BJP And Congress Conspiring To Privatize Singareni Through Mines Auction : KTR

KTR Questions Central Government’s Move to Auction Mines Instead of Allocating Them Directly to Singareni

KTR also finds fault with Revanth Reddy’s silence and decision to participate in the auction.

Hyderabad : BRS Working President KTR accused both the BJP and Congress, in their respective central and state governments, of undermining Singareni by opting to auction coal mines in Telangana instead of allocating them directly to Singareni. Today, during a media conference at Telangana Bhavan, KTR criticized the Congress state government for participating in the mine auctions instead of demanding direct allocation to Singareni.

The Central Government is auctioning more than 60 mines in the country, including Singareni, starting tomorrow. The state government’s participation in the auction contradicts their previous stance of opposing the auction and seeking direct allocation from the Central Government to Singareni, KTR said. He also reminded the public that the present Chief Minister, then PCC President, had written a letter to the Central Government asking for the cancellation of the Singareni mines auction and requested direct allocation to Singareni.

KTR questioned Chief Minister Revanth Reddy’s silence over the Central Government’s auction of mines in the Singareni area. KTR doubted the present Chief Minister’s silence on this issue, considering his previous opposition when he was not in power. KTR said that their party and their government have stalled the auctioning of coal mines in the Singareni area for the past nine years to safeguard Singareni’s future.

यह भी पढ़ें-

With 16 MPs, neighboring state’s Chief Minister Chandrababu Naidu is trying to halt the privatization of Vizag Steel Plant and safeguarding their state’s interests. In contrast, the 16 elected MPs from Telangana, both from Congress and BJP, remain silent despite the Central Government’s attempt to harm the state’s prospects through the mines auction.

KTR demanded that all MPs and the two central ministers from Telangana should immediately work to cancel the Singareni mines auction. He also accused the central ministers from Telangana of harming the state’s interests by remaining silent on this matter.

KTR stated that the same Central Government made the Vizag Steel Plant incur losses by not allocating dedicated mines. He accused the BJP-led Central Government and the Congress-led state government of conspiring to privatize Singareni in the long run. KTR referred to past actions of the Central Government in allocating mines to Gujarat state undertakings like Gujarat Mineral Development Corporation and allotting lignite mines to public sector undertakings. He questioned why Singareni could not receive similar treatment.

KTR accused both national parties of conspiring to damage the prospects of Telangana State since they won the Lok Sabha elections, leaving no voice to safeguard the state. He warned that Congress and BJP should stop the auction of mining or participating in the auction and allocate the mines directly to Singareni.

KTR also said that even if companies participate in the auction and get the mining rights, the BRS would cancel the leases once they come into power after four and a half years. KTR assured that BRS would try to safeguard Singareni and its future by taking direct action against the Central Government’s move to auction Singareni mines.

సింగ‌రేణి వేలం పాట‌ను ఉప‌సంహ‌రించుకోవాలి : కేటీఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సింగ‌రేణిని తొమ్మిదిన్న‌రేండ్లు కాపాడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో క‌లిసి బొంద పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. సింగ‌రేణి మెడ‌పై కేంద్రం క‌త్తి పెట్టింది. కేంద్రం పెట్టిన క‌త్తికి కాంగ్రెస్ సాన‌బెడుతోంది. వేలం పాట‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్రాన్ని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఒక ర‌క్ష‌ణ క‌వ‌చం, శ్రీరామ‌ర‌క్ష అని కేసీఆర్ ఈ 25 ఏండ్ల‌లో ఒక్క‌సారి కాదు వేల సార్లు చెప్పారు. కానీ ఇవాళ ఏం జ‌రిగింది. కేసీఆర్ 16 పార్ల‌మెంట్ సీట్లు ఇవ్వండి అని మొత్తుకున్నారు. కేంద్రంలో నిర్ణ‌యాత్మ‌క పాత్ర‌లో ఉంటామ‌ని చెప్పారు. 16 ఎంపీల‌తో ఏం చేస్తార‌ని సీఎం రేవంత్ రెడ్డితో స‌హా చాలా మంది చాలా మాట్లాడారు. కానీ ఇవాళ ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ నిర్ణ‌యాత్మ‌క పాత్ర‌లో ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ ఆగిపోయింది. కానీ ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 16 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ఇవాళ హైద‌రాబాద్‌లో బొగ్గు గ‌నుల‌ను వేలం వేస్తున్న‌ట్లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించార‌ని కేటీఆర్ తెలిపారు.

బొగ్గు గ‌నుల‌ను వేలం వేయొద్ద‌ని 2021, డిసెంబ‌ర్ 8న కేంద్రానికి నాటి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన సింగ‌రేణికి బొగ్గు గ‌నుల‌ను అప్ప‌గించాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. బీహార్‌లోని చెస్నా అనే ప్రాంతంలో ఆనాడు బొగ్గు బావిలో ప్ర‌మాదం జ‌రిగి వంద‌ల మంది కార్మికులు చ‌నిపోయారు. నాటి కేంద్ర ప్ర‌భుత్వం.. బొగ్గు గ‌నులు అన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల కింద‌నే ఉండాల‌ని, ఉంటేనే ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవడానికి అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పి, 1975 – 76 లో నాటి కేంద్ర ప్ర‌భుత్వం ఒక విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంది. దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ లేఖ రాశారు. ప్ర‌స్తుతం సింగ‌రేణిలో 51 శాత రాష్ట్రం వాటా, 49 శాతం కేంద్ర వాటా ఉంది. కాబ‌ట్టి సింగ‌రేణికే బొగ్గు గ‌నులు కేటాయించాల‌ని కేసీఆర్ అడిగారు. నాటి పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి డిసెంబ‌ర్ 11, 2021.. ప్ర‌ధానికి లేఖ రాశారు. నాలుగు బొగ్గు గ‌నుల వేలాన్ని నిలిపివేయాలి. వేల మంది వ‌ర్క‌ర్లు రోడ్డున ప‌డుతార‌ని చెప్పారు. కానీ ఇవాళ బొగ్గు గ‌నుల వేలంలో పాల్గొంటామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క చేత చెప్పించార‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత బొగ్గు మంత్రిత్వ శాఖ‌ ద్వారా ఏ టెండ‌ర్, వేలం లేకుండా.. ఒడిశాలో రెండు గ‌నుల‌ను నైవేల్లి లిగ్నైట్ లిమిటెడ్‌కు అప్ప‌గించారు. గుజ‌రాత్‌లో గుజ‌రాత్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్, గుజ‌రాత్ ఇండ‌స్ట్రీ ప‌వ‌ర్ లిమిటెడ్‌కు 2015లో నాలుగు బొగ్గు గ‌నులు అప్ప‌జెప్పారు. ఒక వైపు ఒడిశాలో రెండు, గుజ‌రాత్‌లో రెండింటికి ఐదు బొగ్గు గ‌నులు అప్ప‌జెప్పారు. త‌మిళ‌నాడులోనూ ప్ర‌భుత్వ రంగ సంస్థ‌కు బొగ్గు గ‌నులు వేలం లేకుండా ఇచ్చారు. అదానీకి బైల‌దిల్లా గ‌ని కేటాయించ‌డం వ‌ల్ల విశాఖ ఉక్కు న‌ష్టాల్లోకి వెళ్లింది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ న‌ష్టాల్లో పోయింది ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు అప్ప‌గిస్తున్నామ‌ని కొంద‌రు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సింగ‌రేణి విష‌యంలో కూడా ఇదే వైఖ‌రి అవ‌లంభిస్తారు. సింగ‌రేణికి బొగ్గు గ‌నులు కేటాయించ‌కుండా ఉద్దేశ‌పూర్వ‌కంగా చేస్తున్న‌ కుట్ర ఇది. రేవంత్ రెడ్డి వ్య‌తిరేక‌త ఎందుకు మాయ‌మైంది. ముఖ్య‌మంత్రిగా వేలం పాట‌లో పొల్గొంటామ‌ని చెబుతున్నారు. ఇది దారుణం అని కేటీఆర్ మండిప‌డ్డారు.

కేంద్రం మా మెడ మీద క‌త్తి పెట్టినా బొగ్గు గ‌నుల‌ను వేలం వేయ‌కుండా చూశాం. తొమ్మిదిన్న‌రేండ్లు సింగ‌రేణిని కాపాడుకున్నాం. సింగ‌రేణి లాభ‌ప‌డితే మ‌న రాష్ట్రానికి లాభం జ‌రుగుతుంది. కార్మికులు లాభ‌ప‌డుతారు. సింగ‌రేణి కార్మికులు జంగ్ సైర‌న్ ఊదితే ద‌క్షిణ భార‌త‌దేశం అంధ‌కారంలోకి వెళ్లిన‌ ప‌రిస్థితి. ఎప్పటికైనా సింగ‌రేణిని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే. మ‌న గ‌నుల్లో మ‌నం బొగ్గు త‌వ్వుకోకుండా అడ్డుకోవ‌డం దుర్మార్గం. సింగ‌రేణి కార్మికులు అన్నీ అర్థం చేసుకోవాలి. సింగ‌రేణి బొగ్గు బ్లాకుల‌ను కార్పొరేట్ గ‌ద్ద‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డాన్ని ఖండిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఖ‌తం చేసిన‌ట్టే సింగ‌రేణిని ఖ‌తం చేస్తారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 సీట్లు ఇచ్చినందుకు సింగ‌రేణిని నాశ‌నం చేస్తున్నారు. ఇక్క‌డి ప్ర‌భుత్వ చేత‌గానిత‌నం వ‌ల్లే మ‌న‌కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వ‌డం లేదు.

కాంగ్రెస్, బీజేపీలు క‌లిసి దోపిడీకి తెర తీశాయి. కేసీఆర్ ఆనాడు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొన‌లేదు. బీఆర్ఎస్ లోక్‌స‌భ‌లో లేదు కాబ‌ట్టే.. ఇవాళ సింగ‌రేణి గ‌నుల‌ను వేలం వేస్తున్నారు. 2021లో కేంద్రానికి లేఖ రాసిన రేవంత్ ఇప్పుడెందుకు మారిపోయాడు. రేవంత్ రెడ్డికి కేసుల భ‌యం ప‌ట్టుకుందా..? సింగ‌రేణిని బొంద‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీజేపీ నిర్ణ‌యానికి కాంగ్రెస్ ఎందుకు వంత పాడుతోంది. రేపు వేలం పాట‌లో డిప్యూటీ సీఎం ఎందుకు పాల్గొంటున్నారు. సింగ‌రేణి మెడ‌పై కేంద్రం క‌త్తి పెట్టింది. కేంద్రం పెట్టిన క‌త్తికి కాంగ్రెస్ సాన‌బెడుతోంది. వేలం పాట‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్రాన్ని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X