దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య తెలంగాణలోనే ఎక్కువ : ప్రొ. ఇ. రేవతి

హైదరాబాద్: ఉన్నత విద్యలో జాతీయ స్థాయిలో నమోదు సగటు 28 శాతం (GER) కంటే తెలంగాణాలో నమోదు అయ్యే సగటు 40 శాతం గా ఉన్నట్లు సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్ ప్రొ. ఇ. రేవతి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయo, ఆర్థిక శాస్త్ర విభాగం, తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్; తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఐసీఎస్ఎస్ఆర్ – దక్షణ భారత ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు – మూల్యాంకనం’ అనే అంశంపై జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొ. ఇ.రేవతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ప్రొ. రేవతి మాట్లాడుతూ గత దశాబ్ధకాలంగా ఆయ రాష్ట్రాల్లో అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలను పరిశీలిస్తే తెలంగాణలో ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన స్థితిగతులను మార్చాయన్నారు. బడ్జెట్ లో ప్రభుత్వాలు విద్యకు కేటాయించేది చాల తక్కువగా ఉందని జాతీయ స్థాయిలో కేటాయింపులతో పోలిస్తే తక్కువని ఇది నాణ్యమైన విద్యను అందించడానికి సరిపోదన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే వారిలో మహిళల సంఖ్య పెరుగుతోందని, ఎస్సీ, ఎస్టీల సంఖ్య కూడా పెరుగుతుండడం శుభపరిణామం అన్నారు. అన్ని విద్యా సంస్థల్లో ఖాళీలు ఇబ్బందికరంగా మారిందని ఇది మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్రం విభాగ డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ డీన్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ పరిశోధనలు కేవలం ప్రభుత్వ పతకాలపైనే కాకుండా క్షేత్ర స్థాయిలో అవి ఏ విధంగా అమలు అవుతున్నాయి, లభ్ది దారుల ఆర్ధిక స్తిగతులు మారాయా లేదా అనే అంశాలను కూడా సూక్ష్మ స్థాయిలో పరిశోధకులు పరిశీలించాలని పరిశోధక విద్యార్ధులకు సూచించారు. కార్యక్రమానికి తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొ. కె. ముత్యంరెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ కార్యదర్శి డా. బి. వెంకటేశ్వరరావు సంస్థ లక్ష్యాలను, కార్యకలాపాలను వివరించారు. సదస్సు స్థానిక కార్యదర్శి, అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి, డా. కె. కృష్ణా రెడ్డి రెండు రోజుల సదస్సు రిపోర్ట్ ను సభకు సమర్పించారు. రెండు రోజుల సదస్సులో పలు విద్యాసంస్థల నుంచి 170 పరిశోధక పత్రాలు రాగా 92 మంది ప్రత్యక్షంగా హాజరై తమ తమ పరిశోధనా పత్రాలను సంర్పించారన్నారు. కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, డీన్లు, అధ్యాపకులు, పలు విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల నుంచి వచ్చిన పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

డిగ్రీ, పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ ఫిబ్రవరి 29

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ) కోర్సులు,  B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరం ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయినట్లు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డా. ఎల్వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in మరియు www.braou.ac.in లో పొందొచ్చని అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 29, 2024. అలాగే  రూ.200/- ఆలస్య రుసుముతో మార్చి 31, 2024 వరకు అని పేర్కొన్నారు.

విద్యార్థులు ‘ఆన్‌లైన్’ ద్వారా డిగ్రీ పీ.జీ ప్రవేశాల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్/ట్యూషన్ ఫీజును క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా లేదా T.S/A.P ఆన్‌లైన్ ఫ్రాంచైజ్ సెంటర్ల ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580 లేదా 040-23680222/333/555 లో సంప్రదించొచ్చని  సూచించారు.

Last date for Registration is February  29

Hyderabad: The Direct Admission through “Online” for Under Graduate (B.A/B.Com/B.Sc) and Post Graduate – M.A, M.Com, M.Sc, BLISc, MLISc, P.G. Diplomas Courses and Certificate programmes of Dr. B. R. Ambedkar Open University (BRAOU) for the Academic year 2023-24. Those who are completed Intermediate or Equivalent from National Open School or AP/TS Open School Society can take the direct admission in to UG, those who are completed under Graduate courses can take admission into PG Courses. Last date without late fee is February 29, 2024. And with a late fee of Rs.200/- is March 31, 2024.

 The Candidates enroll themselves for admissions through ‘Online’. The Admission/Tuition fee can be paid by through Credit Card/Debit Card or through T.S/A.P Online Franchise Centres only.  Study centres are located in Telangana and Andhra Pradesh. The Admissions Prospectus are available in the University Portal www.braouonline.in or www.braou.ac.in and also available free of cost at all the Study Centres in the States of Telangana and Andhra Pradesh. For more details contact on 7382929570/580 or 040-23680222/333/555.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X