-ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తారా?
-స్వచ్ఛందంగా బంద్ పాటిస్తే కేసులు పెడతారా?
-తక్షణమే వదిలేస్తారా? లేదా?
-లేనిపక్షంలో రేపు ధర్మపురి నేనే వస్తా
-జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
-ప్రభుత్వానికి బండి సంజయ్ కుమార్ హెచ్చరిక
హైదరాబాద్: బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో నిన్న(29.06.2023) పట్టపగలే అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్ పై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గం. పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయం.
• గోమాతను వధించడాన్ని నిరసిస్తూ ధర్మపురి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం హర్షణీయం. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం సహించరాని విషయం.
• గోమాతను వధించడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ చట్టాన్ని అమలు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం. తాను నిఖార్సైన హిందువునని పదేపదే చెప్పుకునే కేసీఆర్ ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదు.
• తక్షణమే అమాయకులపై పెట్టిన నాన్ బెయిలెబుల్ కేసులను ఉపసంహరించుకోవాలి. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో రేపు నేనే స్వయంగా ధర్మపురి రావడానికి సిద్ధంగా ఉన్నా. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నా.