हैदराबाद: AIMIM विधायक अकबरुद्दीन ओवैसी ने तेलंगाना विधानसभा में सनसनीखेज बयान दिया। विधानसभा में केटीआर ने कहा कि एआईएमआईएम के अभी सात विधायक हैं। इसके जवाब में ओवैसी ने कहा कि हम अगले चुनाव में तेलंगाना में 50 सीटों पर चुनाव लड़ेंगे। उन्होंने आगे कहा कि वह यह सुनिश्चित करेंगे कि विधानसभा में एआईएमआईएम के 15 विधायक हों।
ओवैसी का यह ऐलान अब बन गया चर्चा का विषय
अकबरुद्दीन ओवैसी ने कहा कि वे ज्यादा से ज्यादा सीटों पर चुनाव लड़ेंगे और अपनी ताकत दिखाएंगे. AIMIM विधायक अकबरुद्दीन ओवैसी का यह ऐलान अब चर्चा का विषय बन गया है, वहीं कुछ ही दिनों में राज्य में चुनाव होने वाले हैं।
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం AIMIMకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా మేము 50 స్థానాల్లో పోటీ చేస్తాం. అంతేకాదు అసెంబ్లీలో 15 మంది AIMIM ఎమ్మెల్యేలు ఉండేలా చూసుకుంటాం అని అన్నారు.
ఎక్కువ సీట్లలో పోటీ చేసి తమ సత్తా ఏంటో…
వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపిస్తామని అక్బరుద్దీన్ ఒవైసి తెలిపారు. కాగా మరికొన్నిరోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉండగా AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏడుగురు ఎమ్మెల్యేలు
ఇదిలా ఉంటే రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న వారికి గంటసేపు కేటాయిస్తే తమకు ఎంత సమయం కేటాయిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో AIMIM ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని ఈ ప్రకటన చేసినట్లు అర్ధమవుతుంది.
అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్
మరోవైపు అసెంబ్లీలో అన్నీ చెబుతారు కానీ బయట నెరవేర్చరంటూ AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక పాతబస్తీకి మెట్రో సంగతేంటి?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ వాదించారు. ఉర్ధూ రెండో భాష అయినా అన్యాయమే జరుగుతుంది. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవనివ్వడం లేదన్నారు. మీరు చెప్రాసీని చూపిస్తే వారినైనా కలుస్తాం అని AIMIM ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
బీజేపీ మొదటి నుండి తెలంగాణకు అన్యాయమే…
బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇచ్చిందని కానీ బీజేపీ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందన్నారు అక్బరుద్దీన్. నోట్ల రద్దు, జిఎస్టీకి మద్దతు ఇవ్వొద్దన్నామని, బీజేపీ మొదటి నుండి తెలంగాణకు అన్యాయమే చేస్తుందన్నారు. ఇటు బీఆర్ఎస్ పై, అటు బీజేపీపై చంద్రయాన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. (ఏజెన్సీలు)