Women’s Day Celebrations: “కేసీఆర్ బిడ్డ దొంగ దందాలతో ప్రజలకేం సంబంధం?”

కవిత దొంగ దందా సొమ్ముతో రుణమాఫీ చేస్తున్నారా?? జీతాలిస్తున్నారా? నిరుద్యోగ భ్రుతి ఇస్తున్నారా?

తలంచని తెలంగాణ కేసీఆర్ బిడ్డ దొంగ దందాతో దేశం ముందు తలదించుకునే పరిస్థితి కల్పించారు

దొంగ, లంగ దందాలు చేసేవాళ్లను వదలిపెట్టే ప్రసక్తే లేదు

లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కాబోతోంది

డిస్కోలు, రికార్డింగ్ డ్యాన్స్ లతో బతుకమ్మకే గౌరవం లేకుండా చేసిన కవిత

ఇగ కేసీఆర్ పాలనలో సామాన్య మహిళలకు గౌరవమొక్కడిది?

మోదీ పాలనకు-కేసీఆర్ పాలనకు ఉన్న తేడాను బేరీజు వేయండి

మహిళలు తలెత్తుకునేలా చేస్తున్న పాలన మోదీదే

మహిళలు తలదించుకునేలా కేసీఆర్ పాలన

మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ కుమార్ ఫైర్…

వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలలకు బండి సంజయ్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

‘‘కేసీఆర్ బిడ్డ దొంగ దందాలతో ప్రజలకేం సంబంధం? కవిత దొంగ దందా ప్రజల కోసం చేస్తున్నారా? ఆ సొమ్ముతో రుణమాఫీ చేస్తున్నారా?? జీతాలిస్తున్నారా? నిరుద్యోగ భ్రుతి ఇస్తున్నారా?’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఏనాడూ తలవంచని తెలంగాణ కేసీఆర్ బిడ్డ చేస్తున్న దొంగ, లంగ దందాలతో దేశం ముంద తలవంచే పరిస్థితి నెలకొందని అన్నారు. లిక్కర్ స్కాంతో బీఆర్ఎస్ వికెట్ క్లీన్ బౌల్డ్ కాబోతోందని చెప్పిన బండి సంజయ్ లిక్కర్ స్కాం దోషులెవరినీ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ తోపాటు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కార్యదర్శి జయశ్రీ, జాతీయ మహిళా మోర్చా నాయకులు నళిని, కరుణాగోపాల్, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• మహిళల గురించి ఆలోచించి, గౌరవించి, ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించే పార్టీ బీజేపీ. మహిళలు శక్తి స్వరూపులు… దేవతలుగా కొలిచే సంస్క్రుతి మనది.

• మహిళలు ఇంకా వంట గదికే పరిమితం కావాలనుకోవద్దు. అయినప్పటికీ వంటకే పరిమితమైన వాళ్లెందురో ఒకవైపు కుటుంబాన్ని పోషిస్తూనే… మరోవైపు ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు. వంటలు చేసే యాదమ్మ మోదీగారికే వండి పెట్టింది. గంగమ్మ వంటి వాళ్లు ఈరోజు టీవీల్లో యువతతో పోటీ పడుతున్నారు.

• తెలంగాణలో మహిళలకు అడుగడుగునా అవమానాలే. ప్రీతి హత్య జరిగితే కేసీఆర్ కొడుకుకు పరామర్శించే టైం లేదు. కానీ సానియా మీర్జా వద్దకు మాత్రం వెళతాడు..

• నరేంద్రమోదీ మహిళల గొప్పతనాన్ని అమెరికాలో చెప్పారు. బిడ్డలను పెంచేందుకు తనతల్లి పడ్డ బాధలను చెప్పారు. తన తల్లిలాగా మహిళలెవరూ బాధపడొద్దని ఎన్నో చర్యలు తీసుకున్నారు.

• జల్ జీవన్ మిషన్ కింద 6 కోట్ల మందికి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ప్రధానిగా ఎర్రకోటపై టాయిలెట్ల గురించి మాట్లాడితే ఛాయ్ వాలా ప్రధాని అయితే ఇట్లనే ఉంటుందని ప్రతిపక్షాలు హేళన చేశారు..కానీ స్వచ్ఛ భారత్ కింద 11 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మోదీగారిదే.

• మా అమ్మ పడే బాధలు చూసిన. చాలా కష్టాలు పడేది. నేను కూడా అమ్మ కోసం తోడుగా తవుడు, పేడ తీసుకొచ్చిన. మా అమ్మలాంటి వాళ్ల కట్టెల పొయ్యి కష్టాలు తీర్చాలని 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.

• గతంలో కిరోసిన్ దీపాలతో బిక్కుబిక్కుమంటున్న ఇండ్లకు సౌభాగ్య స్కీం ద్వారా 2.5 కోట్ల మందికి కరెంట్ కనెక్షన్లు ఇచ్చిన గొప్ప నేత మోదీ. నిలువనీడ లేని 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించిన ఘనత మోదీగారిదే. 25 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలు తెరిచి ఆర్దికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నారు. ముద్రలోన్లు ఇస్తున్నరు.

• నరేంద్రమోదీ టైంలోనే కేసీఆర్ సీఎం అయ్యారు.. ఒక్కసారి ఎవరి పాలన బాగుందో బేరీజు వేసుకోండి… కేసీఆర్ తొలి కేబినెట్ లో ఒక్క మహిళ లేరు.. మహిళా కమిషన్ లేదు. ఆ పార్టీలో మహిళా అధ్యక్షురాలు ఉండదు… ఆ పార్టీలో మహిళ అంటే కవిత ఒక్కరే…బతకమ్మ ఆడాలంటే కవితే. బతుకమ్మ పేరుతో డిస్కోలు ఆడించి తెలంగాణ సంస్క్రుతినే దెబ్బతీసిన వ్యక్తి కవిత. కేసీఆర్ పాలనలో బతుకమ్మకే గౌరవం లేకుంటే ఇగ సాధారణ మహిళలకేం గౌరవం ఉంటుంది.

• బీజేపీ సంస్థాగత పదవుల్లో 30 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నాం. అట్లయితేనే జాతీయ నాయకత్వం ఆమోదిస్తుంది. రాష్ట్రపతిగా మహిళను చేశాం. 8 మంది గవర్నర్లను, 4గురు సీఎంలను, 11 మంది కేంద్ర మంత్రులను చేసిన ఘనత బీజేపీదే.

• లిక్కర్ స్కాంలో కవిత వికెట్ అవుట్. బీఆర్ఎస్ వికెట్లన్నీ క్లీన్ బౌల్డ్ కాబోతున్నరు. దొంగ సారా, పత్తాల దందా చేసేటోళ్లను వదిలే ప్రసక్తే లేదు. లిక్కర్ దందా చేస్తూ తెలంగాణ వంచదని అంటోంది… కేసీఆర్ బిడ్డ చేసిన దొంగ దందా వల్ల తెలంగాణ మహిళలు ఇయాళ తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.

• కేసీఆర్ బిడ్డ దొంగ, లంగ దందాలతో ప్రజలకేం సంబంధం? ఆమె దందాలతో సంపాదించే సొమ్ముతో రైతులకు రుణమాఫీ చేస్తుందా? పేదలకు ఇండ్లు కట్టిస్తుందా? నిరుద్యోగ భ్రుతి ఇస్తుందా? ఉద్యోగులకు జీతాలిస్తుందా? ఆమె దందాతో ప్రజలకేం సంబంధం?

• స్వశక్తితో బాగుపడాలని డ్వాక్రా సంఘాలు పనిచేస్తుంటే… వాళ్లను బెదిరించి, భయపెట్టి రాజకీయ సభలకు తీసుకెళుతన్నారు.. మహిళా సమస్యలపై పోరాడటంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తల ఈ విషయంలో చూపుతున్న తెగువ గ్రేట్. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికి ఉద్యమిస్తున్న మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా.

• మహిళలు లేకుంటే స్రుష్టే లేదు..అంతటి గొప్ప స్థానం ఉన్న మహిళలకు తెలంగాణలో భద్రత లేకుండా పోయింది. ఆరేళ్ల పసిపాప నుండి 60 ఏళ్ల ముసలి మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ గూండాలు బరితెగించి హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించడం లేదు.

• ఉత్తరప్రదేశ్ లో నా అంతటోడు లేడని విర్రవీడుతూ మహిళలను అవమానించిన రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ ను మట్టి కరిపించిన పార్టీ బీజేపీదే… మహిళలను అవమానించేవాళ్లను బీజేపీ ఉపేక్షించే ప్రసక్తే లేదు..

• మహిళలకు అత్యంత గౌరవంతోపాటు వచ్చే ఎన్నికల్లో సముచిత స్థాయిలో టిక్కెట్లు ఇచ్చే పార్టీ బీజేపీ. గెలిచే మహిళా నేతలకు తప్పకుండా టిక్కెట్లు ఇస్తాం..

• మహిళల అత్మ, గుండె ధైర్యం గొప్పది. భర్త చనిపోతే భార్య ధైర్యంగా బతకగలుగుతుంది… కానీ భర్త బతకడం చాలా కష్టం…

• బీజేపీ అధికారంలోకి రావడానికి మహిళలు కీలక పాత్ర పోషించాలి. మహిళా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలి.

• ప్రీతి ఘటన విషయంలో మీ పోరాటం భేష్. కేసీఆర్ సర్కార్ ప్రీతి చనిపోతే రూ.10 లక్షల సాయం చేస్తారట… కేసీఆర్ బిడ్డ వాచీకి రూ.20 లక్షలతో కొనుగోలు చేస్తారట… కేసీఆర్ కుక్కకు ఇచ్చే విలువ తెలంగాణలో ప్రజలకు దక్కడం లేదు…

• కేసీఆర్ పొరపాటున మళ్లీ సీఎం అయితే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసేవాళ్లకు ప్రోత్సహకాలు ఇస్తారేమో..

• పాతబస్తీలో 30 వేల దొంగ బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు స్రుష్టించారు. పాతబస్తీ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. పాతబస్తీలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలియడం లేదు. రోహింగ్యాలకు అడ్డా అయ్యింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లు యధేచ్చగా వస్తున్నారు. అందుకే నేను సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తానంటే చాలా మంది విమర్శించారు. ఇప్పుడేమంటారు?

• ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు భద్రత వచ్చింది. భర్త వచ్చి తలాక్…తలాక్..తలాక్ అంటే… భార్య ‘మోడీ..మోడీ…మోడీ’ అనే పరిస్థితి వచ్చింది. ఆమె అన్నదమ్ములొచ్చి బెదిరిస్తే… ‘‘యోగి …యోగి…యోగి’’అనే ధైర్యంగా అనే పరిస్థితి వచ్చింది.

• ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు అనే నినాదం మనది… కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో అందుకు భిన్నమైన పరిస్థితి. ఎంతమందినైనా కనాలనే భావన ఆ వర్గంలో ఉంది. మహిళలను ఇబ్బంది పెట్టే దుస్థితి ఏర్పడింది. అందుకే ముస్లిం మహిళల భద్రత కోసం మోదీ ప్రభుత్వం క్రుషి చేస్తోంది.

• ఎన్నికలెప్పుడు వచ్చినా మహిళా మోర్చా నేతలంతా రుద్రమదేవీ, ఝాన్సీ లక్ష్మీబాయి మాదిరిగా ఉద్యమించాలి. బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X