Hyderabad:
BREAKING
4వ రోజు దిగ్విజయంగా ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర. ఈరోజు మొత్తం 11.1 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర. ఇవాళ నిర్మల్ జిల్లా కుంటాల మండలం లోని అంబకంటి గ్రామ శివార్లో బండి సంజయ్ రాత్రి బస.
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అంబకంటి గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. అంబకంటి గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన బిజెపి శ్రేణులు. బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ… పాదయాత్రలో నడుస్తున్న వేలాదిగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు. ప్రజలకు అభివాదం చేస్తూ.. పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్.
4వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర.” నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం, లింబ గ్రామం సమీపంలోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభం ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. లింబ గ్రామం నుంచి సేవాలాల్ తండా, ఓల, కుంటాల మీదుగా అంబకంటి వరకు సాగనున్న పాదయాత్ర. నేడు మొత్తం 11.1 కిలోమీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర. ఈరోజు అంబకంటి సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేస్తారు.
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం, లింబ గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర,. లింబ గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు. బండి సంజయ్ కి బొట్టు పెట్టి, హారతులు పట్టి స్వాగతం పలికిన ఆడపడుచులు. ప్రజలకు అభివాదం చేస్తూ… పాదయాత్రలో నడుస్తున్న బండి సంజయ్. నిర్మల్ జిల్లా కుంటాల మండలం, లింబ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన బండి సంజయ్ కాసేపు విద్యార్థులతో ముచ్చటించిన బండి సంజయ్. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్. బండి సంజయ్ దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకొచ్చిన పాఠశాల ఉపాధ్యాయులు చిన్నారి విద్యార్థులను మీరేమీ అవుదాం అనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్న బండి సంజయ్. నేను కలెక్టర్ ను, నేను డాక్టర్ ను అవుతానని చెప్పిన చిన్నారులు. చిన్నారుల సమాధానం విని సంతోషం వ్యక్తం చేసిన బండి సంజయ్. పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను పరిశీలించిన బండి సంజయ్. ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీసిన బండి సంజయ్. ప్రైవేటు స్కూల్లకు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో… కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డ బండి సంజయ్. శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త బిల్డింగ్ లను కట్టడంలోనూ కేసీఆర్ సర్కార్ విఫలం అంటూ బండి ఫైర్. బిజెపి ప్రభుత్వం వచ్చాక, పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని బండి సంజయ్ హామీ. ‘సిపిఎస్’ రద్దు కి సంబంధించి బండి సంజయ్ కి వినతి పత్రం అందించిన పాఠశాల ఉపాధ్యాయులు.
నిర్మల్ జిల్లా కుంటాల మండలం, లింబ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన బండి సంజయ్. కాసేపు విద్యార్థులతో ముచ్చటించిన బండి సంజయ్. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్. బండి సంజయ్ దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకొచ్చిన పాఠశాల ఉపాధ్యాయులు. చిన్నారి విద్యార్థులను మీరేమీ అవుదాం అనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్న బండి సంజయ్. నేను కలెక్టర్ ను, నేను డాక్టర్ ను అవుతానని చెప్పిన చిన్నారులు. చిన్నారుల సమాధానం విని సంతోషం వ్యక్తం చేసిన బండి సంజయ్. పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను పరిశీలించిన బండి సంజయ్. ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీసిన బండి సంజయ్. ప్రైవేటు స్కూల్లకు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో… కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డ బండి సంజయ్. శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త బిల్డింగ్ లను కట్టడంలోనూ కేసీఆర్ సర్కార్ విఫలం అంటూ బండి ఫైర్. బిజెపి ప్రభుత్వం వచ్చాక, పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని బండి సంజయ్ హామీ ‘సిపిఎస్’ రద్దు కి సంబంధించి బండి సంజయ్ కి వినతి పత్రం అందించిన పాఠశాల ఉపాధ్యాయులు.
లింబ (బి) గ్రామంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించిన బండి సంజయ్. అనంతరం లింబ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్.
బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యంశాలు:
బైంసా లో బహిరంగ సభను విజయవంతం చేసుకున్నాం. ఆ సభకు ప్రజలు ఏ సంఖ్యలో తరలివచ్చారో మీరు చూశారు. కాలాలకతీతంగా సంవత్సరకాలంగా పాదయాత్ర చేస్తున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేదోళ్ల రాజ్యం కోసమే. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ వాళ్లు బయటికి వస్తారు లింబ(బి) గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చాయి? కేసీఆర్ సర్కార్ ముంపు గ్రామ ప్రజలను ఆదుకున్న పాపాన పోలేదు. వాళ్లకు కొద్దోగొప్పో కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పట్టుకుంటే పడిపోయేటట్టు ఉన్నాయి. సొంత జాగా ఉన్న వాళ్లకి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చి… ఇప్పుడు మూడు లక్షల రూపాయలంటూ మాట తప్పిండు కేసీఆర్. అబద్ధం ఆడే వాడే కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
కేసీఆర్ అంటే… ఖాసీం చంద్రశేఖర్ రజ్వి. తెలంగాణలో రజాకారుల పాలనను కేసీఆర్ చూపిస్తున్నాడు. ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ… జైళ్ళలో పెట్టిస్తున్నాడు. తాగుడు పండుడు తప్ప, కేసీఆర్ చేసేది ఏమీ లేదు. బిజెపి కార్యకర్తలు పెట్టే టెన్షన్ కు… ప్రస్తుతం కెసిఆర్ ఫుల్ బాటిల్ ఎత్తుతుండు. ఈ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయా? నీళ్లు ఇవ్వలేదు… రోడ్లు వేయలేదు… డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు… ఉద్యోగాలు లేవు. ఏక్ నిరంజన్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. 79 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడా? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు. రాష్ట్రాన్ని అప్పులకుప్పజేసి, ప్రజలకు చిప్ప చేతికిచ్చిండు. పుట్టబోయే బిడ్డ నెత్తిపై కూడా లక్ష రూపాయలు అప్పు పెట్టిండు.
కెసిఆర్ పాలనలో పెళ్లి చేసుకుందామన్న భయపడే పరిస్థితిలు ఉన్నాయి. తెలంగాణలో పేదల ప్రభుత్వం ఏర్పడితేనే… మీకు న్యాయం జరుగుతుంది. ఓబీసీ ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం.. నిన్న బాసర త్రిబుల్ ఐటీలో 80 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థులను పొమ్మనలేక పొగ పెడుతున్నారు.అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కేసీఆర్ బంధువే. పాయిజన్ అయిన విద్యార్థులను కనీసం హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లనీయడం లేదు. అక్కడ నిర్బంధం విధించి, విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నాడు అన్ని స్కామ్లలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారిమల్లిస్తున్నాడు. మోడీ ఆదేశాలతోనే నేను పాదయాత్ర చేస్తున్నప్రజల కోసమే నా పాదయాత్ర లోన్లు కట్టని కేసీఆర్ కు, నేడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? పెద్దోడి రాజ్యం పోవాలి… పేదోళ్ల రాజ్యం రావాలి. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. తెలంగాణలో అభివృద్ధి చేసి చూపిస్తాం.
నిర్మల్ జిల్లాలోని మండలాధ్యక్షులు ఆపై స్థాయి నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్.
నిర్మల్ జిల్లా కుంటాల మండలం లోని ఓల గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. ఓల గ్రామంలో బండి సంజయ్ కి ఘనస్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు. బండి సంజయ్ కి ఎదురేగి స్వాగతం పలికిన ఓల గ్రామం రైతన్నలు రైతన్నలు తీసుకొచ్చిన ఎడ్ల బండి నెక్కి, కాసేపు నడిపిన బండి సంజయ్. అనంతరం పాదయాత్రగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న బండి సంజయ్.
