేఖ రావడం కలకలం సృష్టించింది. గతంలో పలుమార్లు విదేశీ నంబర్ల నుండి ఇంటర్నెట్ కాల్స్ ద్వారా హెచ్చరికలు అందుకున్న రాజాసింగ్‌కు ఈసారి ఏకంగా ఆయన నివాసానికే ఒక లేఖ అందడం భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఆదివారం సాయంత్రం అందిన ఈ లేఖలో ‘అబ్దుల్ హఫీజ్’ అనే వ్యక్తి పేరు ఉన్నట్లు సమాచారం.

లేఖలోని సారాంశం అత్యంత వివాదాస్పదంగా, తీవ్రస్థాయిలో హెచ్చరికలతో కూడి ఉన్నట్లు తెలుస్తోంది.ఈ లేఖలో సదరు వ్యక్తి పోలీసు యంత్రాంగానికి బహిరంగ సవాల్ విసిరినట్లు సమాచారం. పోలీసులు తనను గుర్తించలేరని అంతు చూస్తామంటా, రాజాసింగ్‌కు రక్షణగా ఉన్న భద్రతా దళాలు కూడా తనను ఏమీ చేయలేవని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

గతంలో ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు పోలీసులు ట్రేస్ చేయడం ద్వారా దర్యాప్తు చేసేవారు. కానీ, ఇప్పుడు నేరుగా ఇంటికే లేఖ పంపడం అంటే నిందితుడు ఎమ్మెల్యే కదలికలపై, ఆయన నివాస ప్రాంతంపై పూర్తి నిఘా ఉంచాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భద్రతా పరమైన వైఫల్యమా లేక కావాలని ఎవరైనా భయాందోళనలు సృష్టించేందుకు ఇలా చేశారా? అనే కోణంలో చర్చ జరుగుతోంది.

ఈ ఘటనపై రాజాసింగ్ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం రాజాసింగ్‌కు భద్రత పెంచాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ లేఖపై ఎమ్మెల్యే కార్యాలయం అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. సదరు లేఖను స్వాధీనం చేసుకుని, దానిపై ఉన్న చేతిరాత, పోస్టల్ స్టాంపుల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

హైదరాబాద్‌ వంటి నగరంలో ఒక ప్రజాప్రతినిధికి ఇలాంటి లేఖలు రావడం సాధారణ విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిఘా వర్గాలు ఇప్పటికే ఈ లేఖ వెనుక ఉన్న మూలాలను వెతికే పనిలో పడ్డాయి. పాతబస్తీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు రాజాసింగ్ నివాసం వద్ద భద్రతను మరింత కఠినతరం చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X