हैदराबाद: अरुण सागर ट्रस्ट का त्रिकेय पुरस्कार वरिष्ठ पत्रकार के रामचंद्र मूर्ति को और साहित्य पुरस्कार कुप्पिली पद्मा को दिया जाएगा। अरुण सागर ट्रस्ट की ओर से जारी बयान में कहा गया है कि 12 फरवरी को भद्राचलम शहर के वीरभद्र समारोह हॉल में यह पुरस्कार प्रदान किए जाएंगे।
बयान में आगे बताया है कि तेलंगाना मीडिया अकादमी के अध्यक्ष अल्लम नारायण की अध्यक्षता में होने वाले समारोह में सीपीएम के राज्य सचिव तम्मिनेनी वीरभद्रम, सीपीआई के राज्य सचिव कूनमनेनी सांबशिव राव, तेलंगाना साहित्य अकादमी के अध्यक्ष जुलुरु गौरीशंकर, बीआरएस एमएलसी गोरेटी वेंकन्ना, विधायक क्रांति किरण, टीएसपीएससी पूर्व अध्यक्ष घंटा चक्रपाणि, आंध्र ज्योति के संपादक के. श्रीनिवास, साक्षी संपादक वरधेल्ली मुरली और अन्य भाग लेंगे।
అభినందనలు- సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తికి త్రికేయ అవార్డు మరియు కుప్పిలి పద్మకు సాహిత్య పురస్కారం: అరుణ్ సాగర్ ట్రస్ట్
హైదరాబాద్ : త్రికేయ పురస్కారం రామచంద్ర మూర్తికి, సాహితీ పురస్కారం కుప్పిలి పద్మకు అందించనున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రాచలం పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో వచ్చే నెల (ఫిబ్రవరి) 12వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు అరుణ్ సాగర్ ట్రస్ట్ ప్రకటించింది.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే సభలో విశిష్ట అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గౌరవ అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టిఎస్పిఎస్సి. మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళి తదితరులు పాల్గొంటారని అరుణ్ సాగర్ ట్రస్ట్ పేర్కొంది. (ఏజెన్సీలు)