Crime News : मंदिर में चोरी करने गये युवक की दुर्घटनावश मौत !

हैदराबाद : आधी रात को मंदिर में चोरी करने के लिए प्रवेश कर चुके चोर की दुर्घटनावश मौत हो गई। यह घटना हैदराबाद के कुशाईगुड़ा थाना क्षेत्र के श्री वेंकटेश्वर स्वामी मंदिर में प्रकाश में आई है। मिली जानकारी के अनुसार, कुशाईगुड़ा थाना क्षेत्र के श्री वेंकटेश्वर स्वामी मंदिर में बीती रात (मंगलवार) 11 बजे एक युवक ने चोरी का प्रयास किया। मंदिर में इधर-उधर टहलते हुए चोरी की कोशिश की। इसी क्रम में युवक ने मंदिर की हुंडी तोड़ने का प्रयास किया। इसके बाद गर्भगृह के अंदर जाने की कोशिश की।

इसी क्रम में मंदिर में रंगय्या नाम का शख्स चौकीदार की ड्यूटी कर रहा है। चौकीदार रंगय्या ने देखा कि एक बदमाश मंदिर में प्रवेश किया और चोरी कर रहा है। उसने चोर को पकड़ने की कोशिश की। इसी क्रम में चोरी करने आए युवक व रंगय्या के बीच हाथापाई हो गई। इस हाथापाई में युवक नीचे गिर गया और उसके सिर में गंभीर चोटें आईं। मंदिर में ही खून से लथपथ होकर वह गिर पड़ा और उसकी मृत्यु हो गई।

घबराए चौकीदार रंगय्या ने तुरंत मामले की सूचना पुलिस को दी। पुलिस ने फौरन मंदिर पहुंचकर चोरी की कोशिश करने वाले युवक के शव की जांच पड़ताल की। उसकी जेब में मिले मोबाइल के आधार पर उसकी पहचान गंडम राजू (23) के रूप में हुई है। उनका जन्म स्थान कामारेड्डी जिले के आरेपल्ली गांव निवासी के रूप में की गई है। शव को पोस्टमॉर्टम के लिए सरकारी अस्पताल में भेज दिया गया। पुलिस ने मामला दर्ज कर लिया है और मामले की जांच कर रही है।

క్రైం న్యూస్: గుడిలో చోరీకి వెళ్లిన యువకుడి ప్రమాదవశాత్తు మృతి!

హైదరాబాద్ : ఓ దుండగుడు అర్ధరాత్రి సమయంలో దొంగతనం చేయడానికి ఆలయంలో చొరబడి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుషాయగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత రాత్రి (మంగళవారం) 11 గంటల సమయంలో ఓ యువకుడు చోరీకి యత్నించాడు. ఆలయంలో తాచ్చడుతూ.. అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తాడు. ఆలయం హుండీలో చోరీకి యత్నించిన యువకుడు.. ఆ తర్వాత గర్భగుడి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఆలయంలో రంగయ్య అనే వ్యక్తి వాచ్‌మెన్ డ్యూటీ చేస్తున్నాడు. దుంగడుగు ఆలయం లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడుతున్నట్లు గమనించిన వాచ్‌మెన్ రంగయ్య అతడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దొంగతనానికి వచ్చిన యువకుడు, వాచ్‌మెన్ రంగయ్యకు మధ్య పెనగులాట జరిగింది. ఈ ఘర్షణలో యువకుడు కిందపడిపోగా.. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఆలయంలోనే కూప్పకూలి చనిపోయాడు.

ఆందోళనకు గురైన వాచ్‌మెన్ రంగయ్య వెంటనే విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. హుటహుటిన ఆలయానికి చేరుకున్న పోలీసులు.. దొంగతనానికి యత్నించిన యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. అతడి జేబులో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా అతడి పేరు గండం రాజు (23)గా గుర్తించారు. అతడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి అని తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X