TPCC: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారికి బహిరంగ లేఖ

విషయం.. 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా దారి మళ్లించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలి.

రాష్ట్రంలో 12, 751 గ్రామ పంచాయతీ లలో సర్పంచుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కలరాస్తుంది. సర్పంచుల నిధులు, వీధుల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం, నిధులను పక్కదారి పట్టించడం, హక్కులను కాలరాస్తుండడంతో సర్పంచుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారింది..

రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులను దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసింది. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల గురించి విడుదల చేయాల్సిన 250 కోట్ల రూపాయలు 5 నెలలుగా విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అద్వాన్నంగా మారింది.

గ్రామాలలో సర్పంచ్ లు చేపట్టిన అభివృద్ధి పనులలో చాలా వరకు బిల్స్ పెండింగులో ఉన్నాయి… గ్రామాలలో సర్పంచ్ లు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసినా కూడా బిల్స్ రాకపోవడంతో వారు అప్పుల పాలు అయ్యి, వడ్డీల భారం పెరిగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో.పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన నిధులను విడుదల చేయడం లేదు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా తరలించడంతో సర్పంచ్ లు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. దీంతో గ్రామాలలో అభివృద్ధి పనులు అన్ని కొంటుపడిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ లకు ఈ ఎమ్ ఐ లు కట్టలేని పరిస్థితి ఉంది. పంచాయతీ ఉద్యోగులకు జీతాలు ఇక్కువలేజాపోతున్నారు.

అందువల్ల ఈ విషయంలో మీరు వెంటనే స్పందించి కేంద్రం ఇచ్చిన నిధులను వెంటనే గ్రామ పంచాయతీలకు అందించాలి. అలాగే స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా ఇచ్చే నిధులను వెంటనే విడుదల చేయాలి. గ్రామాలలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబందించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

లేని పక్షంలో సర్పంచుల హక్కుల సాధన కోసం, గ్రామ పంచాయితీలకు నిధుల విడుదల కోసం జనవరి 2వ తేదీన ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతాము..

– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు
ఎంపీ మల్కాజిగిరి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X