నరేంద్ర మోదీ ని ఎదిరించే దమ్మున్న నాయకుడు KCR: ఎపి యువత మరియు విద్యార్థి JAC రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్

◆ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎపీ యూత్ అండ్ స్టూడెంట్స్ జెఎసి సమావేశం
◆ అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఎపి యువత మరియు విద్యార్థి జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ...

హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పు కోసం, జన జీవితాల్లో వెలుగులు నింపి, జాతి ప్రజలను నూతనదారుల్లో నడిపించడానికి, గొప్ప కల్పన, మార్గదర్శక శక్తి కలిగిన కేసీఆర్ గారు దేశం నలుమూల బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తుండటం రెండు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వపడే పరిణామమని అన్నారు. దేశ చరిత్రలో ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని ఎత్తుకొన్న మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారేనని కొనియాడారు. స్వంతంగా జాతీయ పార్టీ స్థాపించి, ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ జెండా ఎగరేయడం ద్వారా తెలుగు ప్రజానీకం గుండెలు ఉప్పొంగేలా కేసీఆర్ చేశారని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తండ్లాడుతున్న భారతదేశానికి దారి చూపించడం కోసం సాహసోపేత అడుగులు వేస్తున్న కేసీఆర్ గారి వెంట దేశంలోని అన్ని వర్గాలు కదలాల్సిన చారిత్రక సందర్భమిదన్నారు.

జాతీయస్థాయిలో కేసీఆర్ లాంటి నేత ఉంటే ఏపీ మాత్రమే కాదు, ఈ దేశమే బాగుపడుతుంది. అభివృద్ధి, సకలజనుల సంక్షేమం పట్ల కెసిఆర్ గారికి ఉన్న తపనలో రవ్వంత ఏపీ నాయకులకు ఉన్న ఆంధ్రప్రదేశ్ బాగుపడేదని ఆవేదన వెలిబుచ్చారు. విభజన తర్వాత రెండు చోట్ల ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, ఉద్యమనేత కేసిఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశ్వరూపం చూపించారని అన్నారు. ప్రతి అడుగులో ప్రతి పథకంలో అభ్యుదయం కుల, మత రహితమైన సార్వజనీన ప్రగతి సిద్ధాంతంతో పాలనకు నూతన నిర్వచనం రాశారు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్యన వెయ్యి కిలోమీటర్ల పొడవైన సరిహద్దు (బార్డర్) ఉన్నది. ఏపీ సరిహద్దుకు అవతల తెలంగాణలో కేసీఆర్ గారి నేతృత్వంలో సాకారమైన ప్రగతి విప్లవం అందరికీ కనిపిస్తూనే ఉన్నదని అన్నారు.

అరిగోసలుపడ్డ, అత్యంత వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం నలుమూలలా మన కండ్ల ముందటే పచ్చబడ్డది. సాగు నీటి ప్రాజెక్టులు శీఘ్రగతిన పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు రైతుబంధు, రైతు బీమా లాంటి చారిత్రక, అద్భుతమైన రైతాంగ సంక్షేమ పథకాలను కెసిఆర్ గారు అమలు చేశారని వివరించారు. అసలు ఇలాంటి సంక్షేమ పథకాల ఆలోచనన్న ఆంధ్రా నాయకులకు కలుగుతుందా..? అని సూటిగా నిలదీశారు. అలాగే వేలాది కోట్లు వెచ్చించి యుద్ధప్రాతిపదికన మిషన్ భగీరథ పథకాన్ని పూర్తిచేసి తెలంగాణలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీటిని తెలంగాణ సీఎం కెసిఆర్ అందించారు. వెయ్యికి పైగా గురుకులాలు స్థాపించి, లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు బంగారు భవితకు బాటలేశారు. 24 గంటల కరెంటు సరఫరా, టీఎస్ ఐపాస్ లాంటి గొప్ప పథకం ద్వారా వేలాది పరిశ్రమల స్థాపన.. ఇలాంటి నూతన, అత్యద్భుత ఆవిష్కరణల కేంద్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ తీర్చిదిద్దబడ్డదని జగదీష్ వివరించారు.

కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇద్దరూ గోల్మల్ నాయకుల చేతుల్లో చిక్కి తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వెలిబుచ్చారు.. ప్రపంచస్థాయి రాజధాని అని ఒకరు, మూడు రాజధానులను నిర్మాణం అని మరొకరు. ప్రజలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఎనిమిదిన్నర ఏండ్లు గడిచినా కనీసం ఒక పరిపాలన కేంద్రాన్ని నిర్ధారించలేని అసమర్థ నాయకత్వం చేతుల్లో ఏపీ అల్లాడుతున్నదని అన్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టిందీ లేదు, ఒక పరిశ్రమను కొత్తగా తెచ్చింది లేదు. చివరికి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ గద్దలకు కట్టబెడతామని నిండు పార్లమెంట్లో నరేంద్ర మోదీ ప్రకటిస్తున్నా కనీసం నోరు మెదపలేని దద్దమ్మలుగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ లోని ఆంధ్ర నాయకులు మారరని విమర్శించారు. ఇక దగుల్బాజీ చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. 2009లో టీఆర్ఎస్ తో, 2014లో బీజేపీ తో 2019లో కాంగ్రెస్ తో ఇప్పుడు మళ్ళీ బీజేపీతో పొత్తు కోసమే వెంపర్లాడుతున్నాడని విమర్శించారు. గద్దెనెక్కిన ప్రతిసారీ, ఎన్నికలొచ్చినప్పుడల్లా, జనాలను నిండా ముంచేయడం తప్ప చంద్రబాబు చేసిందేమిటి..? అని నిలదీశారు. చంద్రబాబు మోసాలన్నీ మన కళ్ళముందే జరిగాయి కదా..? దీని తర్వాత కూడా ఈ మోసకారి చంద్రబాబును నమ్ముదామా…? అని ప్రశ్నించారు.

ఈ కులగజ్జి గాళ్ళ ప్రచారంలో పడి ఇంకా మోసపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. పచ్చి అవకాశవాదం, ఊసరవెల్లుల రాజకీయాలు, దోపిడీకి అలవాటుపడిన ఈ నాయకులను ప్రజలందరూ ఈసడించుకుంటున్నారన్నారు. ఉద్యమ నాయకుడిగా, పాలనాధక్షుడిగా, భారతదేశం భవిష్యత్తు కోసం, దేశంలోని సకలజనులను నడిపిస్తున్న కేసీఆర్ గారి పర్సనాలిటీ ముందు ఈ అబద్ధాల నాయకులందరూ మరుగుజ్జులు మాత్రమే. ఒక్క ఏపీకి మాత్రమే కాదు దేశానికి కేసీఆర్ గారి నాయకత్వం చారిత్రక అవసరం అని అన్నారు. ఉన్నతమైన, ప్రగతి శీల ఆలోచనలతో బడుగు, బలహీన, దళిత, మైనార్టీలతో పాటు సకల జనులంతా ఏకమై ‘ బీఆర్ఎస్ ‘ జెండా తెచ్చుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని యువతకు పిలుపునిచ్చారు. ఆ దిశగా అభ్యుదయవాదులందరం చెయ్యి, చెయ్యి కలుపుదాం. ఎపీతో పాటు దేశం కోసం ఏకోన్ముఖంగా కదులుదామన్నారు. నియంతగా మారి, ప్రయివేటీకరణ తో పాటు పలు విధాలుగా దేశాన్ని ఆదానీ లాంటి వ్యాపారులకు దోచిపెడుతున్న నరేంద్ర మోదీ ని ఎదిరించే దమ్మున్న నాయకుడు కెసిఆర్ మాత్రమే అన్నారు. వారి మార్గం లో కదిలి దేశంలో గుణాత్మక రాజకీయాలు సాకారం చేసుకుందామని రాయపాటి జగదీష్ పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X