నిర్మల్ జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. కుంటాల మండలంలోని ఓల గ్రామంలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర. పాదయాత్రలో భాగంగా… ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ… వారికి భరోసా కల్పిస్తూ… ముందుకు సాగుతున్న బండి సంజయ్. బండి సంజయ్ పై అడుగడుగునా పూల వర్షం కురిపించి, తమ అభిమానాన్ని చాటుకుంటున్న ఓల గ్రామ ప్రజలు. హారుతులతో స్వాగతం పలికి, తమ అభిమానాన్ని చాటుకుంటున్న ఆడపడుచులు.
కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందా చేసేటోళ్ల అంతు చూస్తాం
బెంగూళురు డ్రగ్స్ స్కాం కేసును మూయించింది కేసీఆరే
ఆ కేసును మళ్లీ తిరగదోడాలి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే
కేసీఆర్ పైనున్న పాత కేసులన్నీ తిరగదోడాల్సిందే
ప్రజల సొమ్మను దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పులపాల్జేస్తున్న కేసీఆర్
ట్విట్టర్ టిల్లు…. మిషన్ భగీరథ నీళ్లేవి ?
డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, రుణమాఫీ, దళిత బంధు హామీలేమైనయ్?
రోడ్లు, నీళ్లు, కనీస సౌకర్యాల్లేక అధ్వాన్నంగా మారిన రాష్ట్రం
హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ ను నిలదీయండి
గ్రామాల అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే
ఒక్క ఓలా గ్రామానికే 3.89 కోట్లకు పైగా నిధులిచ్చిన కేంద్రం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
ప్రజల సొమ్మును దోచుకుంటూ వేల కోట్లు దండుకుని లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందాల్లో కేసీఆర్ కుటుంబం పెట్టుబడులు పెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. రాష్ట్రాన్న దివాళా తీయించిన కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని, మేనేజ్ చేసి ఆ కేసును మూసివేయించారని అన్నారు. వెంటనే ఆ కేసును మళ్లీ ఓపెన్ చేసి దోషులతోపాటు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం దొంగ దందాలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ సాకు చూపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు నిర్మల్ జిల్లాలోని ఓలా గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అందులోని ముఖ్యాంశాలు…..
• సంవత్సర కాలంగా మీకోసమే పాదయాత్ర చేస్తున్న. ప్రజల దగ్గరకు వెళ్లాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని మోడీ ఆదేశిస్తేనే.. మీ దగ్గరికి వచ్చాను. ఎక్కడికి వెళ్లినా… సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పేదోడు ప్రధాని అయిన తర్వాతే… ఈ దేశంలో ప్రజలకు న్యాయం జరిగింది.
• మహిళలను దృష్టిలో పెట్టుకుని, స్వచ్ఛభారత్ కింద ఫ్రీగా బాత్రూములు కట్టించింది మోడీ ప్రభుత్వం. ‘ఉజ్వల యోజన’ కింద పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత మోదీదే. ఉచిత బియ్యం ఇస్తున్నది మోదీనే. తెలంగాణకు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద 2,40,000 ఇండ్లను మోడీ మంజూరు చేశారు.
• డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 4 వేల కోట్ల రూపాయలను మోడీ ఇస్తే కెసిఆర్ చేస్తున్నది ఏమిటి? మహారాష్ట్రలో సంవత్సరంలోపు ఇండ్లు కట్టించి, దసరా ఒక్కరోజే… లక్ష మందికి ఇండ్ల పంపిణీ చేశారు. నెల వ్యవధిలో 1,46 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మోదీ ఇచ్చాడు.
• కెసిఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్. ధాన్యం సేకరణ విషయంలో రైతుల దగ్గర నుంచి బ్రోకర్రిజం చేస్తున్న కెసిఆర్ కు పైసలు ఇస్తున్నది మోదీనే. ధాన్యం కొనడానికి కేసీఆర్ ముందుకు రావడం లేదు. వరి వేస్తే ఉరే అన్నడు. దొడ్డు వడ్లు, సన్న వడ్లు అంటూ… రైతులను ఆగం చేసిండు. ఎరువులపై సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమే…ఎకరంపై సుమారు రూ.30 వేలు సబ్సిడీ రూపంలో ఇస్తున్నాడు.
