“నందినగర్ లోని ఇంటికే పరిమితమైన కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఎట్లా సంపాదించారు?”

కేసీఆర్… ఆర్డినెన్స్ తెచ్చి గిరిజన రిజర్వేషన్లు అమలు చేసే దమ్ముందా?

-9 ఏళ్లలో గిరిజనుల కోసం ఏం చేశావో శ్వేత పత్రం విడుదల చేయగలవా?

-తెలంగాణలో బెంగాల్ తరహా పాలన సాగుతోంది

-ప్రశ్నించే వాళ్లను జైళ్లకు పంపుతూ భయపెడుతున్నారు

-బిడ్డను, కొడుకును కాపాడుకునేందుకు తెలంగాణ ప్రజల జీవితాలను ఫణంగా పెడుతున్నారు

-బీఆర్ఎస్ నాయకులారా…. తెలంగాణలో ఏం జరుగుతుందో ఆత్మ పరిశీలన చేసుకోండి

-నందినగర్ లోని ఇంటికే పరిమితమైన కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఎట్లా సంపాదించారు?

-విదేశాల్లో పెట్టుబడులు ఎట్లా పెడుతున్నారు? దొంగ సారా దందాకు వందల కోట్లు ఎక్కడివి?

-పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకునే వాళ్లకు మద్దతిచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా?

-హిందూ దేశంలో రామాలయం నిర్మించుకోవాలంటే ప్రాణత్యాగాలు చేయాల్సిన దుస్థితి రావడమా?

-కరసేవకుల త్యాగాల స్పూర్తితో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించిన ఘనత మోదీదే

-అధికారంలోకి రాగానే రేయాన్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తాం, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం

-ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం.. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం

-ఫసల్ బీమాను అమలు చేస్తాం… పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం

-తెలంగాణలో అభివ్రుద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యం

-ములుగు బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

హైదరాబాద్ : ‘‘మస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేసీఆర్ కుట్ర చేశారు. నేను కేసీఆర్ ను సవాల్ చేస్తున్నా… ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దమ్ముందా?’’ అని సవాల్ విసిరారు. కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా…9 ఏళ్లలో గిరిజనుల కోసం ఏం చేశావో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బెంగాల్ తరహా పాలన సాగుతోందని మండిపడ్డ బండి సంజయ్ ప్రశ్నించే వాళ్లను జైళ్లకు పంపుతూ భయపెడుతున్నారని ధ్వజమెత్తారు.

బిడ్డను, కొడుకును కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజల జీవితాలను ఫణంగా పెడుతున్నారని విమర్శంచారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ నాయకులంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. నందినగర్ లోని ఇంటికే పరిమితమైన కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఎట్లా సంపాదించారు? విదేశాల్లో పెట్టుబడులు ఎట్లా పెడుతున్నారు? దొంగ సారా దందాకు వందల కోట్లు ఎక్కడివో ప్రజలంతా ఆలోచించాలని సూచించారు.

• ములుగు జిల్లా కేంద్రంలో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వేలాదిగా సభ్యులు తరలివచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళానికి బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల బన్సల్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీలు చాడా సురేష్ రెడ్డి, రమేశ్ రాథోడ్, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వన్నాల శ్రీరాములు, పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిత, బంగారు శ్రుతి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, ములుగు జిల్లా ఇంఛార్జ్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డితోపాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు మండలాల బీజేపీ అధ్యక్షులను సంజయ్ ఘనంగా సన్మానించారు. అంనతరం బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని హేళన చేసినోళ్ల నోళ్లు ఉప ఎన్నికల్లో గెలుపుతో మూయించినం. ములుగులోనూ బీజేపీ గెలుపు తథ్యం.

• ములుగు పవిత్రమైన గడ్డ. నక్సలైట్లు చంపుతామని భయపెట్టినా బుల్లెట్ దింపినా వెరవకుండా కాషాయ జెండాను ఎగరవేసేందుకు ప్రాణాలనే అర్పించిన పూజారి మాణిక్యం జన్మించిన గడ్డ ఇది. ఆయన ఆశయం నెరవేరబోతోంది.

• కాషాయ కాంతి నుండి వచ్చే భగభగ మంటలకు రంగురంగుల జెండాలన్నీ దగ్గమైపోవాల్సిందే. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా, చివరకు కేసీఆర్ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు. అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వబోతున్నారని తెలిసి కేసీఆర్ గుండెల్లో డప్పులు కొడుతున్నయ్.

