एग्रीकल्चरल साइंटिस्ट इब्राहिम अली अबूबकर सिद्दीकी का निधन, वैज्ञानिक और किसानों में शोक की लहर

हैदराबाद : एग्रीकल्चरल रिसर्च के क्षेत्र में एक बड़ी दुखद घटना घटी है। देश में चावल की वैरायटी रिसर्च में क्रांतिकारी बदलाव लाने वाले जीनियस और मशहूर एग्रीकल्चरल साइंटिस्ट इब्राहिम अली अबूबकर सिद्दीकी (89) ने आखिरी सांस ली है। साइंस और टेक्नोलॉजी सेक्टर के साथ-साथ किसान भी उनके निधन पर शोक मना रहे हैं।

चावल एक्सपोर्ट में भारत को टॉप पर पहुंचाने में सिद्दीकी का योगदान बेमिसाल है। उन्होंने दुनिया की पहली ज़्यादा पैदावार वाली छोटे तने वाली बासमती वैरायटी ‘पूसा बासमती-1’ को डेवलप करने में अहम भूमिका निभाई। देश में हाइब्रिड चावल की खेती को बढ़ावा देने और प्रोडक्टिविटी बढ़ाने की उनकी पहल के कारण उन्हें ‘इंडियन हाइब्रिड राइस का जनक’ कहा जाता है।

सिद्दीकी ने इंडियन काउंसिल ऑफ़ एग्रीकल्चरल रिसर्च (ICAR) में डिप्टी डायरेक्टर जनरल के तौर पर काम किया। उन्होंने हैदराबाद में डायरेक्टोरेट ऑफ़ राइस रिसर्च के डायरेक्टर के तौर पर भी काम किया। तमिलनाडु के रहने वाले सिद्दीकी ने अपनी रिसर्च से देश भर के लाखों किसानों की ज़िंदगी में रोशनी डाली। कई साइंटिस्ट और पॉलिटिकल लीडर्स उनके निधन पर गहरा दुख जता रहे हैं।

Also Read-

వ్యవసాయ శాస్త్రవేత్త ఇబ్రహీం అలీ అబూబకర్ సిద్ధిఖీ కన్నుమూత

హైదరాబాద్ : వ్యవసాయ పరిశోధనా రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశంలో వరి వంగడాల పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మేధావి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఇబ్రహీం అలీ అబూబకర్ సిద్దిఖీ (89) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల శాస్త్ర సాంకేతిక రంగంతో పాటు రైతాంగం సంతాపం వ్యక్తం చేస్తోంది.

భారతదేశం బియ్యం ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలవడానికి సిద్దిఖీ చేసిన కృషి అనన్యసామాన్యం. ప్రపంచంలోనే మొట్టమొదటి అధిక దిగుబడినిచ్చే పొట్టి రకం బాస్మతీ వంగడం ‘పూసా బాస్మతీ-1’ని అభివృద్ధి చేయడంలో ఆయనదే కీలక పాత్ర. దేశంలో హైబ్రిడ్ వరి సాగును ప్రోత్సహించి, ఉత్పాదకతను పెంచడంలో ఆయన చూపిన చొరవ వల్ల ఆయనను ‘భారత హైబ్రిడ్ వరి పితామహుడు’ అని పిలుస్తారు.

వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు సిద్దిఖీని వరించాయి 2011లో భారత ప్రభుత్వం ఆయనను నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ పేరు మీద ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డును ఆయన అందుకున్నారు. వ్యవసాయ పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభకు గాను బోర్లాగ్ అవార్డు లభించింది. ఆయన ‘నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్’ (NAAS) ఫెలోగా కూడా సేవలందించారు.

సిద్దిఖీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. స్వతహాగా తమిళనాడుకు చెందిన ఆయన, తన పరిశోధనల ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన మృతికి పలువురు శాస్త్రవేత్తలు, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X