हैदराबाद: एआईएमआईएम के अध्यक्ष और सांसद असदुद्दीन ओवैसी ने कहा कि देश का बंटवारा एक ऐतिहासिक गलती है और वह इसका जवाब एक लाइन में नहीं दे सकते। ओवैसी ने इस ऐतिहासिक भूल के लिए देश के विभाजन के समय के नेताओं को दोषी ठहराया। उन्होंने अपनी टिप्पणियों पर स्पष्टता पाने के लिए भारत के पहले शिक्षा मंत्री मौलाना अबुल कलाम आज़ाद द्वारा लिखित पुस्तक ‘इंडिया विंस फ़्रीडम’ पढ़ने का सुझाव दिया।
ओवैसी ने आगे कहा, “मौलाना अबुल कलाम आज़ाद ने तत्कालीन कांग्रेस नेताओं से देश का विभाजन न करने की प्रार्थना की थी। यहां तक कि इस्लाम के धार्मिक नेताओं ने भी उस समय दो-राष्ट्र सिद्धांत का विरोध किया था।” उन्होंने कहा कि देश का बंटवारा दुर्भाग्यपूर्ण था और ऐसा नहीं होना चाहिए था। उन्होंने टिप्पणी की कि देश के विभाजन के लिए उस समय के सभी नेता जिम्मेदार है। उन्होंने ये टिप्पणी सोमवार को हैदराबाद में आयोजित एक मीडिया कॉन्फ्रेंस में की। ओवैसी इस टिप्पणी से एक बार फिर हड़कंप मच गया है।
“దేశ విభజన చారిత్రక తప్పిదము“
హైదరాబాద్ : దేశ విభజన చారిత్రక తప్పిదమని, దానికి తాను ఒక్క లైన్‌లో సమాధానం చెప్పలేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ చారిత్రక తప్పిదానికి దేశ విభజన సమయం నాటి నాయకులే కారకులని ఆరోపించారు. తాను చేస్తున్న కామెంట్స్ పై క్లారిటీ రావాలంటే భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించిన ‘ఇండియా విన్స్ ఫ్రీడం’ పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు.
‘‘దేశాన్ని విభజించవద్దని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అప్పటి కాంగ్రెస్ నేతలను కలిసి వేడుకున్నారు. ఇస్లాం మతపెద్దలు కూడా రెండు దేశాల సిద్ధాంతాన్ని అప్పట్లో వ్యతిరేకించారు’’ అని ఒవైసీ పేర్కొన్నారు. దేశ విభజన దురదృష్టకరమని, అది జరగకుండా ఉండాల్సిందన్నారు. దేశ విభజన జరగడానికి ఆ సమయంలో ఉన్న నాయకులు అందరూ బాధ్యులే అని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. (ఏజెన్సీలు)