• రైతు బంధు అని, మిగిలిన అన్నిటిని కేసీఆర్ బంద్ చేసిండు.కెసిఆర్ ఇప్పటివరకు రుణమాఫీ కూడా అమలు చేయలేదు. 300 ఎకరాల్లో పంటలు వేసుకుంటూ కేసీఆర్ ఏమో కోటీశ్వరుడు అవుతాడు. రైతులను మాత్రం బికారీలను చేస్తాడు.
• ఈ గ్రామానికి వివిధ పథకాల కింద 3,89,16,570 రూపాయల నిధులు కేంద్రం మంజూరు చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా భారీ ఎత్తున ఇచ్చాం. కేంద్రం ఇస్తున్న నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది అసలు ఈ ఓల గ్రామానికి కేసీఆర్ చేసింది ఏమిటి? ఇక్కడ ఉన్న కెనాల్ ను కూడా ఇప్పటివరకు కేసీఆర్ పూర్తి చేయలేదు.
• ట్విట్టర్ టిల్లు మిషన్ భగీరథ నీళ్లపై అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఇక్కడ నీళ్లు లేవు, ఇండ్లు లేవు… రోడ్లు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. పెన్షన్లు ఇవ్వడం లేదు. తెలంగాణను 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా చేసిండు. పుట్టబోయే బిడ్డ నెత్తి పైన లక్ష రూపాయల అప్పు పెట్టిండు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్…. ఇప్పటివరకు ఎందుకు పరిష్కరించ లేదు? దళిత బందు, దళితులకు మూడెకరాల భూమి, 2bhk హామీ ఏమైంది?
• ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో కవిత ప్రమేయమున్నది. కెసిఆర్ కుటుంబం వ్యాపారాలు చేయడానికి మాత్రం పైసలు ఉన్నాయి.. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం పైసలు లేవు. క్యాసినో(పత్తాలు)లో కూడా పెట్టుబడులు పెట్టిండ్రు. ఒక ఆడ ఆమె మద్యం లో పెట్టుబడులు పెడతారా?. తెలంగాణలో పేదోళ్ళు బికారీలు అవుతున్నారు.
• కెసిఆర్ కుటుంబం, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం వేలకోట్లకు ఎదుగుతారు. వేలకోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఓట్ల కోసము రాలేదు. ట్విట్టర్ టిల్లు వచ్చి, ఇక్కడ ఏం పీకుతాడో చూద్దాం.
• లిక్కర్ దందా చేసే వాళ్లను విడిచిపెడదామా? డ్రగ్స్ ను చిన్నపిల్లలకు అలవాటు చేస్తున్న వాళ్లని విడిచిపెడదామా? పత్తాల ఆటలో పెట్టుబడులు పెట్టిన వాళ్లను విడిచిపెడదామా?. కర్ణాటక, బెంగళూరులో డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న 5 గురు పైన చర్యలు తీసుకోవాలి. అక్కడ పోలీసులతో కలిసి, కేసీఆర్ ఆ కేసును నీరుగార్చారు. కర్ణాటక లో మా ప్రభుత్వం ఉన్నా… ఇక ఏమున్నా కూడా… ఆ కేసును, అందులో ఉన్న వ్యక్తులను బయటికి తెస్తాం. కేసీఆర్ డ్రగ్స్ కేసును కూడా బయటకు తీస్తాం. ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణలో పేదల ప్రభుత్వం రావాలి. మీకోసం పోరాటం చేస్తున్న. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి
అంతకుముందు గ్రామస్తులు తమ బాధను ఏకరవు పెట్టారు…. అవేమిటంటే…….