• ములుగును మున్సిపాలిటీ అయ్యిందా? బస్ స్టేషన్ ఉందా? మూతపడ్డ రేయాన్ ఫ్యాక్టరీని తెరిపించాడా? మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన నేత ప్రధాని మోదీ.

• బీజేపీ అధికారంలోకి వస్తే రేయాన్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం. 5 వేల మంది పొట్టన కొడుతున్న కేసీఆర్ కు బుద్ది చెప్పండి. ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి.

• ములుగులో గిరిజన వర్శిటీ ఏర్పాటు చేస్తానంటే భూములివ్వకుంటే ఏళ్ల తరబడి నాన్చిన మూర్ఖుడు.

• గిరిజన రిజర్వేషన్లను ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి అడ్డుకున్న ఘనుడు కేసీఆర్. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలని సవాల్ చేస్తున్నా.

• కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని అడుగడుగునా మోసం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్.

• గిరిజన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటిస్తే.. ఆమెను ఓడగొట్టేందుకు కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నేతను మళ్లీ గెలిపిద్దామా?

• నందినగర్ లో ఇంటికే పరిమితమైన కేసీఆర్ కుటుంబం ఇయాల వేల కోట్లు ఎట్లా సంపాదించింది? వందల కోట్లతో దొంగ సారా దందా ఎట్లా చేస్తున్నారో చెప్పాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వని కేసీఆర్ కుటుంబం వేల కోట్లు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

• రుణమాఫీ చేయడానికి పైసల్లేవని చెబుతున్న కేసీఆర్ దుబాయి, మస్కట్ లో ఎట్లా పెట్టుబడులు పెడుతున్నారు.

• మోదీ కేబినెట్ లో 12 మంది ఎస్టీలను కేబినెట్ మంత్రులుగా చేస్తే కేసీఆర్ కేబినెట్ లో ఒక్కరికి మాత్రమే అవకాశమిచ్చి గిరిజన ద్రోహి కేసీఆర్.

• కేసీఆర్ కు సిగ్గు, శరముంటే… గిరిజనులపై ఏ మాత్రం ప్రేమ ఉంటే 9 ఏళ్లలో గిరిజనుల అభ్యున్నతికి ఎన్ని నిధులు ఖర్చు చేసిందనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి.

• కేంద్రం తెలంగాణను అభివ్రుద్ధి చేసేందుకు సిద్దంగా ఉన్నా మోదీకి, బీజేపీకి పేరొస్తుందనే సాకుతో అడ్డుకుంటున్న దుర్మార్గుడు కేసీఆర్. అభివ్రుద్ధిపై మాట్లాడకుండా కేంద్రంపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నడు.

• కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పు చేశారు. పొరపాటున మళ్లీ గెలిస్తే మరో రూ. 5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల చేతికి చిప్ప ఇవ్వడం తథ్యం.

• మోదీ పాలనలో భారత దేశం ఆర్దిక సుస్థిరత సాధిస్తూ ప్రపంచంలోనే ఆర్దికంగా అభివ్రుద్ధి చెందిన దేశాల్లో 5 వ స్థానానికి చేర్చారు. 2047 నాటికి దేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దే దిశగా క్రుషి చేస్తున్నారు.

• తెలంగాణకు ఏం చేశావని ప్రశ్నిస్తే… లాఠీ ఛార్జ్ చేయడం, బెదిరించడం.. కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. అయినా బీజేపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు. త్యాగాలు, జైళ్లు మాకు కొత్త కాదు.

• కేసీఆర్ బెంగాల్ తరహా పాలనను తెలంగాణలో కొనసాగిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను జైళ్లకు పంపుతున్నారు. అయినా భయపడబోం. తెలంగాణలో రామరాజ్యం రాబోతోంది. నీ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరలదాకా తరిమితరిమి కొడతాం.

• బీఆర్ఎస్ కార్యకర్తలారా, నాయకులారా… తెలంగాణలో ఏం జరుగుతోంది? కేసీఆర్ బిడ్డను కాపాడుకోవడానికి కేబినెట్ మొత్తాన్ని ఢిల్లీకి పంపుతారా? పేపర్ లీకేజీలో కేసీఆర్ కొడుకును కాపాడేందుకు ప్రయత్నిస్తారా? 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల కంటే కేసీఆర్ కు కొడుకు, బిడ్డ, అల్లుడే ముఖ్యమా?

• 30 లక్షల మంది నిరుద్యోగులారా… రండి. మీకోసం పోరాడుతున్నాం. కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా పోరాడదాం. కేసీఆర్ కొడుకును మెడలు పట్టి బయటకు గుంజిపారేయాలి.

