హైదరాబాదు: హిమాయత్ నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ నందు 11వ తేదీ ఆదివారం ఉదయం 10:00 నుండి జరుగుతుంది. ఈ సభలో చరిత్రగా మిగులుతున్న గ్రంథాలయాల గురించి, డిజిటల్ కాలంలోనూ గ్రంధాలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో, తెలంగాణలో నడుస్తున్న వివిధ గ్రంథాలయ ప్రయోగాలు, ఇళ్లలో- ఊళ్ళలో బడుల్లో గ్రంథాలయాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో చర్చిస్తారు.
ఈ సభకు భూమన్, వేదకుమార్, కే శివారెడ్డి, కే శ్రీనివాస్, వాడ్రేవు చినవీరభద్రుడు, గుడిపాటి కవి యాకూబ్, పెద్దింటి అశోక్ కుమార్, స్కై బాబా సంగిశెట్టి శ్రీనివాస్ వొమ్మిరమేష్, వి ఆర్ శర్మ, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సీఎ ప్రసాద్, ఉపేందర్ రెడ్డి, బుద్ధి యజ్ఞమూర్తి, పూడూరి రాజిరెడ్డి, బండారు విజయ, యంవీ రామిరెడ్డి, అన్నవరం దేవేందర్, దేశరాజు, జిఎస్ చలం, ఎస్ కాత్యాయని, సోమిరెడ్డి బమ్మిడి జగదీశ్వరరావు, ఆశా రాజు, నాగసూరి వేణుగోపాల్, చొక్కాపు వెంకటరమణ, కాసుల రవికుమార్, ఆస్వా శ్రీనివాస్ హరిత, గరిపెళ్ళ అశోక్ పోరెడ్డి అశోక్, కే జితేంద్ర, శాంతారావు, కొసరాజు సురేష్, మంచికంటి, వెంకటకృష్ణ, దశరథ్ సంజీవ్ మొదలైన వాళ్ళు పాల్గొంటారు మరియు ప్రసంగిస్తారు.