బండి సంజయ్ ఎదుట తమ సమస్యలను ఏకరవు పెట్టిన ఓల గ్రామస్తులు…
‘మాకు ఫసల్ బీమా యోజన’ రావడం లేదు – రొడ్డే విఠల్, సూర్యాపురం గ్రామం
2bhk, 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదు – రొడ్డే విఠల్, సూర్యాపురం గ్రామం
మా గ్రామానికి రోడ్డు లేదు… మిషన్ భగీరథనో… భగవద్గీతనో నాకు తెలీదు కానీ, మాకు మాత్రం నీళ్లు రావడం లేదు – ఓ లంబాడీ వృద్ధుడు, అంబుగామ్ గ్రామస్తుడు
100 ఎకరాల పోడు భూమి సమస్య ఉంది – గణేష్, చుట్టుపక్కల గ్రామస్తుడు
ఫారెస్ట్ అధికారులు మా భూమిని స్వాధీనం చేసుకున్నారు – గణేష్, ఓ గ్రామస్తుడు
మా భూమిని మాకు ఇప్పించగలరని విజ్ఞప్తి చేస్తున్నా – గణేష్, ఓ గ్రామస్తుడు
పది సంవత్సరాల నుంచి మాకు కనీసం రోడ్డు కూడా వేయని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొంది – ఓ గ్రామస్తుడి ఆవేదన
ఏ కరప్షను చేయనిది ఒక్క రైతు మాత్రమే – ఓ యువరైతు
ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు – ఓ యువరైతు
అసలు రుణమాఫీ చేయమని అడిగింది ఎవరు? ఈ కరప్షన్ ఎందుకు చేస్తున్నారు? – ఓ యువరైతు
భారత్ ను రక్షిస్తున్న టైగర్ నరేంద్ర మోడీ మాత్రమే – ఓ యువరైతు
కరప్షన్ లేని దేశాన్ని స్థాపించాలన్నదే… ఓ రైతుగా నా కోరిక – ఓ యువరైతు
మాకు దళిత బంధు రాలేదు – ఓ దళిత మహిళ
కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఇప్పటికీ పరిహారం అందలేదు – ఓల గ్రామస్తులు
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం వేసిన బిస్వాల్ కమిటీ చెబితే… ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 30 వేల ఉద్యోగాలు మాత్రమే – నిరుద్యోగ యువత ఆవేదన.
BREAKING
లంచ్ అనంతరం తిరిగి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. కాసేపట్లో నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర. కుంటాల ప్రధాన కూడలి వద్ద, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్.
నిర్మల్ జిల్లా:
కుంటాల మండలంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. కుంటాలలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు. హారతులు పట్టి స్వాగతం పలుకుతున్న ఆడపడుచులు. పాదయాత్రలో భాగంగా… ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ… వారికి భరోసా కల్పిస్తూ… ముందుకు సాగుతున్న బండి సంజయ్. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్న యువత. ఎంతో ఓపికతో… తన అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ… పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్. కాసేపట్లో కుంటాల మండలం ప్రధాన కూడలికి చేరుకోనున్న బండి సంజయ్. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బీజేపీ రథసారధి బండి సంజయ్.
“బిజెపి కార్నర్ మీటింగ్ @ కుంటాల”
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో బండి సంజయ్ ని సన్మానించిన స్థానిక మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు. అనంతరం బండి సంజయ్ సమక్షంలో TRS పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరిక. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు కాషాయ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్.
రమాదేవి, నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు:
టిఆర్ఎస్ పాలనలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే … అది ముథోల్ నియోజక వర్గమే
ఈ ప్రాంతంలో పత్తి అత్యధికంగా పండుతున్నా… ఈ ప్రాంతానికి ఒక చిన్న క్లస్టర్ ని కూడా తీసుకురాలేని ఎమ్మెల్యే ముథోల్ ఎమ్మెల్యే
తలాపున గోదావరి పారుతున్నా… ఇక్కడి ఎత్తిపోతల పథకాలను సక్సెస్ చేయని దద్దమ్మ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
కేసీఆర్ రుణమాఫీ చేసిండా?
ప్రాజెక్టులు మొదలుపెట్టి 20 సంవత్సరాలు అయినా… వాడిని పూర్తి చేయడం లేదు
వికలాంగులకు పెన్షన్ రావడం లేదు
కేసీఆర్ రజాకార్ల వారసులతో దోస్తీ కట్టిండు
‘లవ్ జిహాద్’ పేరుతో హిందువులను ఎలా ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలియదా?
