“బైంసాకు వెళ్లలంటే వీసా తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలా? బైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా?”

Hydeabad: “ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకున్నాం. పూజలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. నిన్న పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొదటి సభ నిర్వహించుకోవాలని అనుమతిచ్చి… ఆ తరువాత కుంటి సాకులతో అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు.” బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం కరీంనగర్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

బండి సంజయ్ మాట్లాడుతూ…”ఇప్పటి వరకు 4 విడతలుగా ప్రజాసంగ్రామ యాత్ర జరిగింది. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా పాదయాత్రను కొనసాగించాం. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో ఒక సాకుతో పాదయాత్రను అడ్డకునేందుకు యత్నించింది. అందుకే హైకోర్టుకు వెళ్లాం. హైకోర్టు ఉత్తర్వులపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తాం. అందులో భాగంగా ఈరోజే నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళుతున్నా. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహిస్తాం. అక్కడినుండే లాంఛనంగా పాదయాత్రను ప్రారంభిస్తాం.

బైంసాను బండి సంజయ్ ను దూరం చేశారేమో… కానీ బైంసా ప్రజల నుండి బండి సంజయ్ ను దూరం చేయలేరు. ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుండి బైంసా ప్రజలను వేరు చేయలేరు? బైంసాకు అసలు ఎందుకు వెళ్లకూడదు? బైంసాకు వెళ్లలంటే వీసా తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలా? బైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా? అసలు బైంసాలో అల్లర్లు స్రుష్టించింది ఎవరు? బైంసా అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకున్నదెవరు? బైంసాలో అమయాకుల ఉసురు తీసిందెవరు? కేసులు పెట్టి, పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిందెవరు? మేం బైంసాలో పాదయాత్ర చేస్తే ఇవన్నీ బయటకొస్తాయనే భయంతోనే బైంసాకు వెళ్లకుండా ప్రభుత్వం కుట్ర చేసింది.

Repleted News:

పాతబస్తీలో పాదయాత్రను ప్రారంభించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద నుండి పాదయాత్ర చేస్తే అల్లర్లు జరిగాయా? ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు కొమ్ముకాస్తోంది. మజ్లిస్ నేతలు చెప్పినట్లు నడుస్తోంది. కేసీఆర్ ఫ్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు. పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకుంటాం. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటాం. వారికి భరోసా కల్పిస్తాం.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X