హైదరాబాద్ : క్రికెట్ అభిమానులకు వేసవిలో వినోదం పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ వేదికగా 4 మ్యాచ్లు జరగనున్నాయి. పవర్ హిట్టర్ల బ్యాటింగ్ విన్యాసాలు, బంతితో చెలరేగే స్టార్ బౌలర్ల ప్రదర్శనకు వేదికైన ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు ఫ్యాన్స్‌కు అసలైన క్రికెట్ మజాను అందివ్వనుంది. మే 28న టైటిల్ పోరు జరగనుంది. 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
హార్దిక్ పాండ్యా, ధోనీ సారథ్యంలోని ఈ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అభిమానులను అలరించనున్నాయి. గత సీజన్‌లో గుజరాత్ టైటన్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాండ్యా కెప్టెన్సీలోని ఆ జట్టు ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్న 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉన్నాయి. గ్రూప్–ఏలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్. గ్రూప్–బిలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్.
ఈసారి 10 జట్లు 70 లీగ్ మ్యాచ్‌లు ఆడతాయి. ఈ మ్యాచ్‌లను దేశవ్యాప్తంగా 12 స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, లక్నో, మొహాలీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గువహటి, ధర్మశాలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు సొంత మైదానంలో ఏడు మ్యాచ్‌లు, బయటి గ్రౌండ్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడతాయి.
పదహారో సీజన్ ఐపీఎల్‌లో హైదరాబాద్ వేదికగా 4 మ్యాచ్లు జరగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాదాబ్–పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 18న సన్‌రైజర్స్ హైదరాదాబ్–ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న సన్‌రైజర్స్ హైదరాదాబ్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. (ఏజెన్సీలు)
इंडियन प्रीमियर लीग 2023 का शेड्यूल जारी
हैदराबाद : इंडियन प्रीमियर लीग 2023 का शेड्यूल भारतीय क्रिकेट कंट्रोल बोर्ड ने जारी कर दिया है। 31 मार्च से 28 मई के बीच टूर्नामेंट खेला जाएगा। 70 लीग मैच खेले जाएंगे। दो ग्रुप में 5-5 टीमों को बांटा गया है। कोई भी टीम अपने ग्रुप वाली टीम से दो मैच खेलेगी। दूसरे ग्रुप वाले से एक-एक मैच। पहला मैच पिछले साल की विजेता गुजरात टाइटंस और चेन्नई सुपर किंग्स के बीच खेला जाएगा। टूर्नामेंट का पहला डबल हेडर 1 अप्रैल को खेला जाएगा। 2 अप्रैल को भी डबल हेडर होगा। यानी पहले तीन दिन में ही सभी टीमें एक-एक मैच खेल लेंगी। आईपीएल के 16वें सीजन में कुल 18 डबल हेडर होंगे।
तीन सीजन बाद टूर्नामेंट का आयोजन होम और अवे फॉर्मेट में होगा। यानी टीम एक मैच घरेलू मैदान और दूसरा मैच दूसरी टीम के घरेलू मैदान पर खेलेगी। एक टीम 7 मैच अपने घरेलू मैदान पर खेलेगी और 7 मैच बाहर खेलेगी। लीग स्टेज का आखिरी मैच 21 मई को खेला जाएगा। लीग स्टेज के मुकाबले 12 स्थान पर खेले जाएंगे। पंजाब किंग्स और राजस्थान रॉयल्स को क्रमशः धर्मशाला और गुवाहाटी में दो-दो घरेलू मैच खेलने हैं।
आपको बता दें कि कोरोना के कारण आईपीएल 2020 भारत से बाहर आयोजित हुआ था। वहीं आईपीएल 2021 के कुछ मैच भारत में हुए थे। कोरोना के मामले सामने आने बाद इसे यूएई शिफ्ट कर दिया गया था। आईपीएल 2022 भारत में हुआ, लेकिन मुंबई में इसके सारे लीग मैच हुए। आईपीएल 2022 में दो नई टीमों की एंट्री हुई थी। गुजरात टाइटंस और लखनऊ सुपरजायंट्स की ये टीमें थीं। इस बार भी टूर्नामेंट में 10 टीमें होंगी। हार्दिक पांड्या की कप्तानी में पहले ही सीजन में गुजरात की टीम खिताब जीती थी।
हैदराबाद में 4 मैच खेले जाएंगे। सनराइजर्स हैदराबाद और राजस्थान रॉयल्स के बीच 2 अप्रैल को उप्पल के राजीव गांधी स्टेडियम में भिड़ंत होगी। सनराइजर्स हैदराबाद-पंजाब किंग्स के बीच 9 अप्रैल को, सनराइजर्स हैदराबाद-मुंबई इंडियंस के बीच 18 अप्रैल को, सनराइजर्स हैदराबाद-दिल्ली कैपिटल्स के बीच24 अप्रैल को मैच खेले जाएँगे। (एजेंसियां)