“కేసీఆర్… ముఖం యాడ పెట్టుకుంటావ్?”

-బయ్యారం స్టీల్ పై డీపీఆర్ ఇవ్వనేలేదని కేంద్రమే తేల్చింది

-అబద్దాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే

-అభివ్రుద్దిపై చర్చకు రాకుండా అబద్దాలతో దారి మళ్లిస్తావా?

– గవర్నర్ విషయంలో హైకోర్టు చెంప చెళ్లుమన్పించినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు

    -అనుమతి ఇవ్వలేదని 3 రోజులకే కోర్టుకెక్కినవ్… ఫిరాయింపు ఫైలు ఏళ్లుగా పెండింగ్ లో ఎందుకు పెట్టినవ్?

    -ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మరో 20 జవాబులు తప్పుల తడక.. నిబంధనలను సడలించాల్సిందే

    -కేసీఆర్ పాలనలో సర్పంచులతోసహా అన్ని వర్గాలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి

    -బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్

    -గ్లోబల్ ఆసుపత్రిలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ కు పరామర్శ

    హైదరాబాద్ : ’’బయ్యారం స్టీల్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడం లేదంటూ 8 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్రాన్ని తిట్టడమే కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు పనిగా పెట్టుకున్నారు. అసలు బయ్యారం స్టీల్ ఏర్పాటుపై ఇంతవరకు డీపీఆర్ ఇవ్వనేలేదనే విషయం కేంద్రం తేల్చింది. మూడున్నరేళ్లుగా లేఖ రాసినా స్పందనేలేదని చెప్పింది. మరి కేసీఆర్… ముఖం యాడ పెట్టుకుంటారు?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

    “అబద్దాలు చెప్పి మోసం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అభివ్రుద్దిపై చర్చకు రాకుండా అబద్దాలతో కేసీఆర్ ప్రజల చర్చను దారి మళ్లించేందుకు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చివరకు గవర్నర్ ను బదనాం చేసేందుకు హైకోర్టుకు వెళ్లి భంగపడ్డారన్నారు. ఈ విషయంలో హైకోర్టు చెంప చెళ్లుమన్పించినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు. బడ్జెట్ ఫైలుకు ఆమోదం 3 రోజులుగా ఆమోదం తెలపడం లేదని కోర్టుకెక్కిన కేసీఆర్… మీ స్పీకర్ ఫిరాయింపు ఫైలును ఏళ్ల తరబడి పెండింగ్ లో పెడితే ఎందుకు మాట్లాడటం లేదు?’‘ అని నిలదీశారు.

    ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మరో 20 జవాబులు తప్పుల తడకగా మారాయని, వెంటనే సరిజేయడంతోపాటు ఈ పరీక్షలకు పెట్టిన నిబంధనలను సడలించాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో సర్పంచులతోసహా అన్ని వర్గాలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని, నిజామాబాద్ కలెక్టరేట్ సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నమే ఇందుకు నిదర్శనమన్నారు.

    పోలీసుల దాడిలో గాయపడి గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ ను ఈరోజు మధ్యాహ్నం మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కోశాధికారి భండారి శాంతికుమార్ లతో కలిసి బండి సంజయ్ పరామర్శించారు.

    అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యంశాలు…

    బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ డీజీపీ ఆఫీస్ కు వెళ్లిన బీజేవైఎం నాయకులపైన పోలీసులు బండ బూతులు తిడుతూ విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేశారు. నేమ్ ప్లేట్, బ్యాడ్జ్ లేకుండా పోలీస్ డ్రస్ లో వచ్చి మర్మాంగాలపై దాడి చేయడంతోపాటు తీవ్రంగా గాయపరిచారు.

    ముఖ్యమంత్రి చిల్లర బుద్దులు. చిల్లర పనులు చేస్తున్నారు. నష్టపోయిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయమని కోరడం తప్పా? దేశంలో ఎక్కడాలేని విధంగా నిబంధనలు పెడతారా?

    ప్రశ్నాపత్రాలు తప్పుల తడక. 20 ప్రశ్నలకు జవాబులు తప్పు. వాటికి మార్కులివ్వాలనే సోయి లేదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. అరెస్ట్ లు చేసి జైళ్లకు పంపుతున్నారు. తక్షణమే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.

    కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ ప్రాంతానికి పోయినా నిజాం రాజులే అనుకుంటున్నరు. కేటీఆర్ కమలాపూర్ రేపు వెళుతుంటే ఈరోజే బీజేపీ నాయకులు, కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ లో పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం?

    బయ్యారం స్టీల్ ఏర్పాటు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని 8 ఏళ్లుగా తిడుతున్న కేసీఆర్.. ఇప్పుడు ముఖం యాడ పెట్టుకుంటారు? బయ్యారం స్టీల్ పై ఇంతవరకు డీపీఆర్ ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. మూడున్నరేళ్లుగా 8 సార్లు లేఖ రాసినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని పేర్కొంది. ఇప్పుడు కేసీఆర్ ఏ సమాధానం చెబుతారు?

    ఛీ… మీది ఒక బతుకేనా? అబద్దాలతో టైం పాస్ చేయడం తప్ప అభివ్రుద్ధిపై మాట్లాడినవా? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నీకు దమ్ముంటే అభివ్రుద్ధి పై చర్చకు రా….

    రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాం.. దమ్ముంటే దానిపై చర్చకు రా… నోటిఫికేషన్లు తప్పుల తడక.. తెలంగాణలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారు? రుణమాఫీ చేశారు? వంటి అంశాలపై చర్చకు రా… ప్రజలను దారి మళ్లించేందుకు

    గవర్నర్ విషయంలో రాష్ట్ర హైకోర్టు సీఎం చెంప చెళ్లుమన్పించింది. అయినా సిగ్గు రావడం లేదు. ఆయనకు కోర్టులంటే లెక్కలేదు. రాజ్యాంగాన్ని పట్టించుకోరు. ప్రజలు కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారు.

    అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ను పిలిస్తే నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? బడ్జెట్ కు అనుమతి కోసం ఇంకా టైం ఉంది కదా… కోర్టుకు వెళ్లి గవర్నర్ ను బదనాం చేేసే ప్రయత్నం చేశారు. అందుకే కోర్టు చెంప చెళ్లు మన్పించింది.

    బడ్జెట్ ప్రతిపాదనలను మూడు రోజుల క్రితం పంపితే అనుమతించకుండా గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్న కేసీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని ఫిర్యాదు చేసి ఏళ్లు గడుస్తోంది. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనికేం సమాధానం చెబుతావ్.

    నిజామాబాద్ కలెక్టరేట్ లో బిల్లులు రాలేదని సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరం. కేసీఆర్ సర్పంచులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నరడానికి ఇదే నిదర్శనం. చేసిన పనులకు బిల్లులివ్వరు. కేంద్రం ఇచ్చిన నిధులకు సర్పంచులకు తెలియకుండా తస్కరిస్తారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన ఎంపీ అరవింద్ ను దూషిస్తున్నారు. కేసీఆర్ ద్రుష్టిలో నోరు మూసుకుని కూర్చునే వాళ్లు మంచోళ్లు… ప్రశ్నించే వాళ్లు దుష్టులు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Recent Posts

    Recent Comments

      Archives

      Categories

      Meta

      'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

      X