బండి సంజయ్ ని అధికారంలోకి తీసుకురావాలి
ఈరోజు నియోజకవర్గంలో బిజెపి జెండాని ఎగరేయాలి
నరేంద్ర మోడీ నాయకత్వం… బండి సంజయ్ నాయకత్వం… సోయం బాపూరావు నాయకత్వం వర్ధిల్లాలి
సోయం బాపూరావు, ఆదిలాబాద్ ఎంపీ కామెంట్స్:
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు పులులు తిరుగుతున్నాయి
నిర్మల్ జిల్లాలో మన పులి బండి సంజయ్ తిరుగుతున్నాడు
భూములు కబ్జాలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులను వెంటాడడానికి తిరుగుతున్నాడు
టిఆర్ఎస్ నేతల ఆగడాలను ప్రజలకు తెలియజేసేందుకే బండి సంజయ్ తిరుగుతున్నాడు
బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు
చిరుతపులుల్లా మీరంతా టిఆర్ఎస్ నాయకులను వేటాడాలి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేసినోడు కేసీఆర్
రైతు రుణమాఫీ చేస్తా అంటూ… రుణమాఫీ చేయకుండా రైతు సోదరులను మోసం చేశాడు
బిజెపి అధికారంలోకి వచ్చేవరకు మీరంతా నిద్రపోకుండా పనిచేయాలని కోరుతున్నా
BREAKING
బండి సంజయ్, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ కామెంట్స్ @ కుంటాల:
తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో సమాధానం చెప్పాలి. బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు రావడం లేదని అంటున్న టిఆర్ఎస్ నేతలు… బైంసా బహిరంగ సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? టిఆర్ఎస్ నేతల కళ్ళు దొబ్బాయా? గజ్జలమ్మ తల్లి దేవాలయం చాలా శక్తివంతమైంది. గజ్జలమ్మ తల్లి అమ్మవారు చాలా పవర్ఫుల్. గజ్జలమ్మ తల్లి ఆలయం అభివృద్ధి చెందిందా? కేసీఆర్ అభివృద్ధి చేశాడా? ఇక్కడ కేసీఆర్ షాపులు ఎన్ని ఉన్నాయని ప్రజలను అడిగి సమాధానం రాబట్టిన బండి సంజయ్. టిఆర్ఎస్ అంటే బాపు, బేటా బిడ్డకు లిక్కర్ లో వాటా. ఇక టీఆర్ఎస్ కు చెప్పాలి టాటా. కేసీఆర్ సంగతి చూసేందుకే… ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. బిజెపిని చూసి కెసిఆర్ గజగజ వణుకుతున్నాడు.
ఓవైసీ చెంప చెల్లుమనిపించేలా పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభ నిర్వహించి, మనం ఏంటో చూపించాం. టైం, ప్లేస్ చెప్పి మరీ… పాత బస్తి మీ గడ్డ కాదు… మా అడ్డా అని నిరూపించాం. బైంసా కాదు మహిషా… బైంసా కు రాకుండా కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేసినా… మనం వచ్చామా లేదా? కేసీఆర్ పైసలిచ్చినా… టిఆర్ఎస్ బహిరంగ సభలకు ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. చప్పట్లు కొట్టండని అడుక్కును మరీ కొట్టించుకుంటున్నాడు కేసీఆర్. ప్రజల కోసమే ప్రజా సంగ్రామ యాత్ర. మీకు మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయా?
