ఈడీ, ఐటీ, జీఎస్టీ దాడులతో ప్రజా సమస్యలు పక్కదారికి పట్టిస్తున్న బిజెపి, టీఆర్ఎస్ : భట్టి విక్రమార్క

ఫారెస్ట్ అధికారి బలికావడం ప్రభుత్వ వైఫల్యమే

ఆనర్థాలకు దారితీస్తున్న ప్రభుత్వ నాన్చుడు దోరణి

ఈడీ, ఐటీ, జీఎస్టీ దాడులతో ప్రజా సమస్యలు పక్కదారికి పట్టిస్తున్న బిజెపి, టీఆర్ఎస్

మర్రి శశీధర రెడ్డి వ్యాక్యాలు సమర్ధనీయం కాదు

వ్యక్తిగతమైతే వందసార్లు మొక్కు.. నొక్కు హెల్త్ డైరెక్టర్కు చురకలు

జగ్గారెడ్డి అభిప్రాయాలను గౌరవిస్తాను
.
అసెంబ్లీ మీడీయా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Hydeabad: పోడు భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ పరిష్కరించని కారణంగానే ఫారెస్ట్ అధికారి ప్రాణం పోయిందని, ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం అసెంబ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యను పరిష్కరించకుండ ప్రభుత్వం నాన్చుడు దోరణితో కాలయాపన చేయడం వల్ల ఆసమస్య జఠిలంగా మారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈసంఘటనే ఉధాహరణ అని వివరించారు. పోడు రైతులకు చట్ట బద్దంగా హక్కులు కల్పించాలని రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అసెంబ్లీ లోపల, బయట తమ గళం వినిపించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా పెడ చెవి పెట్టడంతో సిన్సియారిటి కలిగిన ఫారెస్ట్ అధికారి ప్రాణం బలిగొనడానికి కారణమైందన్నారు. భూమికి మనిషికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఆడవిలో పుట్టిన బిడ్డలకు ఆడవిపై హక్కులేదని అనడం సరైంది కాదని అన్నారు. ఆటవి హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం చేయాల్సిన తంతు చేయకపోవడం వల్లనే వారి సమస్య పరిష్కారానికి జాప్యం అవుతుందన్నారు. ఎమ్మెల్యేలు చైర్మెన్ గా ఉండేటువంటి ల్యాండ్ అసైన్డ్ కమిటి సమావేశాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగడంలేదన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాడానికి మీడియా కలిసి రావాలి

ఈ కమిటీలను ప్రభుత్వం రద్దు చేయడం వల్ల అనేక సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల పార్టు- బిలో ఉన్న రైతులు భూమిపైన హక్కులు లేవన్న భయంతో బతుకుతున్నారని చెప్పారు. భూమికి మనిషికి ఉన్న బతుకుదెరువు సమస్యలను కాలయాపన చేస్తూ నాన్చి నాన్చి పెండింగ్లో పెట్టడం వల్ల ఆనర్థాలకు దారి తీసే ప్రమాదం ఉందని ఇటీవల ఛీఫ్ సెక్రటరిని కలిసి భూమిలేని నిరుపేదలు, భూమి ఉన్న రైతుల సమస్యలను పరిష్కారించాలని చెప్పామన్నారు. భూ సేకరణ చేసినప్పటికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేయని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గు చేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి అందోలన కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం కండ్లు తెరిచి వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన, అందోలన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. రండి ప్రజల కోసం నిలబడుదాం, ప్రజా సమస్యల కోసం పోరాడుదాం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాడానికి మీడియా కలిసి రావాలని మార్పుకు నాంధి పలుకాలని విజప్తి చేశారు.

ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్న బిజెపి, టీఆర్ఎస్

పాలకుల వైఫల్యాలు, సమస్యలపై ప్రజలు ఆలోచన చేయకుండ ఉండటానికి ఈడి, ఐటీ, జీఎస్టీ పేరిట పరస్పర దాడులతో కుట్ర పూరితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను, మీడియాను, మేదావులను, సామాజిక శాస్త్రవేత్తలను, రాజకీయనాయకులను పక్కదారి పట్టిస్తున్న వైనం చాలా బాధకరమని ఆవేధన వ్యక్తం చేశారు. గతంలోనూ ఐటీ, ఈడీ దాడులు జరిగాయన్నారు. రోటీన్ గా, రెగ్యులర్ గా విధినిర్వహణలో జరిగేటువంటి రైడ్స్ ను టీఆర్ఎస్, బిజెపిలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. సమస్యలపైన ప్రజలు ఆలోచన చేయకుండ పక్కా ప్లాన్ ప్రకారంగా బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు కుట్ర పూరితంగా వ్యహరిస్తున్నాయని దుయ్యబట్టారు. దాడులు లేని రోజున రెండు పార్టీల నాయకులు సభ్యసమాజం తలదించుకునే విధంగా పరస్పరం దూషించుకొని ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు. రాచరిక వ్యవస్థ నిజాం పాలనలో ప్రశ్నించిన వారిని కాశీం రిజ్వి సైన్యంతో అనిచివేసినట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈడి, ఐటీ, జీఎస్టీల వ్యవస్తలను వాడుతూ ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు.

మర్రి శశీధర రెడ్డి వ్యాక్యాలు సమర్ధనీయం కాదు

జాతిపిత మహత్మగాంధిని చంపిన గాడ్సే పార్టీ బిజెపి అని పలుమార్లు విమర్శించిన మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ వీడి బిజెపిలో చేరడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీని వీడే క్రమంలో ఆయన కాంగ్రెస్ నాయకత్వంపై చేసిన విమర్శలను సైతం ఖండించారు. బిజెపి దేశానికి అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని మర్రి శశిధర్ రెడ్డి విస్మరించడం భాధకరమన్నారు. లౌకికవాదిగా అన్ని మతాలకు ముఖ్యమంత్రిగా సముచితం స్థానం కల్పించిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి వారసుడిగా మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరడం సమర్ధనీయం కాదన్నారు.

వ్యక్తిగతమైతే వందసార్లు మొక్కు.. నొక్కు

రాష్ట్రస్థాయి ఉన్నతాధికారిగా ఉన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాళ్లు మొక్కుతా బాంచెన్ అనే పీడన నుంచి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు పడుతున్న క్రమంలో రాష్ర్ట స్థాయి ఉన్నతాధికారిగా ఉన్న శ్రీనివాస్ రావు సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కడాన్ని ఖండించారు. ప్రభుత్వ అధికారిగా కాకుండా శ్రీనివాస్ రావు వ్యక్తిగతంగా వందల సార్లు అయినా కేసీఆర్ కాళ్ళు మొక్కుచ్చు…కడుగొచ్చు నొక్కొచ్చు.. అని తమకు ఏలాంటి అభ్యంతరం లేదన్నారు.

జగ్గారెడ్డి అభిప్రాయాలను గౌరవిస్తా

నాకు బేషజాలాలు లేవు.. ఎవరితో వైషమ్యాలు లేవు. అభిప్రాయ బేధాలతో ఉన్న, మనస్థాపానికి గురైన నాయకులతో ఎవరితోనైన సీఎల్పీ నేతగా మాట్లాడుతాను. ఏమైన అభిప్రాయభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకుందాం. ఎవరు అందోలన చెందవద్దన్నారు. ‘‘జగ్గారెడ్డి అభిప్రాయాలను నేను గౌరవిస్తా. నేను జగ్గారెడ్డితో మాట్లాడుతా…జగ్గారెడ్డి ఏమైనా సమాచారం ఇచ్చి వారితో మాట్లాడమంటే మాట్లాడుతా…, నా దగ్గరకు జగ్గారెడ్డి ఏ విషయం తెచ్చినా నేను స్వీకరిస్తా… ఆయన తీసుకొచ్చిన పని చేస్తా. జగ్గారెడ్డి ఆశించిన విధంగా నేను పని చేయలేకపోతే ఆయన అనుకున్నది నేను చేస్తా. నేను ఆయన ఆశించిన విధంగా చేయకపోతే కొత్త వ్యక్తులను పెట్టుకోవచ్చని’’ పిసిసి, సీఎల్పీ నేతలపై జగ్గారెడ్డి చేసిన వ్యాక్యాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X