• బీజేపీ ఏ మతానికి కొమ్ము కాయదు. 1994లో ఇండియా గెలిస్తే ములుగులో భజరంగ్ కార్యకర్తలు జై భారత్ అంటూ ఉత్సవాలు జరుపుకుంటుంటే మత ఛాందసవాదులు, లుచ్చా నా కొడుకులు దాడి చేశారు.. ఆనాడు వాళ్లపై గర్జించిన యోధులు నా కార్యకర్తలు..

• ఇండియా గెలిస్తే సంబురాలు చేసేవాళ్లు కావాలా? పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకునే వాళ్లకు మద్దతిచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా? ఆలోచించండి.

• హిందూ సమాజాన్ని ఓటు బ్యాంకుగా మార్చడానికి బీజేపీ పనిచేస్తోంది. 15 నిమిషాలు టైమిస్తే మనందరినీ నరికి చంపుతామని హెచ్చరించిన వాళ్లను ఇంకా భరిద్దామా? ఉరికించి ఉరికించి కొడతాం…నిన్నగాక మొన్న శ్రీరామ నవమినాడు ఇద్దరు కార్యకర్తలపై దాడి చేశారు. వాళ్ల సంగతి చూస్తాం.

• పాతబస్తీలో మీటింగ్ పెడితే నా పర్మిషన్ తీసుకోవాలని ఓవైసీ సవాల్ విసిరితే కేసీఆర్ అన్నీ మూసుకుని ప్రగతి భవన్ కే పరిమితమైతే…. సవాల్ ను స్వీకరించి డేట్ టైమ్ ఫిక్స్ చేసి పాతబస్తీ పోయి గర్జించినం. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే పాతబస్తీలోని గల్లీగల్లీలో సభలు పెడతానని హెచ్చరించి వెళ్లిన.

• మా కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే, హిందూ మతానికి ప్రమాదం వాటిల్లితే పర్మిషన్ తీసుకుని వెళ్లే పిరికి పందలం కాదు.. పచ్చ జెండాలున్న చోట కాషాయ జెండా ఎగరేస్తాం.

• ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాసే ఓవైసీ పాతబస్తీని కొత్త బస్తీగా ఎందుకు తీర్చిదిద్దడం లేదు? పాతబస్తీకి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు? పరిశ్రమలు రావడం లేదు. మురికి కూపంగా ఎందుకుంది?

• బీజేపీ ఇచ్చిన మాట తప్పదు. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నం. 370 ఆర్టికల్ ను రద్దు చేసినం. ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసినం.

• 80 శాతం హిందువులున్న ప్రజాస్వామ్య దేశంలో హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడి జన్మస్థలంలో రామ మందిరం కూడా నిర్మించుకోలేని చేతగాని స్థితిలో భారత్ ఉందని విదేశీయులు హేళన చేస్తుంటే ఊరుకుందామా? అందుకే అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించేందుకు కరసేవ చేపట్టినం. నేను కూడా వెళ్లిన. కరసేవలో పాల్గొనే అద్రుష్టం నాకు దక్కింది. రామ మందిరం నిర్మించడానికి కూడా హిందువులు ప్రాణ త్యాగం చేయాల్సిన దుస్థితి వచ్చిందా? అని ప్రపంచమంతా నివ్వెరపోయింది.

• ఈ త్యాగాలను వ్రుధా పోనీయకూడదనే సంకల్పంతో హిందువుల చిరకాల స్వప్నమైన రామ మందిరాన్ని నిర్మిస్తున్న మహానేత నరేంద్రమోదీ. హిందూ సమాజం జాగ్రుతమైంది. వీళ్ల శక్తి చాలా గొప్పదని ప్రపంచమే గుర్తిస్తోంది.

• గడ్డి కూడా మొలవని కాశ్మీర్ ఉంటే ఏంది? పోతే ఏందని జవహార్ లాల్ నెహ్రూ పార్లమెంట్ లో ప్రశ్నిస్తే…. వెంటనే పటేల్ లేచి వెంట్రుకలు కూడా మొలవని నీ గుండు ఉంటే ఎంత పోతే ఎంత అని ప్రశ్నించిన నాయకుడు సర్దార్ వల్లభాయి పటేల్. ఆయన స్పూర్తితో మోదీ 370 ఆర్దికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో అంతర్బాగం చేశారు.

• ఒక్క బీజేపీ మాత్రమే కాశ్మీర్ కోసం, రామ మందిరం కోసం, దేశ రక్షణ కోసం ఎందుకు ప్రాణ త్యాగాలు చేయాలి? కార్యకర్తలు లాఠీ దెబ్బలు ఎందుకు తినాలి? బీజేపీ కార్యకర్తలు మాత్రమే భారత్ మాతాకీ జై, జై శ్రీరాం, వందేమాతరం ఆలపిస్తారు.

• తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నయ్. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాళ్లే చెబుతున్నరు. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి వీళ్ళంతా ఒక్కటైతున్నరు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వమే బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమైంది. ఎందుకంటే కాంగ్రెస్ నుండి గెలిచినవాళ్లంతా కేసీఆర్ ఇచ్చే పైసలకు ఆశపడి బీఆర్ఎస్ లోకి పోతున్నరు.

• బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. సింహం సింగిల్ గానే పోటీ చేస్తుంది. అధికారంలోకి వచ్చి తీరుతుంది. ములుగులో బీజేపీ కార్యకర్త ఎమ్మెల్యేతో సమానం. శక్తి కేంద్ర ఇంఛార్జ్ మంత్రితో సమానం. అన్ని పార్టీలకు అవకాశమిచ్చారు. ఈసారి బీజేపీకి అవకాశమివ్వాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా.

• కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోంది. ప్రపంచంలోనే శక్తివంతమైన పార్టీ బీజేపీ అని, మోదీని ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని అమెరికాలోని వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పింది.

• తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. రైతు బంధు ఇచ్చి సబ్సిడీలన్నీ బంద్ చేశారు. ఫ్రీ యూరియా, రుణమాఫీ హామీలు అమలు చేయలేదు. యూరియా, డీఏపీసహా ఎరువులన్నీ సబ్సిడీపై ఇస్తున్న ఘనత కేంద్రానిదే.

• రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ వస్తే చూపించాలని సవాల్ చేస్తున్నా. అయినా సిగ్గు లేకుండా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పడం సిగ్గు చేటు.

• సాధారణ రోజుల్లో డ్రంకన్ డ్రైవ్ చేసి ప్రజల జేబులు గుల్ల చేస్తున్న పోలీసులు రంజాన్ సమయంలో పాతబస్తీలో ఎందుకు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించడం లేదో చెప్పాలి? చట్టాలేమైపోయాయి? వాళ్లకో న్యాయం? ఇతరులకో న్యాయమా?

సునీల్ బన్సల్ మాట్లాడుతూ…

• బీజేపీ అంటేనే కార్యకర్తల పార్టీ. పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్న పార్టీ. ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు, అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో అభివ్రుద్ధి ఎందుకు జరగడం లేదో ఆలోచించండి.
• ఒకే కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యింది. కుటుంబ పాలన కొనసాగుతోంది. గతంలో బీహార్, బెంగాల్ తో తో పోలిస్తే అవినీతి 10 రేట్లు పెరిగింది.
• యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతిరహిత పాలన కొనసాగుతోంది. సుపరిపాలన అందుతోంది. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిరహిత, సుపరిపాలన సాధ్యం. బీజేపీ కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. తెలంగాణలో బీజేపీ గెలిస్తే తెలంగాణ అమరవీరుల కలలను సాకారమవుతాయి. స్తానికంగా ఉన్న రెహాన్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు బీజేపీ పోరాడుతుంది.

గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ…

• నా తమ్ముడు ఇప్పుడు లేరు. కానీ నా తమ్ముడి లేనిలోటును బండి సంజయ్ లో చూస్తున్నా. సంజయ్ శ్రమ, పట్టుదల, తపన చూస్తూ మురిసిపోతున్నా.
• ఈ సమ్మేళనం సాక్షిగా చెబుతున్నా…ములుగు అసెంబ్లీ సీటును బీజేపీ గెలిచి బన్సల్, సంజయ్ లకు గిఫ్ట్ ఇవ్వబోతున్నా.
• ములుగు బాగా వెనుకబడిన జిల్లా. ఉన్న పరిశ్రమను మూసేశారు. కొత్త పరిశ్రమల్లేవు. ఇక్కడ పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ…

• ములుగు ఈరోజు కాషాయమయమైంది. ములుగులో బీజేపీ లేదని అన్నోళ్లకు ఈరోజు జరుగుతున్న సమ్మేళనం, ర్యాలీయే సమాధానం చెబుతుంది. ములుగులో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం.
• బీఆర్ఎస్ దేశంలో అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొని తెరిపిస్తాడట. సిగ్గుండాలే. ములుగులో మూతపడ్డ రేయాన్ ఫ్యాక్టరీని తెరిపించలేనోడు… విశాఖ ఉక్కు సంస్థను తెరిపిస్తాడా? కూట్లో రాయి తీయలేనోడు… ఏట్లో రాయిని తీయగలడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X