हैदराबाद: आंध्र प्रदेश के सीएम वाईएस जगन मोहन रेड्डी की अध्यक्षता में बुधवार को हुई कैबिनेट की बैठक में कई अहम फैसलों को मंजूरी दी गई। हाल ही में अनुबंध कर्मचारियों के नियमितीकरण पर एक महत्वपूर्ण निर्णय लिया गया और कैबिनेट ने इसे मंजूरी दे दी। यह नियमितीकरण 2 जून 2024 तक पांच साल पूरे कर चुके कर्मचारियों पर लागू होगा।
साथ ही, कैबिनेट ने ‘अम्मा ओडी योजना’ के कार्यान्वयन और शैक्षिक सामग्री के वितरण को मंजूरी दी। इन्वेस्टर्स समिट में एमओयू करने वाली कुछ कंपनियों को जमीन आवंटन की स्वीकृति दी गई। इसके अलावा AP गारंटीड पेंशन बिल 2023 नामक एक नई पेंशन प्रणाली को लागू करने का निर्णय लिया है। कैबिनेट ने सभी 63 मदों को मंजूरी दे दी है।
सीपीएस कर्मचारियों के लिए जीपीएस एपी सीपीएस बिल लाएगा। साथ ही कैबिनेट ने 12वीं पीआरसी के गठन पर सहमति जताई है। इसके अलावा कैबिनेट ने 18.58 लाख कृषि बिजली कनेक्शन को स्मार्ट मीटर से जोड़ने के लिए 6,888 करोड़ रुपये खर्च करने की मंजूरी दी है। मंत्रिमंडल ने ग्रामीण क्षेत्रों में इंटरनेट के लिए एपीएफएसएल को 445 करोड़ रुपये के ऋण की मंजूरी दी।
![](https://telanganasamachar.online/wp-content/uploads/2023/06/ap.png)
ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు, వారందరికీ గుడ్ న్యూస్
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కీలక నిర్ణయం తీసుకోగా అందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు ఈ క్రమబద్దీకరణ వర్తించనుంది.
అలాగే అమ్మ ఒడి పథకం అమలు, విద్యాకానుక పంపిణీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఎంవోయూలు చేసుకున్న కొన్ని సంస్థలకు భూ కేటాయింపుకు ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 63 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సిపిఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ ఏపీ జిపిఎస్ బిల్లును తీసుకురానుంది. అలాగే 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వీటితో పాటు 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపుకు 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్ కు కేబినెట్ అనుమతి ఇచ్చింది. (ఏజెన్సీలు)
కేబినెట్ కీలక నిర్ణయాలు…
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ
ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ బిల్లు పేరుతో కొత్త పెన్షన్
సీపీఎస్ రద్దు
12వ పీఆర్సీ ఏర్పాటుకు ఆమోదం
కొత్త DA అమలు
సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు
జిల్లా కేంద్రంలో 16 శాతం HRA
మెడికల్ కాలేజీల్లో 2118 ఉద్యోగాల భర్తీ
కొత్తగా మెడికల్ కాలజీలకు 706 పోస్టుల భర్తీ
రూ.5 వేల కోట్ల రుణ సేకరణకు ఆమోదం
ఈ ఏడాది విద్యాకానుక పథక అమలుకు ఆమోదం
జూన్ 12 నుంచి 17 వరకు విద్యాకానుక వారోత్సవాలు
అమ్మఒడి నిధుల విడుదలకు ఆమోదం
గ్రూప్ 1, గ్రూప్ 2కు లైన్ క్లియర్