“కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా ఖమ్మం సభను సక్సెస్ చేయండి”

తెలంగాణ ద్రుష్టి అంతా ఖమ్మం సభపైనే

సభ సక్సెస్ తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం

సభ ఫెయిల్ కావాలని కొందరు కోరుకుంటున్నారు

కార్యకర్తల దమ్మేందో చూపే టైమొచ్చింది

కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగేలా సభను సక్సెస్ చేయండి

ఖమ్మంలో బీజేపీ లేదనే వాళ్లకు కనువిప్పు కలిగించండి

ఖమ్మం జిల్లా కాషాయ ఖిల్లా అని నిరూపించండి

అభినవ పటేల్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి

బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ కుమార్ పిలుపు

ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలింగ్ బూత్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్

బహిరంగ సభ సక్సెస్ కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం

హైదరాబాద్: ‘‘ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది? అక్కడ లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించే సత్తా ఖమ్మం బీజేపీ నాయకులకు ఉందా? ఖమ్మం బీజేపీ నాయకులకు సభ నిర్వహించడమే చేతకాదు’’ అనే దుష్ప్రచారం జరుగుతోంది. మీ తరపున నేను సవాల్ ను స్వీకరించిన. ఖమ్మం జిల్లా కాషాయ అడ్డా అని నిరూపించే టైమొచ్చింది. దుష్ప్రచారం చేస్తున్న నేతలకు కనువిప్పు కలిగేలా కనీవినీ ఎరగని రీతిలో బహిరంగ సభను సక్సెస్ చేద్దాం. అందుకోసం మీరంతా కసితో పనిచేయండి’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలను పిలుపునిచ్చారు.

ఈ రోజు ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు, ఆపై స్థాయి నాయకులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ పాల్గొన్న ఈ కాన్ఫరెన్స్ లో బండి సంజయ్ మాట్లాడుతూ ఈనెల 15న ఖమ్మంలో లక్ష మందితో నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్బంగా ఆయన ఏమన్నారంటే…

• ఈనెల 15న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా కార్యకర్తలకు మంచి అవకాశం. సభకు 5 రోజులే సమయముంది. ప్రతి ఒక్కరూ సీరియస్ గా కష్టపడి కసితో పనిచేయాలి.

• ఖమ్మం జిల్లాలో అసలు బీజేపీయే లేదని పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతోంది. ఆ జిల్లా నేతలకు బహిరంగ సభ నిర్వహించడం చేతకాదని చాలా మంది సవాల్ విసురుతున్నారు. మీ తరపున నేను సవాల్ ను స్వీకరించిన. ఇది మనందరికీ ప్రతిష్టాత్మకమైన అంశం. హేళన చేస్తన్న వాళ్లకు గుణపాఠం చెప్పేలా, కనువిప్పు కలిగేలా బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలి.

• అందులో భాగంగా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సభను సక్సెస్ చేయాలి. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్న నేతలందరికీ కనువిప్పు కావాలి. సభ సక్సెస్ తో ఖమ్మం జిల్లా కాషాయ అడ్డా అని నిరూపించాలి. ఖమ్మంలో కాషాయ కార్యకర్తలంతా గల్లా ఎగరేసేలా సభను సక్సెస్ చేయాలి. అభినవ సర్దార్ వల్లభాయి పటేల్ అమిత్ షా ఖమ్మం కార్యకర్తలకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి.

• తెలంగాణలోని రాజకీయ విశ్లేషకులు, మీడియా అంతా ఖమ్మంలో నిర్వహించబోయే బీజేపీ బహిరంగ సభపై ద్రుష్టిని కేంద్రీకరించారు. ఖమ్మంలో సభ సక్సెస్ కాదు.. ఎట్లా సభ నిర్వహిస్తారో చూద్దామని కొంతమంది అనుకుంటున్నారు.

• ఈ నేపథ్యంలో ఖమ్మం బీజేపీ కార్యకర్తలంతా మరింత కసితో పనిచేయాలి. కేసీఆర్ కు, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేలా సభను సక్సెస్ చేయాలి. తెలంగాణలో చరిత్ర స్రుష్టించాలి. ఈ బహిరంగ సభ సక్సెస్ తో కేసీఆర్ గుండెల్లో డప్పులు మోగాలి. ఖమ్మం కార్యకర్తలంతా బరిగీసి కొట్లాడతారనే సంకేతాలు ఇచ్చే విధంగా బహిరంగ సభను విజయవంతం చేయాలి.

• ఖమ్మంలో బీజేపీ సభ సక్సెస్ అవుతుందా? లేదా? అనే ఉత్కంఠతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ నిర్వహించిన సభలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అందరి ద్రుష్టి ఖమ్మంపై నెలకొంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి, కసితో పనిచేసి సభను సక్సెస్ చేయండి.

• అందులో భాగంగా మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి. ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించండి. ప్రజా, కుల సంఘాలను, వ్యాపారులను సభకు ఆహ్వానించండి. ‘‘నేను ఖమ్మం సభకు పోతున్నా… మీరూ వస్తున్నారా?’’ అంటూ విస్త్రత ప్రచారం నిర్వహించండి.

• కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం రావడం జిల్లా నాయకులు, కార్యకర్తలకు అందివచ్చిన మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోండి. ఖమ్మంలో బహిరంగ సభను సక్సెస్ చేస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశం ఉంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని బహిరంగ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నిన్న నేను ఖమ్మం వచ్చిన. సభ ఏర్పాట్లపై నిర్వహించిన ప్రిపరేటరీ మీటింగ్ లో కార్యకర్తల జోష్ చూసిన. సభ సక్సెస్ అవుతుందనే నమ్మకం, భరోసా కలిగింది. అదే ఉత్సాహంతో సమిష్టిగా పనిచేసి సభను సక్సెస్ చేయాలని కోరుతున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X