ఈ టైంకి కేసీఆర్ రెండు పెగ్గులు వేసి ఉంటాడు. మీ జోష్ చూస్తే… ఇక ఫుల్ బాటిల్ లేపేస్తాడు. తెల్లందాకా పంటడు… రాత్రంతా ఎవరి కొంపలు ముంచాలా అని కేసీఆర్ ఆలోచిస్తాడు. మీకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయా? తెలంగాణకు రెండు లక్షల 40 వేల ఇండ్లను మోదీ మంజూరు చేశారు. ఇండ్ల కోసం 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేస్తే… వాటిని కేసీఆర్ ఏం చేశాడు? పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్. మహారాష్ట్రలో ఒక్క రోజే లక్ష ఇండ్లు ఇచ్చి, గృహప్రవేశం చేయించిన ఘనత బిజెపి ది అన్ని స్కామ్లలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే. తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. పుట్టబోయే బిడ్డ పైన లక్ష రూపాయల అప్పు పెట్టిండు. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం పైసలు లేవు… కోట్ల రూపాయలు దండుకోవడానికి మాత్రం పైసలు ఉంటాయి. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్… తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. నిరుద్యోగులను నిండా ముంచిండు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం 1,46 వేల ఉద్యోగాలను ఇచ్చింది. రుణమాఫీ అమలు చేయలేదు. రైతులను మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్. రైతులు ఎవరు సుఖసంతోషాలతో జీవించే పరిస్థితి తెలంగాణలో లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాకే.. పంటలకు కనీస మద్దతు ధర పెరిగింది. రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది మోదీ ప్రభుత్వమే ఒక్క ఎకరానికి 30 వేల రూపాయల సబ్సిడీని అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే రైతుబంధు అని చెప్పి, మిగిలినవి అన్ని రైతులకు బందు చేసిండు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ సహకరించడం లేదు.
కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించి, రాష్ట్రాన్ని కాపాడాలని మోదీ మాతో చెప్పిండు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ స్కామ్ లో ఇరికింది. కేసీఆర్ బిడ్డ జైలుకు వెళ్లాలా…? వద్దా..? లోన్లు కట్టలేని పరిస్థితిలో ఉన్న కేసీఆర్… ఈరోజు లక్షల కోట్లకు ఎలా ఎదిగాడు? వేలకోట్ల తెలంగాణ సంపదను దోచుకున్నారు. లిక్కర్, పత్తాలు ఇలా అన్నీ కేసులలో ఉన్నది వాళ్లే. వడ్ల కుప్పల మీద రైతులు చనిపోతున్నారు. పంట నష్టపోయిన ఏ రైతును కేసీఆర్ ఆదుకోలేదు. పంజాబ్ రైతులకు మాత్రం 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశాడు. తెలంగాణ రైతులను మాత్రం ఆదుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఢిల్లీలో దొంగ దీక్ష చేసిండు కేసీఆర్… బాత్రూంలోకి వెళ్లి మందు తాగినోడు కేసీఆర్.
ఖమ్మం హాస్పటల్లో కేసీఆర్ దీక్ష చేయలేదు… మందు మాత్రమే తాగాడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగం ఏంటి? పేదోళ్ల ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ ఏర్పడింది. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతోనే తెలంగాణ వచ్చింది. పోలీస్ కిష్టయ్య పేదోడు… తెలంగాణ కోసమే పోలీస్ కిష్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. జై తెలంగాణ అంటూ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సుమన్ పేదోడు. 1200 మంది ఆత్మబలి దానాలతోనే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికే పోతున్నాయి. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ ఇదేనా? బంగారు తెలంగాణ సాధించడానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి పైసా మోడీ ఇస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా… మోదీ ఇస్తున్న నిధులతోనే కిలో బియ్యానికి 29 రూపాయలు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి తిట్టి తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ మాటలతో ప్రజలెవరు మోసపోవద్దు. ఈ ప్రాంతానికి వివిధ పథకాల కింద, భారీ ఎత్తున నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కేసీఆర్ పాలనలో సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మేం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నాం. హిందూ సమాజం సంఘటితం కోసం పనిచేస్తున్నాం.
హిందూ దేవుళ్లను కాపాడుకోవడానికి పనిచేస్తున్నాం. ఓవైసీ హిందువులను తిడితే… భరిద్దామా? అన్నిటిలో దైవాన్ని కొలుస్తాం హిందూ ధర్మం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కులాలు, వర్ణాలు, వర్గాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో రామరాజ్యాన్ని స్థాపించి తీరుతాం. ఉచిత విద్య, వైద్యం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావాలంటే బిజెపికి ఒకసారి అవకాశం ఇవ్వండి. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం.