“కూలిపోయే దశలో డబుల్ బెడ్రూం ఇండ్లు”

తెలంగాణలో ఇండ్ల కోసం ఎంతమంది దరఖాస్తు చేశారు? ఎన్ని కేటాయించారు?

-సీఎం కేసీఆర్ వివరాలు ప్రకటించాల్సిందే

-కూలిపోయే దశలో డబుల్ బెడ్రూం ఇండ్లు

-తెలంగాణ ప్రభుత్వం కోరితే కేంద్రం నుండి పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా

-కేంద్రం 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే 7 వేల మందికే కేటాయించి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంతమంది దరఖాస్తు చేశారు? ఎంతమందికి ఇండ్లు కేటాయించారో వివరాలు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే… కేసీఆర్ ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందని, అధికారులను నిలదీస్తే 7 వేల మందికే ఇండ్లను కేటాయించినట్లు తేల్చారన్నారు. పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం కోరితే పెద్ద ఎత్తున ఇండ్లను మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు కూకట్ పల్లి మూసాపేటలో బీజేపీ నేతలు చేస్తున్న ‘‘ఆత్మగౌరవ దీక్ష’’కు బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు.

అనంతరం బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్రం పేదల కోసం మంజూరు చేస్తున్న ఇండ్లను పేదలకు అందించాలని, డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు కేటాయించాలని ‘‘ఆత్మగౌరవ దీక్ష’’ చేస్తున్న బీజేపీ నేతలకు అభినందనలు.

• తెలంగాణ ప్రజలు నిలువ నీడ లేక జనం చచ్చిపోతున్నరు. ఎక్కడ ఖాళీ స్థలముంటే అక్కడ గుడిసె వేసుకుని ఎండకు ఎండుతూ వానకు తడస్తూ అల్లాడుతున్నరు.

• కూకట్ పల్లికి వచ్చి ఎంతోమంది ఇక్కడే ఏండ్ల తరబడి అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేకపోతున్నరు. ఇట్లాంటి పేదల బాధలను తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్లను నిర్మించింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు కావాలని అడిగితే లక్షన్నర ఇండ్లు కావాలని కేసీఆర్ చెబితే… మరో లక్ష ఇండ్లు అదనంగా మంజూరు చేశారు.

• కానీ కేసీఆర్ మాత్రం ఆ ఇండ్లు పేదలు ఉండలేరు.. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని ఊరించి మోసం చేసిండు. కేసీఆర్ కొడుకు మాటలన్నీ కొంపలు ముంచేవే. అమెరికా పోయి చదివిన చదువు మోసం చేయడానికే తప్ప.. సంగారెడ్డిలో ఇయాళ ఆ కుటుంబం సంగతి చెబుతా….

• కేంద్రం మంజూరు చేసిన ఇండ్లలో తెలంగాణ ప్రజలకు ఎన్ని ఇండ్లు కట్టించారని నిలదీస్తే… 7 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేశారని అధికారులు తేల్చారు? రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తే 7 వేలు ఇండ్లు మాత్రమే కట్టి పేదల నోట్లో మట్టి కొడుతున్నడు కేసీఆర్.

• మాటలు కోటలు దాటుతయ్… డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పెద్ద పెద్ద గ్రాఫిక్స్ తో వీడియో తీసి కేంద్రానికి చూపించిన కేసీఆర్ ప్రభుత్వం పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే.

• డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారు? ఎంతమందికి ఇండ్లు కేటాయించారు? ఎంతమంది ఆ ఇండ్లలో నివాసముంటున్నారో దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలి. అక్కడక్కడా కడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం నాసిరకంగా ఉన్నయ్. ఇండ్లలోకి వెళ్లకముందే కూలిపోయే దశలో ఉన్నయ్.

• తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు? 1400 మంది యువకుల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణ ఎవడి పాలైంది? వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కు పేదలకు రెండు గదుల ఇండ్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదు.

• అందుకే పేదల పక్షాన బీజేపీ ఉద్యమిస్తోంది. ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నరు. అయినా సరే బెదిరేది లేదు. పేదలకు ఇండ్లు ఇచ్చే వరకు పోరాడతాం..

• తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలువనీడ లేని పేదలందరికీ ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తాం. ఇన్నాళ్లు బాధపడ్డరు. మరొక్క 5 నెలలు ఓపిక పట్టండి. బీజేపీ అధికారంలోకి రాంగనే అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం. ఉచితంగా విద్య, వైద్యం అందిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X