రవీంద్రభారతిలో భగీరథ మహర్షి జయంతి ఘన నివాళులు అర్పించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
బీసీ సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ
సగరుల సంక్షేమానికి విలువైన కోకాపేటలో రెండు ఎకరాలు రెండు కోట్లతో ఆత్మగౌరవ భవన నిర్మాణం
నాడు దివి గంగను భువికి భగీరథ మహర్షి మళ్లిస్తే నేడు గోదారమ్మని పొలాలకు అపర భగీరథుడై కేసీఆర్ మళ్ళించారు
మిషన్ భగీరథ తో ఇంటింటికి తాగునీరు అందించిన ఏకైక ప్రభుత్వం కెసిఆర్ గారిది
ఘనంగా స్మరించుకున్న మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ వైతాళికులను ఘనంగా స్మరించుకుంటుంది, అందులో భాగంగా నేడు రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ వేడుకలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై భగీరథ మహర్షికి ఘనంగా జయంతి నివాళులు అర్పించారు.
జ్యోతి ప్రజ్వలన అనంతరం హాజరైన బీసీలు, సగర సంఘాల నేతలను ఉద్దేశించి మంత్రి గంగుల మాట్లాడుతూ బీసీ సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 310 బీసీ గురుకులాలను ప్రపంచస్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు, బీసీల ఆత్మగౌరవం కోసం వేల కోట్ల విలువైన కోకాపేట్, ఉప్పల్ భగాయత్ లాంటి ప్రాంతాల్లో 41 కుల సంఘాలకు 87.3 ఎకరాల్లో 95 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామన్నారు.
భగీరథ మహర్షి వారసులైన సగరులకు సైతం కోకాపేట్ లో రెండు ఎకరాలను కేటాయించడమే కాకుండా రెండు కోట్ల నిధులను సైతం ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం వెచ్చించామన్నారు. నాడు దివి నుంచి గంగను భువికి తరలించిన భగీరథ మహర్షి తపస్సు వలె నేడు పైన పారుతున్న గోదావరిని కాలేశ్వరంతో పైకి ఉరకలెక్కించి తెలంగాణలోని ప్రతి పంట పొలానికి అపర భగీరథుని వలె కేసీఆర్ గారు నిరంధించారన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి పైప్ లైన్ ల ద్వారా సురక్షిత తాగు నిరంధించే అత్యుత్తమ కార్యక్రమానికి మిషన్ భగీరథ పేరు పెట్టుకున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగులను ఘనంగా డప్పు వాయిద్యాల మధ్య ఆహ్వానించి కార్యక్రమానంతరం శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికాను అందజేశారు సగర సంఘాల నేతలు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సగర సంగం అధ్యక్షుడు శేఖర్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బిసి సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.